బిగ్‌బాస్ రియాలిటీషో ద్వారా బాలీవుడ్‌లో పాపులర్ అయిన భామ సన్నీ లియోన్. ప్రస్తుతం ఈ సుందరి ‘జిస్మ్-2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుపుకుంటోంది. తొలి సినిమా నిర్మాణ దశలోనే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న సన్నీ లియోన్ ఓ కన్నడ సినిమా కోసం ప్రత్యేక గీతంలో నర్తించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సన్నీ స్పందిస్తూ ‘బాలీవుడ్‌లో నేను నటిస్తున్న తొలి చిత్రం ‘జిస్మ్-2’. ఈ చిత్రంతో పాటు ‘రాగిణి ఎంఎంఎస్-2’ సినిమాలో కూడా నటించడానికి అంగీకరించాను. ఈ రెండు సినిమాలు తప్పా నేను మరే చిత్రమూ ఇప్పటి వరకు అంగీకరించలేదు. నేను ప్రత్యేక గీతాల్లో నటిస్తానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. అవన్నీ వట్టి గాలివార్తలే. వాటిని ఎవరూ నమ్మకండి. ఇప్పటి వరకు నేను ప్రత్యేక గీతాల్లో నటించాలని ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సినిమాలు చెయ్యడానికే తీరికలేని నాకు ప్రత్యేక గీతాల్లో నటించే సమయం ఎక్కడుంటుంది’ అని తెలిపింది.
సెలబ్రిటిస్ వాడిన దుస్తుల్ని వేలం పాటల్లో పెట్టడం పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణం. అక్కడి జనాలు కూడా వేలం సదరు దుస్తులకై ఎగబడతారు. లోదుస్తువులకైతే డిమాండ్ మరీ ఎక్కువగా వుంటుందన్నది వేరే విషయం. తాజాగా ‘జిస్మ్ 2’ చిత్రంతో బాలీవుడ్‌లో దుస్తుల వేలం పాట ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోంది నిర్మాత పూజాభట్. నీలి చిత్రాల సుందరి సన్నీలియోన్ ‘జిస్మ్ 2’ చిత్రం ద్వారా బాలీవుడ్ చిత్రసీమకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. తను నటిస్తోన్న తొలి చిత్రం విడుదల కాకముందే సన్నీలియోన్ దేశవ్యాప్తంగా విశేషమైన పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్‌లో ఈ సుందరికి ప్రత్యేక క్రేజ్ వుంది. దీంతో ఈ భామ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ‘జిస్మ్ 2’ నిర్మాతలు ఆన్‌లైన్‌లో వేలం పాటను నిర్వహించనున్నారు. చిత్రంలో సన్నీలియోన్ ఉపయోగించిన లోదుస్తుల్ని ఆన్‌లైన్ వేలంలో పెట్టనున్నారు. అంతేకాదు వేలంపాటలో వచ్చిన మొత్తాన్ని చారిటీ కార్యక్రమాలకు వినియోగిస్తానని తెలిపింది నిర్మాత పూజాభట్. ఆమె మాట్లాడుతూ- ‘హాలీవుడ్‌లో ఇలాంటి వేలంపాటలు సాధారణంగా జరుగుతుంటాయి. వీటితో సినిమాకు ప్రమోషన్ తో పాటు చారిటీ కార్యక్రమాలకు అనుకున్న డబ్బు సమకూరుతుంది’ అని చెప్పింది. సన్నీలియోన్ లోదుస్తుల కోసం కుర్రకారు వేలంపాటలో ఎగబడటం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more