ఉపఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. దీంతో అన్ని పార్టీల అగ్రనేతల పర్యటనలతో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్ధుల గెలుపు కోసం అగ్రనేతలు తీవ్రవంగా శ్రమిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, మంత్రి రామచంద్రయ్యలు ప్రచారం నిర్వహించారు. ఉపఎన్నికలకు జగన్ స్వార్థమే కారణమని ఉపఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
వైఎస్ ప్రమాదంపై జగన్ కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తున్నారని ప్రమాదం గురించి ముందే తెలిసుంటే తమ ప్రాణాలు అడ్డుపెట్టి వైయస్ ను కాపాడుకునే వాళ్లమని సీఎం అన్నారు. అటు జగన్ పై ఎంపీ చిరంజీవి మండిపడ్డారు. కుటిల స్వార్ధం వల్లే ఉపఎన్నికలు వచ్చాయని ఆయనకు ఓటేస్తే అవినీతిని ప్రోత్సహించిన వాళ్లు అవుతారని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేశారు. తిరుపతి స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయన ఇప్పటికే నాలుగుసార్లు ప్రచారం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో కలిసి రోడ్ షో నిర్వహించారు.
ఎనిమిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయి ఇరవైయేళ్లు వెనక్కివెళ్లిందన్నారు. రాజశేఖర్ రెడ్డి పేదలను కొట్టి కుటుంబ సభ్యులకు కోట్లాది రూపాయలు కూరబెట్టారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కాంగ్రెస్.. వైయస్ఆర్ సీపీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. రెండు పార్టీలు దొంగలపార్టీలే అని వారికి ఓట్లేస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారని అన్నారు. ఉపసమరంలో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రత్యర్ధులను చిత్తు చేసేందుకు మాటల తూటాలు పేలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రత్యక్షం చేసుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.
అటు వైఎస్ఆర్ సీపీ నేతలు కాంగ్రెస్, టీడీపీ లను విమర్శిస్తున్నారు. వైఎస్ విజయమ్మ ఆదివారం ఉదయం నెల్లూరులో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరులోని మేకపాటి రాజమోహన్ రెడ్డి అతిథిగృహం నుంచి షర్మిలతో కలిసి ఆమె ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. బుజబుజ నెల్లూరులో దివంగత ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు. అనంతరం బుజబుజ నెల్లూరులో రోడ్ షో ప్రారంభించారు.
కాగా, ఎంపీ చిరంజీవి కాపులకు తీరని అన్యాయం చేశారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చేగొండి హరిరామ జోగయ్య ఆరోపించారు. ఇప్పుడు కాపులందర్ని కాంగ్రెస్ వైపు తిప్పాలని ప్రయత్నిస్తున్నారని.. కాపు సోదరులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదివారం ఏలూరులో సూచించారు. పీసీసీ చీఫ్ తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాల కోసం అవినీతి సొమ్మును వెచ్చించారని జోగయ్య ఆరోపించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more