కొన్ని సినిమాలు మల్లియలు. ఇంకొన్ని సంపెంగలు, మరికొన్ని పారిజాతాలు. ఒక్కోదానిది ఒక్కో తరహా పరిమళం. బ్రహ్మకమలం మాత్రం అరుదుగానే పుడుతుంది. 50 ఏళ్ల కిత్రం వెండితెరపై విరబూసిన బ్రహ్మకమలం ‘‘గుండమ్మకథ’’. ఇప్పటికీ అదే పరిమళం.. ఒకే పరవశం. సమ ఉజ్జీలైన ఇద్దరు కథానాయకులు కలిసి నటిస్తున్నారంటే.. తెరపై పాత్రలు పోటాపోటీగా ఉంటాయోమో అనుకొంటారు ప్రేక్షకులు. అన్నదమ్ములుగా నటిస్తున్నారని తెలిసే.. రకరకాల మలుపులు ఊహిస్తుంటారు. అందుకు భిన్నంగా రూపొందింది కాబట్టే గుండమ్మకథ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇందులో రెండు జంటలున్నాయి. ఎన్టీరామారావు – సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు – జమున లు నటించారు. యాభయ్యేళ్లయినా గుండమ్మ కథని మరిచిపోలేక పోవడం వెనక బ్రహ్మ రహస్యమేమీ లేదట. సినీ పరిభాషలో చెప్పాలంటే .. కథ, కథనాలు చక్కగా కుదిరాయి, నటీ నటులు తమ తమత పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేయటం జరిగిందని అక్కినేని నాగేశ్వరావు చెబుతున్నారు.
ఎస్వీ రంగారావు మొదలుకొని సూర్యకాంతం , సావిత్రి, జమున ఛాయదేవి, ఇలా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో నటించారు. వారిలో ఏ ఒక్కరు లేకపోయిన ఆ సినిమాకి లోటే.
అయిదు దశాబ్దాలైనా గుండమ్మ కథను మరొసారి తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తునే ఉన్నారు. గుండమ్మ గుర్తొచ్చినప్పడల్లా ప్రేక్షకుల గుండె తెరపై ఆ బొమ్మ ఆడుతూనే ఉంటుంది. ఆ చిత్రరాజాన్ని రీమేక్ చేస్తే గుండమ్మగా ఎవరైతే బాగుంటారు? హీరోలు ఎవరు? అనే ప్రశ్నలు ఈ నవతరం దర్శకుల ముందున్నాయి. ఆ దర్శక నిర్మాతలకు ప్రశ్నలకు సమాధానం పంపించింది ఒక నూతన హీరోయిన్. గుండమ్మ కథలో గుండమ్మ పాత్రకు అమ్మ సరిపోతుందని మీడియ ప్రకటన చేస్తుందట.
గుండమ్మ కథలో హీరోలుగా ఎన్టీఆర్ , నాగచైతన్యలతో తీస్తే బాగుంటుంది. కానీ గుండమ్మ పాత్ర గురించి ఆలోచిస్తేనే.. దర్శకులకు సమాధానం దొరకటంలేదట. అలాంటి దర్శకులు ఒక్కసారి మా అమ్మ ను గుండమ్మగా ఊహించుకోండి అని .. కుర్ర హీరోయిన్ ఉచిత సలహాలు ఇస్తుందట. ఆ నటి ఎవరోకాదు.. అలనాటి రాధ. ఇప్పుడు రాధను గుండమ్మగా ఊహించుకోండి అని ఉచిత సలహా ఇచ్చిన కుర్ర హీరోయిన్ రాధ కూతురు కార్తీక.
కార్తీక ఇప్పటికే నాగచైతన్యతో ఒక సినిమా , ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసి తెలుగు ప్రజలకు పరిచయం అయింది. కార్తీక గుండమ్మ కథ సినిమా అంటే చాలా ఇష్టమాట. అందుకే తన తల్లి రాధను గుండమ్మగా చూడాలని చెబుతుందట. పైకి మాత్రం అమ్మకోసమానే గానీ లోపల మాత్రం కార్తీక జమున పాత్రను కొట్టేయాటానికే కార్తీక ఫ్లానని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఒక వేళ గుండమ్మ కథలో గుండమ్మ పాత్ర రాధతో చేస్తే ఎలా ఉంటుందో ఒక తెలుగు ప్రేక్షకులు ఊహించుకోండి? .
కొసమెరుపు : సీనియర్ ఎన్టీఆర్ కి గుండమ్మ కథ సినిమా కావటం. భారతదేశంలో వంద సినిమాలు పూర్తి చేసిన తొలి కథానాయుకునిగా సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర స్రుష్టించారు. .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more