విచారణ సమయంలో థర్డ్ డిగ్రీని ప్రయోగించకూడదని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలోనే వైఎస్ జగన్ ను విచారించాలని స్పష్టం చేసింది. జగన్ ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలని సూచించింది. ఇక జగన్ అరెస్టు సక్రమమే అని కోర్టు భావించింది. పూర్తి విచారణ కోసమే జగన్ ను సీబీఐ అరెస్టు చేసిందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారమే ఇరుపక్షాల వాదనలూ పూర్తయ్యాయి. జగన్ దర్యాప్తులో తమపరంగా ఎలాంటి గందరగోళం లేదని సీబీఐ హైకోర్టుకు స్పష్టం చేసింది. జగన్ తో రాజకీయంగా ఎలాంటి కక్షలేదని తెలిపింది. ఆస్తుల కేసు కీలక దశలో ఉందని తమ కస్టడీకి జగన్ ను అప్పగిస్తే పూర్తి సమాచారాన్ని రాబడతామని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఇందులో భాగంగానే సీబీఐ న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. అయితే సీబీఐ 10 రోజుల కస్టడీకి అనుమతించాలని కోరినా కేవలం 5 రోజులకు మాత్రమే అనుమతించింది.
తన అరెస్టు అక్రమమంటూ జగన్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. కక్షపూరితంగానే జగన్ ని అరెస్టు చేశారన్న జగన్ తరపు న్యాయవాదుల వాదనను కోర్టు తోసి పుచ్చింది. జగన్ అరెస్టు సక్రమమేనన్న సీబీఐ వాదనతో పూర్తిగా ఏకీభవించింది. ఈ రెండు పిటిషన్ల పై తీర్పును న్యాయమూర్తి చంద్రకుమార్ ఒకేసారి వెల్లడించారు. జగన్ ను కస్టడీకి ఆదేశించడంతో కోఠిలోని సీబీఐ కార్యాలయం దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. సీబీఐ కార్యాలయంలోకి మీడియాతో పాటు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. విదేశీ పెట్టుబడులపైనే అధికారులు జగన్ ను ప్రశ్నించనున్నారని తెలిసింది. జగన్ ను విచారించనుంది. మరోవైపు అరెస్టు అక్రమమంటూ జగన్ వేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more