‘స్త్రీకి స్త్రీయె శత్రువు’ అనే సామెత .. సోనియా గాంధీ విజయం రుజువు అవుతుంది. స్వయాన సోనియా తోడికోడలు .. సోనియా కు శత్రువు అయిన విజయమ్మకు మద్దుతు ఇవ్వటం ఇప్పుడు దేశ రాజకీయల్లో పెద్ద హాట్ టాఫిక్ మారిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సోనియా తోడి కోడలు అయిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు మేనకా గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తల్లి అయిన విజయమ్మకు మద్దుతు తెలపటం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తోడి కోడలు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు మేనకా గాంధీ ఫోన్ చేశారు. విజయమ్మకు మేనకా గాంధీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మకు మేనక ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. సోనియా గాంధీ వల్ల తానూ ఇబ్బందులు పడ్డానని, ఆమె కుటుంబం మీ కుటుంబాన్ని పెడుతున్న కష్టాలు తనకు తెలుసునని, ఈ కష్టాలను తాను మాత్రమే కాదని, యావద్భారతం చూస్తోందని, మీరు నిబ్బరంగా కదలండని, ధైర్యంగా ఉండండని, మీ కుటుంబానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారట. మీ ఆవేదనలో పాలుపంచుకుంటున్నానని, మీ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నానని విజయమ్మతో చెప్పారట.
తొలుత విజయమ్మను పలకరించిన మేనకా గాంధీ ఆ తర్వాత కొద్దిసేపు షర్మిళతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకొని తన సంఘీభావాన్ని ప్రకటించారు. కాగా షర్మిళ నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయమంటే మంచి మనిషిని జైలుకు పంపడం, హెలికాప్టర్‌లను కూల్చడమేనా అని షర్మిళ ప్రశ్నించారు. తల్లి విజయమ్మతో కలిసి ఆమె నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.విజయమ్మ కూతురు ...తాను రాజన్న కూతురిని అని, జగన్ చెల్లెల్ని అని పరిచయం చేసుకున్నారు. తన తండ్రి వైయస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని మీకు చెప్పడం కోసమే మేం మీ ముందుకు వచ్చామన్నారు. ఈ అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కలిసి.. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి మరీ కుట్ర చేస్తున్నాయన్నారు. వైయస్ మంచి మనిషి అని, ఆయన పని తీరు బాగుందని మెచ్చి రెండుసార్లు అధికారం ఇస్తే.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more