హైదరాబాదులోని శిల్ప కళా వేదిక ఆడిటోరియంలో అశేష అభిమానుల సమక్షంలో . 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రం ఆడియో వేడుకలో మోహన్ బాబు చిరాకు పడినట్లు తెలుస్తుంది. మోహన్ బాబు చిరాకు పెద్ద కారణ ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఆడిటోరియలో .. బాలకృష్ణ అభిమానులు ఎక్కువ సంఖ్యలో హాజరైనట్లు తెలుస్తుంది. అయితే ఆడిటోరియ నిండ బాలకృష్ణ అభిమానులు ఉండటం, వారు బాలకృష్ణ, బాలకృష్ణ,.. అధినాయకుడు అంటు గోల చేయటం చాలా ఎక్కువైందట. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న మోహన్ బాబు ఒక్కసారిగా బాలకృష్ణ అభిమానులను తిట్టడం మొదలు పెట్టడం జరిగిందని మీడియా వారు అంటున్నారు .
అసలు మీకు క్రమ శిక్షణ లేదా? ఇలాగే ప్రవర్తించేది? మా కొడుకు సినిమా ఆడియో ఫంక్షన్ వచ్చి ఇలా చేస్తారా? మీరు అసలు బాలకృష్ణ అభిమానులేనా? బాలకృష్ణ ముందు మోహన్ బాబు రెచ్చిపోయి డైలాగు చెప్పటంతో.. అభిమానులు షాక్ తిన్నారట. నా కూతురు నిర్మించిన సినిమాలో మీ గోల ఎంటయ్యా అంటు బాలకృష్ణ అభిమానులకు వార్నింగ్ ఇవ్వటం జరిగిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఆ తరువాత బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమాలో ఉన్న బాలకృష్ణ తన పాత్ర గురించి చెబుతూ, 'నా అభిమానులు నా నుంచి ఆశించే దానికి భిన్నంగా ఇందులోని పాత్ర వుంటుంది. మరో ట్రెండ్ సృష్టించే పాత్ర నాది. మేమెప్పుడూ ట్రెండులు సృష్టిస్తుంటాం. మిగతా వాళ్లు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు కూడా మమ్మల్నే ఫాలో అవుతారు. నాన్నగారు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయన దారిలోనే మేమూ వెళుతున్నాం' అని చెప్పటంతో బాలకృష్ణ అభిమానులు ఆనందపడినట్లు తెలుస్తుంది.
యన్టీఆర్ కుటుంబానికీ, తమ కుటుంబానికీ వున్న అనుబంధాన్ని మోహన్ బాబు వివరించారు. ఆనాడు యన్టీఆర్ తనని ప్రోత్సహించడం కోసం మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటిస్తే... ఈనాడు తన బిడ్డ మనోజ్ ను ప్రోత్సహించడం కోసం బాలకృష్ణ ఇందులో నటించాడని మోహన్ బాబు చెప్పారు. తమ సంస్థలో నిర్మించిన భారీ చిత్రమిదని ఆయన అన్నారు. 'దీనికి పెడుతున్న ఖర్చు చూసి ఉలిక్కిపడ్డాను. అయితే, ఇప్పుడు చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. మంచి సినిమా తీశారు' అన్నారు మోహన్ బాబు. జూన్ నెలాఖరున దీనిని విడుదల చేస్తామని నిర్మాత లక్ష్మీ ప్రసన్న తెలిపింది. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more