Ap scam in tngos plot allotments

AP: Scam in TNGOs plot allotments? TNGOs Housing Society by joint cooperative registrar N Kiranmayee,

AP: Scam in TNGOs plot allotments?

Scam.gif

Posted: 05/24/2012 11:46 AM IST
Ap scam in tngos plot allotments

AP: Scam in TNGOs plot allotments?

బాక్స్ బద్దలైంది అంటే అర్థం ఏమిటి?  ఈ పదనికి అర్థం కావాలంటే.. మనం నేరుగా   టీఎన్జీఓ అధినేత  , హౌసింగ్  సోసైటీ అధ్యక్షుడు  స్వామి గౌడ్ ను అడగాల్సిందే.  ఎందుకంటే  బాక్స్ బద్దలవ్వటం గురించి ఆయనకు బాగా తెలుసునని  మీడియా వారు అంటున్నారు.  ఎందుకంటే .. గతంలో .. ఒకసారి స్వామి గౌడ్ చేస్తున్న తెలంగాణ ఉద్యమా పోరాటంలో .. నిజంగానే  బాక్స్ బద్దలైన విషయాన్ని మీడియా గుర్తు చెస్తున్నారు.

అయితే  ఈసారి మరోల స్వామి గౌడ్ కు బాక్స్ బద్దలైందని టీఎన్జీఓ  ఉద్యోగులు అంటున్నారు. అసలు విషయం ఏమిటయ్య అంటే .. హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని టీఎన్జీఓ హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల స్థలాల కేటాయింపు లలో భారీగా అక్రమాలు జరిగాయని తేలింది. సొసైటీలో అవకతవకల విషయాన్ని విచారణాధికారి కిరణ్మయి నిగ్గు తేల్చారు. ఈ మేరకు సౌసైటీలో జరిగిన అక్రమాలపై  ప్రభుత్వానికి దాదాపు వెయ్యి పేజీలతో కూడిన నివేదికను అందజేశారు. దీంతో ఈ సొసైటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకూ అన్ని విషయా లలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన స్వామిగౌడ్‌ బండారం బయటపడిందని ఉద్యోగులలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. టీఎన్జీవోలకు కేటాయించిన ప్లాట్లలో అవకతవకలు జరిగాయంటూ, సొసైటీని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో దీనిపై పూర్తిస్థాయి విచారణకు కోర్టు ఆదేశించినట్లు  టీఎన్జీఓ ఉద్యోగులు అంటున్నారు.  

ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్మయిని టీఎన్జీఓ సొసైటీలో ప్లాట్ల కేటాయింపుల వ్యవహారంపై విచారణాధికారిగా నియమించారు. ఆమె తాజాగా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ హౌసింగ్‌ సొసైటీలో ఇళ్ల స్థలాల కేటాయింపులలో భారీగా అవకతవకలు జరిగాయని విచారణాధికారి తన నివేదికలో నిర్ధారించారు. నివేదికలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. 1991లో నగరంలోని గచ్చిబౌలిలో టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీ కోసం 160 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే సొసైటీలో లబ్ధిదారుల సభ్యత్వ నమోదు నుంచే అవకతవకలు మొదలైనట్లు విచారణలో తేలింది. కనీసం సభ్యుల నమోదు రిజిష్టరును కూడా నిర్వహించకుండా ఇష్టానుసారంగా ఇళ్లస్థలాలు కేటాయించినట్లు నివేదికలో స్పష్టంచేశారు. 240 ప్లాట్లను బినామీ పేర్లతో కేటాయించారని, ప్లాట్లు పొందేందుకు కొందరు దొంగ అఫిడవిట్లు కూడా ఇచ్చినట్లు విచారణలో వెల్లడించారు.

టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీ అక్రమాల పుట్ట అని తెలంగాణ జాయింట్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆరోపించింది. టీఎన్జీఓ హౌసింగ్‌ సొసైటీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కమిటీ డిమాండ్‌ చేసింది. హౌసింగ్‌సొసైటీలో అక్రమాలకు పాల్పడిన టీఎన్జీఓ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ఆస్తులను జప్తు చేయాలని టీజేఎస్‌సి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా సొసైటీ ఛైర్మన్‌, డైరెక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని టీజేఎస్‌సి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan reddys arrest imminent
Sonia gandhi snubs pa sangma refuses to meet him  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more