ఇప్పుడు ఇది వేసవి కాలం కాదు. విద్యాసంస్థలా ప్రకటనల కాలం? అసలే భానుడి( సుర్యుడి) దెబ్బకు వడ దెబ్బ తగిలి జనం చచ్చిపోతుంటే, ఆ భానుడి దెబ్బకంటే ఈ విద్యా సంస్థలా ప్రకటనలతో జనం చచ్చిపోతున్నారు, ఉదయం లేచి పేపరు చేస్తే చాలు ఒక్క వార్త కనిపించదు. అన్ని విద్యాసంస్థల ప్రకటనలతో నిండిపోయి కలర్ ఫుల్ గా కనబడుతుంది. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని , ఒకవేళ టీవీ ఆన్ చేస్తే .. టీవీ పగిలిపోయేంత ధ్వని తరంగాలతో విద్యాసంస్థలు , నెంబర్స్ చదువుతుంటాయి. అంటే మా విద్యాసంస్థలో 100కు 100 ర్యాంకులు సాదించిన సంస్థ అని 1,1,1,1,1,1,2,2,2,2,3,3,3,3...... 100వరుకు గభ్బీరమైన స్వరంతో చెప్పటం కొత్త ష్యాషన్ గా మారిపోయింది .
అసలు నిజంగా వీరు నిజాం చెబుతున్నారంటే? అదీ కూడా చెప్పలేం? ఎందుకంటే.. ఉదహరణకు చైతన్య సంస్థలో 1 నుండి 10 ర్యాంకులు వస్తే.. అదే ప్రకటనతో .. నారాయణ సంస్థలు 1 నుండి 10లో ర్యాంకులు సాధించిన సంస్థ మాదే అని.. స్వరం మార్చి చెబుతుంటారు. అసలు విద్యాసంస్థలకు పబ్లిసిటి అవసరమా? ఒక వేళ ర్యాంకు వస్తే.. ఇలా రోడ్డు పడి అరుస్తూ.. పెద్ద పెద్ద బోర్డులతో మీడియా ప్రకటనలు ఇవ్వటం మంచిదా? అసలు ఎందు కోసం మీడియా ప్రకటనలు ఇస్తున్నారు?
అసలు విద్యా సంస్థలకు ర్యాంకు కావాలా? లేక పిల్లావాడి భవిష్యత్తు కావాలా? అనేది ప్రజలకు అర్థం కావటంలేదట. ఒక పిల్లవాడి భవిష్యతు మెరుగు పడాలంటే .. అర్థరహితమైన ప్రకటనలు ఇస్తే సరిపోదు. ఆ పిల్లవాడికి క్రమశిక్షణ కలిగిన చదువు ఇవ్వాలి. అప్పుడు ఆ పిల్లవాడు ఉన్నత స్థాయి ఎదగటానికి భీజం పడుతుంది. విద్యాసంస్థలు ఇచ్చే ప్రకటన వలన మీడియా వారు, పేపర్ వారు బాగుపడుతారు తప్ప విద్యార్థులకు మేలు జరగదని మేథావులు అంటున్నారు.
ఒక విద్యాసంస్థ నుండి ఎంతో మంది ఎన్నో మడిగ్రీలు పట్టాలు ఇవ్వావచ్చు. విద్యాసంస్థకు ఏన్నో ర్యాంకులు రావచ్చు, కానీ క్రమ శిక్షణతో కూడిన విద్యార్థిని తయారు చేయలేకపోతున్నారని మేథావులు అంటున్నారు. విద్యార్థి దశలోనే మాది గొప్ప, నేను గొప్ప అనే భావన విద్యార్థికి కలిగేలా చేస్తున్నాయి ఈ విద్యసంస్థలు. అదే భావంతో బయటికి వచ్చిన విద్యార్థి, ఎంత నరకం అనుభవిస్తున్నాడో విద్యాసంస్థలకు తెలియదు. ఎందుకంటే అలా బయటికి వచ్చిన విద్యార్థి ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి. అతని క్రమ శిక్షణ లేకపోవటం, తోటివారిని, పెద్దలను, గౌరవించకపోవటం వలన అనేక ఇబ్బందుకు గురికావల్సివస్తుందని మేథావులు అంటున్నారు.
అసలు విద్యాసంస్థలు ప్రకటనల మీద పెట్టిన శ్రద్ద విద్యార్థి భవిష్యత్తు పై పెట్టడంలేదని కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు. ఈ విద్య సంస్థలు ఇచ్చే ప్రకటనలు చూసి చాలా మంది మోసపోయినట్లు చెబుతున్నారు. మా విద్యాసంస్థలు తండ్రిలా, తల్లిలా , మీ పిల్లలను చుసుకుంటామని చెబుతున్నారు. ఆ తరువాత పిల్లలు కిడ్నప్ అయిన మా సంస్థలకు సంబందం లేదు అని సంస్థలు చాలా ఉన్నాయాని ప్రజలు అంటున్నారు. ప్రకటనలో చూపించే బిల్డింగ్, చదువు చెప్పేది మాత్రం రేకులు షెడ్ లో అని తల్లి దండ్రలు అంటున్నారు.
ఇకనైన విద్యసంస్థలు ప్రకటనల మీద ఉన్న శ్రద్ద విధ్యార్థి చదువు పై పెడితే .. ఆ సంస్థకు ప్రకటన చేసుకొని అవసరం లేకుండానే విద్యార్థులు చేరతారని మేధావులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more