మా పార్టీ అధ్యక్షుడికి అనుమానం జబ్బు పట్టుకుంది. అది ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేయబోతున్నది. ఇప్పటికే బాబు తీరువల్ల టీడీపీ నావ మునగడానికి సిద్ధంగా ఉంది. అన్నింటా ఆయనే.. అన్నింట్లో ఆయనే.. అన్న చందంగా పార్టీ పరిస్థితి తయారైంది.’’ ఇదీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్న సంగతి! ‘నాయకులను నమ్మని అధినేతను నాయకులూ నమ్మరు’ అనే నీతిని మరిచినందునే టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు తరువాత స్థాయికి తెలంగాణ నేతలు ఎదిగితే వారినందరినీ బయటికి పంపిన దాఖలాలున్నాయని వారు అంటున్నారు. మిగిలిన నేతలకు చెక్ పెట్టేందుకు కొత్తవారిని తెరపైకి తెచ్చిపెడతారని విమర్శిస్తున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు తమను వాడుకుని వదిలేసిన వైనాన్ని ఎన్టీఆర్ కుటుంబీకులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని, వాస్తవాలు తెలుసుకుంటున్నారని చెబుతున్నారు.
పార్టీ కార్యక్రమాల్లోనూ ముఖ్య బాధ్యతలను నేతలకు అప్పగించకుండా అన్నింట్లోనూ నేనేనంటూ ముందుకెళ్తున్న తీరే పార్టీని ప్రజల్లో పలచన చేస్తోందని నేతల అభిప్రాయంగా వినిపిస్తున్నది. దీనంతటికీ బాబు అనుమానం జబ్బే కారణమని వారి ఆరోపణ. చంద్రబాబు లేకుండా పార్టీ నాయకులు ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేరా? అన్న ప్రశ్నకు నేతలను నుండి వచ్చే సమాధానం ఒక్కటే. ‘మాకు అవకాశం ఇవ్వాలి కదా..’ అని. తెలంగాణ అంశమైనా.. జగనైనా.. ఆయన తండ్రి వైఎస్ అయినా.. కాంగ్రెస్‌ను బహిరంగంగా తిట్టాలన్నా... యాత్రలు చేయాలన్నా అన్నింట్లోనూ ‘పెద్దాయనే’ కనిపిస్తాడని వారు పేర్కొంటున్నారు.
సుదీర్ఘమైన టీడీపీ చరిత్రలో చంద్రబాబు తరువాత పార్టీలో మరొక్కరి పేరు వినిపించదంటే పార్టీని, నేతలను బాబు ఎలా నియంత్రించారో అర్థం చేసుకోవచ్చని ఇప్పుడు సీనియర్ నేతలు సైతం మాట్లాడుకుంటున్నారు. రాజకీయ పార్టీ అంటే ఒకరిపై మరొకరు నమ్మకంతో రాజకీయ కార్యకలాపాలు సాగించడం. కానీ టీడీపీలో ఆ పరిస్థితి పోయి చానాళ్లే అయిందని నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబంటే ముఖం తిప్పుకునేవాళ్లు కొందరైతే... అబ్బే ఎందుకండీ వేస్టు అనేకునే వాళ్లు మరికొందరు. దీనంతటికీ కారణం ఆయనకున్న అనుమానం జబ్బేనని, అదే పార్టీని ఇలా తయారు చేసిందని అంటున్నారు. ‘చంద్రబాబుకు మొదటి నుంచి ఎవరినీ నమ్మే అలవాటు లేదు. ఇదే అంశం పలుమార్లు రూఢీ కూడా అయిందని చెబుతున్నారు. ‘‘ఏది చేయాలన్నా.. ఆయనే చేయాలనే మనస్తత్వంతో విసిగి వేసారి పోయారు తెలుగుదేశం నాయకులు.
ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడే చాలా మంది సీనియర్లు వెళ్లిపోయారు. ఇద్దరు ముగ్గురు తిరిగి వచ్చినా.. వారెక్కడున్నారో.. మళ్లీ సమాచారం లేదని ఒక నేత అన్నారు. తాజాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, సీమాంధ్రలో ఆ పార్టీకున్న పలుకుబడి చూసి పార్టీలో సీనియర్లుగా చెప్పుకుంటున్న వారంతా తమ బంధువులను, కొడుకులను ఆ పార్టీలో చేర్చేశారు. ఎన్నికల సమయానికి వీళ్లు కూడా పార్టీని వీడతారని నేతలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు’’ అని పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఓ నేత అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more