నాజూకు నడుముతో కజరారే అంటూ అందరినీ ఊపేసిన అద్బుతమైన అందాల రాశి ఐశ్వర్యరాయ్ ఇప్పుడు తన భారీ అందాలతో జనాన్ని భయపెడుతోంది. బాగా లావయిన ఈ మాజీ ప్రపంచ సుందరిని పోల్చుకోవడం బాలీవుడ్ ప్రముఖులకే కష్టమైందట. కొన్నాళ్లు సినిమా ప్రపంచానికి దూరంగా ఉండాలని ఐశ్వర్య భావిస్తోందట. దీంతో ఆమె లావు తగ్గేందుకు ప్రయత్నించడం లేదని బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది.
మూడు రోజుల క్రితం అనిల్ అంబానీ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైనవారంతా మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్‌ను చూసి నోరెళ్లబెట్టారట. కారులోంచి ఐశ్వర్య దిగుతుండగా ఎవరో అనుకుని మొదట పట్టించుకోలేదు. ఆమె అలనాటి ప్రపంచ అందగత్తె ఐశ్వర్య అని తెలిసి ఆశ్చర్యపోయారు. అప్పటి ఐశ్వర్యతో ఆమె రూపాన్ని పోల్చుకోవడం వారికి చాలా కష్టమైందట. వెంటనే అప్పటి ఐశ్వర్య నాజూకు రూపం వారి కళ్ల ముందు మెదిలింది. ఆరాధ్య బచ్చన్ పుట్టాక ఐశ్వర్య లావు అయ్యిందనే విషయం అందరికీ తెలిసిందే. త్వరలో ఆమె లావు తగ్గుతుందని, మళ్లీ సినిమాల్లో నటిస్తుందని అందరూ ఊహించారు. అయితే ఐశ్వర్యకుఇప్పట్లో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదన్న విషయం ఆమె భారీ కాయం చూసిన వారికెవరికైనా ఇట్లే అర్థమవుతుంది. రోజురోజుకు ఆమె మరింత లావుగా తయారవడం వెనుక కారణమేమిటో బాలీవుడ్ ప్రముఖులకు కూడా అర్థంకావడం లేదట. లావు తగ్గేందుకు ఐశ్వర్య కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ వార్త సినీ ప్రేమికులకు కొంచెం నిరాశ కలిగించేదే. మళ్లీ ఆమె రూపాన్ని చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
బాగా లావవడంతో మధుర్ భండార్కర్ సినిమా నుంచి తప్పుకున్న ఐశ్వర్య చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. లావు వల్లే బయటకి రావడానికి కూడా ఐశ్వర్య ఇష్టపడడం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు కూడా ఐశ్వర్య హాజరు కావడం లేదని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more