ఒక సినిమా విజయం కావడానికి ప్రచారం ఎంతో ముఖ్యం. ప్రచారం రావాలంటే రూ. కోట్లు వెచ్చించాల్సిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచారానికి మరెంతో డబ్బు కావాలి. అలాంటిదేదీ లేకుండా చౌకగా, భారీస్థాయిలో ప్రచారం రావాలంటే నెగెటివ్ పబ్లిసిటీని ఎంచుకుంటే సరి..ఇదీ కొంతమంది బాలీవుడ్గ ప్రముఖులు విశ్వసిస్తున్న భావన. రామ్ గోపాల్ వర్మ ఈ జాబితాలో మొదటి స్థానం ఆక్రమిస్తారు. మరెందరో ప్రముఖులూ ఆయన బాటనే పడుతున్నారు. మరి అలాంటి నెగెటివ్ ప్రచారం కాసులు కురిపిస్తుందా? బాక్స్‌లను వెనక్కు పంపిస్తుందా? రెండు వైపులా పదును ఉండే ఈ కత్తిపై కలర్స్ ప్రత్యేక కథనం...
ఏజెంట్ వినోద్...
ఈ సినిమా పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదూ.. ఈ పేరు వినగానే సైఫ్ అలీ ఖాన్ పేరు గుర్తుకు వచ్చింది కదూ. ఇటీవల వార్తల్లో సైఫ్ అలీ ఖాన్ పేరు వినే ఉంటారు. ఆ పేరు గుర్తుకు రాగానే దాంతో పాటు ఆయన కొత్త సినిమా ఏజెంట్ వినోద్ పేరు కూడా మదిలో మెదలుతుంది. సైఫ్ అలీ ఖాన్ వార్తల్లోకి ఎందుకు ఎక్కారు? ఓ హోటల్‌లో ఓ వ్యాపారవేత్తపై దాడి సంఘటనలో. అది అనుకోకుండా జరిగిందా...లేక కావాలనే ఆ ట్రిక్ ప్లే చేశారా? బాలీవుడ్ సినీ విశ్లేషకులు ఇప్పుడు బిజీగా ఉన్నది దీంతోనే. ఏజెంట్ వినోద్ సినిమాను హిట్ చేసేందుకు ‘నెగెటివ్ పబ్లిసిటీ’ అస్త్రాన్ని ఎంచుకున్నారని, అందులో భాగంగానే ఈ ‘అరేంజ్డ్ ఫైట్’ జరిగిందనే వాదనలూ వినిపిస్తు న్నాయి. సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. సినిమా కోసం నెగెటివ్ పబ్లిసిటీలో భాగంగా ఇలా చేశాననడం సమంజసం కాదని వాదిస్తున్నారు. ఆయన వాదన ఎలా ఉన్నా ఇప్పటికే ఆయనకు, ఆయన కొత్త సినిమాకు కావాల్సినంత ప్రచారం వచ్చేసింది. జాతీయస్థాయిలో...అదీ ఉచితంగా! ఒక నిర్మాతకు, హీరోకు అంతకన్నా కావాల్సింది మరింకేంటి?
రెండు వైపులా పదును ఉండే కత్తి
నెగెటివ్ పబ్లిసిటీ ధోరణి ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో అప్పుడప్పుడూ కొంతమంది ఈ కత్తిని ఝళిపిస్తూనే ఉన్నారు. కొన్ని సార్లు ఇది ఆశించిన ఫలితాన్ని అందిస్తే మరికొన్ని సార్లు బెడిసికొట్టింది. ఇలా నెగెటివ్ ప్రచారం బెడిసికొట్టిన దానికి రామ్‌గోపాల్ వర్మను మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. పలు సందర్భాల్లో ఈ విషయంలో దెబ్బ తిన్నారు. కంపెనీ, మధ్యాహ్నం హత్య, రక్ష, డర్‌నా మనాహే, ఆగ్ లాంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. రక్తచరిత్ర మాత్రం ఒక మోస్తరు హిట్‌ను సాధించింది. ఇప్పటికీ ఆయన నెగెటివ్ పబ్లిసిటీనే నమ్ముకోవడం విశేషం.
దీన్నే కోరుకునే తారలు
కొంతమంది తారలు నెగెటివ్ పబ్లిసిటీతో ఒక్కసారిగా తారపథాన్ని చేరుకుంటారు. రాఖీ సావంత్ ఓ గాయకుడిని చెంపదెబ్బ కొట్టి ఒక్కసారిగా సినిమాల్లో తన అవకాశాలను ఎంతగానో మెరుగుపర్చుకోగలిగింది. ఇలాంటి అవకాశం అన్ని సందర్భాల్లో అందరికీ లభిస్తుందనుకుంటే మాత్రం పొరపాటే. గ్రహబలం సరిగా లేకుంటే ఇలాంటి వ్యూహాలు వికటిస్తుంటాయి.
ఏదీ నెగెటివ్ కాదు!
కొంతమంది సినీ పండితులు మాత్రం పబ్లిసిటీని ఇలా రెండు రకాలుగా వర్గీకరించడాన్ని వ్యతిరేకిస్తుంటారు. నెగెటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీలో భాగమేనంటూ వారు వాదిస్తుంటారు. నిజానికి బాలీవుడ్ తారలు పలువురు ఇలాంటి నెగెటివ్ పబ్లిసిటీనే కోరుకుంటూ ఉంటారు. తద్వారా వార్తల్లోకి ఎక్కుతూ నలుగురి నోళ్ళలో నానుతూ తమ అవకాశాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారంతా నెగెటివ్ పబ్లిసిటీని పొందిన వారే. డేటింగ్ అంశాల్లో వివేక్, ఓ నిర్మాతను చెంపదెబ్బ కొట్టి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒకప్పుడు వార్తల్లోకి ఎక్కిన వారే.
కాసులు కురుస్తాయా?
నెగెటివ్ పబ్లిసిటీతో సినిమా పేరు అందరి దృష్టికి పోయినప్పటికీ అది కాసులు కురిపిస్తుందా అనేది మాత్రం నేటికీ బిలియన్ డాలర్ల ప్రశ్ననే. ఒక సినిమాపై ప్రేక్షకులు అంచనాలు ఒక స్థాయిని మించి ఉన్నప్పుడు, ఆ స్థాయిలో ఆ సినిమా లేనప్పుడు ఆ సినిమా ఫెయిల్ కాక తప్పదు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రభావాన్ని తగ్గించేందుకూ కొంతమంది వ్యూహాత్మకంగా ఫలానా సినిమా బాగాలేదట అనే ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెస్తుంటారు. ఇది మొదటనే ఆ హీరో అభిమానుల అంచనాలను కాస్త తగ్గించి, సినిమా హిట్ అయ్యేందుకు తోడ్పడుతుంది. ఇటీవల విడుదలైన ఒక తెలుగు హీరో సినిమాకు ఈ విధమైన ‘టాక్’ను వ్యాప్తి చేసినట్లు గుసగుసలు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more