అందరు మనీ కోసం స్థలాలు కబ్జ చేస్తారు. కానీ సురేశ్ రైనా కబ్జ చేసేది .. మనీ కోసం కాదట. అందులోను ఇతను ఎక్కడికి వెళితే అక్కడ స్థలం కబ్జ చేయటం గ్యారంటీ అని తోటీ క్రికెట్ సభ్యులు చెబుతున్నారు. అయితే సురేశ్ రైనా స్థలం కబ్జ చేసేది ఎందుకోసమో తెలుసా? అతను ఆడే బ్యాట్లు కోసమే స్థలం కబ్జ చేస్తాడని తొటి క్రికెట్ సభ్యులు చెబుతున్నారు.
ఓ బ్యాట్స మెన్ కిట్లో ఎన్ని బ్యాట్లుంటాయి? రెండో మూడో.. మహా అయితే ఐదు కానీ సురేశ్ రైనా కిట్ తెరిస్తే డజనుకు తక్కువ కాకుండా దర్శనమిస్తాయి. సొంత గడ్డపై మ్యాచ్ లైనా.. విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా.. మనోడు రెండంకెల సంఖ్యలో బ్యాట్లు లేకుండా కదలడు. డ్రెస్సింగ్ రూంలోనూ రైనా.. మిగతావాళ్లకంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేస్తాడు. ఒకే బ్యాట్ వాడాలన్న సెంటిమెంట్ కు రైనా పూర్తి వ్యతిరేక. మ్యాచ్ మ్యాచ్ కూ.. బ్యాట్ మార్చేస్తాడు. కుదిరితే.. ఒకే ఇన్నింగ్స్ లో రెండు మూడు బ్యాట్లు ( అవి విరగకపోయినా) వాడటం రైనా స్టైల్ . కొత్త బ్యాటంటే ఈ యూపీ కుర్రాడికి అంత మోజు మరి.
ఫలానా బ్యాటే వాడాలన్న మూడు నమ్మకాలు లేవు. అప్పటికి ఏది దొరికితే అది పట్టుకుపోతా. మధ్య ఓవర్లలో 1180 గ్రాముల బరువున్న బ్యాట్లు వాడతాడట. చివరి ఓవర్లలో ఆ బరువు కాస్త పెరుగుతుందని రైనా అంటున్నాడు. తనకు నచ్చి, ప్రత్యేకమైన మ్యాచ్ ల్లో వాడిన బ్యాట్లను ఇంట్లో భద్రపరచడం రైనాకు అలవాటు అని చెబుతున్నాడు. రైనా దాచిపెట్టిన బ్యాట్ల సంఖ్య ఎంతో తెలుసా.. 350 వీటి కోసం తన ఇంట్లో ఓ పెద్ద గదినే కేటాయించాడు. రైనా క్రికెట్ లో మొదట వచ్చినప్పుడు, తొలి టెస్టు శతకం సాధించినప్పడు , ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ ఆడినపుడు , ముల్తాన్ లో పాకిస్థాన్ పై గుర్తుంచుకో దగ్గ ఇన్నింగ్స్ ఆడినప్పుడు (35 నాటౌట్) వాడిన బ్యాట్లను దాచిపెడాతడట.
ఇంకా ఇలాంటి బ్యాట్లు చాలానే ఉన్నయాట. ఐపీఎల్లో చెన్నై సహచరులు, ముఖ్యంగా విదేశీయులకు తన బ్యాట్లంటే ఇష్టమని రైనా చెబుతున్నాడు. వారు తన బ్యాట్లను తరచుగా ఉపయోగిస్తుంటారట. స్టైరిస్ నుంచి ప్లెసిస్ దాకా అందరూ నా బ్యాట్లు వాడిన వాళ్లేనట. ఇప్పుడు కూడా రైనా దగ్గర పది బ్యాట్లున్నాయాని చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more