Telangana by year end women cm to lead

Telangana By Year End Women Cm To Lead,Woman to be first CM, telangana KCR TRS kavitha Telangana Bhavan Women CM Year end Ugadi pooja,cm,cm a smuggler,cong,jagan phobia,liquor scam,naidu,shankar rao,tdp,telangana,woman to be first cm,politics, vijayasanthi, ramulamma, face

Telangana By Year End Women Cm To Lead

Telangana 01.gif

Posted: 03/23/2012 06:42 PM IST
Telangana by year end women cm to lead

Telangana By Year End Women Cm To Lead

అలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న సామెత మాదిరిగా ఇప్పటివరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఊసే లేదు. అంతలోనే తొలి ముఖ్యమంత్రి మహిళ ఏంటని అనుకుంటున్నారా? ఇది పచ్చి నిజం కాబోతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు దామోదర శర్మ అంటున్నారు. ఈ ఏడాది ఆకరు కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, తొలి ముఖ్యమంత్రి మహిళ పగ్గాలు చేపడుతుందని ఆయన జోస్యం చెబుతున్నారు. ఉగాది సందర్భంగా హైదరాబాదులోని తెరాస పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మహిళ విభాగం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడంది. ఈ ఏడాది గ్రహ స్థితి తెరాస చీఫ్ కేసిఆర్ మనోవాంఛ నెరవేరుతుందని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో పాడి పరిశ్రమలు అభివ్రుద్ది చెందుతాయని తెలిపారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగం నేతలు పాల్గాన్నారు. ఉగాది పచ్చడి అందరికీ పంచారు. అయితే ప్రస్తుతానికి తెలంగాణ నేతలంతా ఎవరి దారిలో వారు నడుస్తున్నప్పటికీ , త్వరలోనే వారంతా ఒకే తాటిపైకి వస్తారని, అంతిమ లక్ష్యం దిశగా కలిసికట్టుగా పనిచేస్తారని శర్మ చెప్పారు.

దామోదర్ శర్మ ఇలా చెప్పటంతో కేసిఆర్ మనసులో కొత్త ఆలోచనలు పరుగులు తీశాయి. ఆయన చూపులన్ని ఒక్కసారిగా తన ముద్దుల కూతురైన కవిత మీద నిలిసాయి. తండ్రి భావాలను అర్థం చేసుకున్న కవిత మనస్సులో ఉప్పొంగిపోతు.. ఉగాది పండుగ.. కొత్తదనం ఆమె కళ్ళలో మెరుపుల రూపంలో.. అక్కడ మెరిసాయి. కేసిఆర్ ఆలోచనలను పసిగట్టిన మిగత తెలంగాణ నాయకులు కూడా .. ఆనందంతో ఉగాది పచ్చడి తిన్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం రాబోయే రోజుల్లో .. తెలంగాణ సీఎంగా.. కవితనే అనేవిధంగా తెలంగాణ భవనంలో పండుగ జరిగిందని తెలంగాణ నాయకులు అంటున్నారు.

ఈ విషయంతో రాములమ్మ ముఖం చిన్నబోయినట్లు తెలుస్తుంది. తన కంటే చిన్నదైన కవితకు ఎలా సీఎం ఇస్తారన్నా, అన్న కేసిఆర్ అన్నా ఒక్కసారి ఇటు చూడన్న.. అని విజయశాంతి ఎంత మెర పెట్టుకున్నా కేసిఆర్ మాత్రం ఒక్కసారి కూడా రాములమ్మ ముఖం చూడలేదని తెలంగాణ నాయకులు అంటున్నారు. అందువలన విజయశాంతి ఉగాది పచ్చడి తినకుండానే వెళ్లిపోయిందని తెలంగాణ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  C ramachandraiah makes sensational comments on congress party
New cm in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more