C ramachandraiah makes sensational comments on congress party

C Ramachandraiah makes sensational comments on Congress party,Sonia Gandhi, Mega Star Chiranjeevi, PRP Party, Bosta, Cm Kiran, Governor, Minister Ghanta Srinivash, Minister CMR,

C Ramachandraiah makes sensational comments on Congress party

C Ramachandraiah.gif

Posted: 03/26/2012 01:10 PM IST
C ramachandraiah makes sensational comments on congress party

C Ramachandraiah makes sensational comments on Congress party

ఆ రెండు పార్టీలు కొద్దినెలల క్రితం ఒకరిపై మరొకటి మనసులు పారేసుకున్నాయి. కలసి కాపురం చేద్దామని బాసలు చేసుకున్నాయి. ఆ మేరకు ‘అమ్మ’ దగ్గర ప్రమాణాలు చేసుకున్నాయి. ఇకపై అంతా కలసి ఉందామని, ఆత్మలు ఒక్కటిగా మారి కష్టసుఖాల్లో పాలుపంచుకుందా మని ఒట్టేసుకున్నాయి. ఆ తర్వాత ఇద్దరూ అసెంబ్లీ సాక్షిగా ఒక్కట య్యారు. తనలో విలీనమయిన ఆ పార్టీకి పెద్దపీట వేసి రెండు మంత్రి పదవులు, మూలవిరాట్టుకు ఎంపీ పదవి నజరానాగా ఇచ్చింది. ఆ రకంగా ఇచ్చిపుచ్చుకోవడం అయింది. కానీ, ఆ రెండు పార్టీ శ్రేణుల మనసులే కలవటం లేదు. మానసికంగా అవి రెండూ వికర్షించు కుంటూనే ఉన్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర పరిస్థితిలో ఉంది.. దీన్ని బాగుచేసే దిశగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కానీ ఆలోచించటం లేదు. ప్రజారాజ్యం పార్టీ కేడర్ తాము కాంగ్రెస్‌లో ఎందుకు విలీనమయ్యామా? అని బాధపడుతున్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే కాంగ్రెస్ మరింత దిగజారుతుంది. అప్పుడు చిరంజీవిని కూడా నిందించే అవకాశం ఉండదు’’ అని రాష్ట్ర దేవాదాయ మంత్రి సి.రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిస సూచనలు, ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావటం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవికి.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తిరుపతిలో ఆదివారం సాయంత్రం వీడ్కోలు సభ జరిగింది. చిరంజీవితో పాటు మంత్రి సి.రామచంద్రయ్య కూడా పాల్గొన్నారు.

‘పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అధికారిక ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ లక్ష్యం చేరుకునే దిశగా ఏ స్థాయిలోనూ కసరత్తు జరగటం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు. అసెంబ్లీలోనూ, బయటా ఇదే పరిస్థితి ఉంది. దీన్ని గుర్తించే కాంగ్రెస్‌కు వెన్నెముకగా ఉండేందుకు పీఆర్పీ ముందుకొచ్చింది. అయితే విలీనం చర్చల సందర్భంగా సోనియాగాంధీ ఏం ఆశించారో, ఏం చెప్పారో అవి క్షేత్ర స్థాయిలో ఇంకా అమలు కావటం లేదు. గత ఎన్నికల్లో మేం కాంగ్రెస్ పార్టీతో పోరాడాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కేడర్ క్షేత్ర స్థాయిలో విలీనానికి స్వాగతిస్తున్న వాతావరణం కనిపించటం లేదు. పార్టీ కేడర్‌తో చాలా లోతైన సంబంధాలు ఉన్న వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇదే సమాచారం అందుతోంది. 70 లక్షల ఓట్లు సాధించి, 17 మంది ఎమ్మెల్యేలతో మేం ప్రభుత్వాన్ని నిలిపాం. అయినా కాంగ్రెస్ వారు మా వారిని విలీనం చేసుకోలేకపోతున్నారు.

ఏ నాయకుడైనా గుర్తింపు కోసం, పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారు. సేవ చేయటానికే అయితే లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. కేవలం చిరంజీవికో, రామచంద్రయ్యకో, గంటా శ్రీనివాసరావుకో పదవులు ఇచ్చినంత మాత్రాన పీఆర్పీ మొత్తాన్ని సంతృప్తి పరచినట్లు కాదు. అలాగని అందరికీ పదవులు ఇవ్వటం సాధ్యం కాదు. అయితే నియోజకవర్గాల్లో మా వారికి పనులు జరగాలి. వారికి తగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీని గురించి పట్టించుకోవటం లేదు. ఇంకా మా వారిని పరాయి వారిగానే చూస్తున్నారు. సమస్యల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మా వారిని నిర్లక్ష్యం చేస్తే ఎలా బలోపేతం అవుతుంది?

రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అందుకే మేం ప్రతి చిన్న విషయానికీ హైకమాండ్‌తో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన ఉందా? అనే అనుమానం కలుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌కు జరగబోయే నష్టానికి చిరంజీవిని నిందించే అవకాశం ఉండదు. నేను చిరంజీవికి ఈ విషయం చెప్పాను. చిరంజీవి కూడా ప్రతిసారీ మా నాయకులను బుజ్జగించి ఊరకే ఉంచటం ఎందుకు చేస్తారు? పార్టీలో అసంతృప్తి ఎక్కువయ్యే కొద్దీ కేడర్ ఇతర పార్టీల్లోకి జారుకుంటుంది.’’ అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న కాంగ్రెస్‌పై సీఆర్‌ వ్యాఖ్యలు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది.

రెండు పార్టీల కలయిక పత్రాలపైనే తప్ప, రాజకీయంగా ఏ మాత్రం అక్కరకు రావడం లేదని సీఆర్‌ వ్యాఖ్యలతో స్పష్టమయింది
చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే రాజకీయం నడిపిన వారిలో ముఖ్యుడైన సి.రామచంద్రయ్య.. కాంగ్రెస్ పరిస్థితి గురించి, ఆ పార్టీ నాయకుల గురించి, పీఆర్పీ ఎమ్మెల్యేల గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. చిరంజీవికి తెలియకుండానే ఆయనీ మాటలు మాట్లాడి ఉండరని ఉభయ పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి.. అందుకు కృతజ్ఞతలు తెలపటం కోసం ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. అంతకు ముందు హామీ ఇచ్చినట్లు చిరంజీవికి కేంద్రంలో కేబినెట్ మంత్రి పదవి కాకుండా, సహాయ మంత్రి పదవి ఇస్తామని సోనియా కోటరీ ఆయనకు తెలిపారని సమాచారం.

యూపీఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున అది కూడా ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని సోనియాకు అత్యంత సన్నిహితులైన ఏఐసీసీ నేతలు చిరంజీవికి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. విలీన సమయంలో ఒక మాట, ఆ తర్వాత మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దల వైఖరిపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అసంతృప్తే రామచంద్రయ్య ద్వారా వ్యక్తమయినట్లు భావిస్తున్నాయి. ఈ పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I am contest from nellore to 2014 elections tsubbaramireddy
Telangana by year end women cm to lead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more