తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, సీమాంద్రాలోని ఒక స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో ఆ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి రాజుకుంది. ‘తెలంగాణ కాక’ కాంగ్రెస్‌ను కకావికలం చేస్తున్నది. నేరుగా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డినే లక్ష్యం చేసుకుని అసమ్మతి శిబిరం ఎవరికివారుగా గొంతు విప్పింది. పార్టీలో దాదాపుగా సీనియర్లందరూ కిరణ్ తీరుపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసమ్మతి స్వరం వినిపించారు. రాష్ట్ర నాయకత్వం విఫలమైందంటూ కిరణ్‌ను టార్గెట్ చేసుకుని నిప్పులు చెరుగుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు జరిగిపోతున్నాయని, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకుండా పోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపించడం వల్లే పార్టీ ఈ దుస్థితికి చేరిందని, ఉప ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయని తెలంగాణ ప్రాంతంతో పాటు సీమాంద్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఏకంగా ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు.
కోవూరులో దారుణ ఓటమి కాంగ్రెస్‌కు హెచ్చరికలాంటిదని అభివర్ణించారు. అక్కడితో ఆగకుండా.. ఉప ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ సీఎం తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్న మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి.. అసమ్మతి గళం విప్పిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ కావడం గమనార్హం. హస్తినలో పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు నేరుగా సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన పీసీసీ అధ్యక్షుడు బొత్సపై ఎలాంటి ఆరోపణలు చేయక పోవడం విశేషం. తెలంగాణలో అభివృద్ధి మంత్రం పనిచేయదని ముందే చెప్పినా సీఎం కిరణ్ వాటిని పట్టించుకోలేదని, అభివృద్ధే పనిచేస్తుంది.. సెంటిమెంట్ పనిచేయదంటూ ప్రజలను అవమానించారని సీనియర్లు మండిపోతున్నారు. ఇదిలా ఉండగా, విప్ జగ్గా రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి లాంటి కొందరు నేతలు కిరణ్‌కు అండగా నిలుస్తున్నప్పటికీ సీనియర్లు మాత్రం కిరణ్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి సాగిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాల్లో పార్టీ ప్రదర్శన, ఆ తర్వాత పార్టీ నేతల విమర్శలు, ఆరోపణలతో పార్టీ శ్రేణులు సైతం అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు కొంత మంది సీనియర్లు వేరే కుంపట్లు పెట్టుకుంటున్నారు. రహస్యంగా భేటీలు జరుపుతూ సీఎం కిరణ్ తీరుపై హైకమాండ్‌కు నివేదికలు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో నాయకత్వ మార్పిడి కోసం కూడా వారు వ్యూహ రచనలు సాగిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఏమన్నారంటే..
‘‘ఉప ఎన్నికల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గెలుపోటములు సహజమే అయినప్పటికీ తాజాగా వచ్చిన ఫలితాలు చూస్తుంటే, త్వరలో 18 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా కోవూరు ఫలితం కాంగ్రెస్‌కు ఒక హెచ్చరిక. ఈ ఫలితాలకు సమిష్టి బాధ్యత తీసుకోవాలి. ఫలితాలపై అధిష్ఠానం, సీఎం దృష్టి సారించాలి. తప్పులు సరిదిద్దుకుని సక్రమంగా పనిచేయాలి. లేదా బాధ్యతల నుంచి తప్పుకోవాలి.’’
ఫలితాలపై జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు సమీక్షించుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఉన్నదో గుర్తించాలి. ఈ ఎన్నికల ఫలితాలు మాకు హెచ్చరిక లాంటివి. పార్టీ డీలా పడలేదు. చాలాసార్లు ఓటమిని ఎదుర్కొంది. ఇప్పటికైనా గుర్తించి అన్నింటినీ సరిచేసుకోవాలి. పార్టీ ఓటమికి అందరిదీ బాధ్యత. ఈ ఓటమి ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉన్నా కూడా పార్టీ బయటపడుతుంది. లోపాలను సరిచేసుకోవాలి. ఆలస్యం చేయకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. పార్టీ మరింత సమన్వయంతో ముందుకు వెళ్ళాలి.
ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌వాదులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి. లేకుంటే కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కాంగ్రెస్, టీడీపీలోని తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళలేని వారు, టీఆర్‌ఎస్‌లో ఇమడలేని వారు బీజేపీవైపు, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వైఎస్సార్‌సీపీ వైపు వెళ్ళిపోతారు. యువ ఎమ్మెల్యేలు ఇదే ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి అధిష్ఠానానికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. తరచుగా నాయకత్వం మార్చడం సరికాదు. దాని వల్ల ప్రజల్లో పార్టీ పట్ల ప్రతికూల వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది. పార్టీ క్యాడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. వారికి ప్రోత్సాహం కరువైంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్ళలేక పోతున్నారు. మంత్రి డీఎల్ ఇప్పుడు రాజీనామా చేయడం కాదు, కడప ఉప ఎన్నికల సమయంలోనే రాజీనామా చేసి ఉంటే బాగుండేది. పదవుల్లో ఉంటూ అలా మాట్లాడటం సమంజసం కాదు. తెలంగాణ విషయంలో భవిష్యత్తులో ఏం చేయాలో బడ్జెట్ సమావేశాల అనంతరం టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కూర్చొని ఆలోచిస్తాం. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానానికి కొన్ని సూచనలు చేస్తాం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more