బ్యాట్ పడితే సెంచరీ.. ఓ యాడ్‌లో నటిస్తే కోట్లు..! అన్న తీరుగా టీమిండియా యువ సంచలనం విరాట్ కోహ్లీ చెలరేగిపోతున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ ప్రత్యర్థి బౌ లర్లను మినహా అభిమానులు.. సెలెక్టర్లు.. ప్రకటన కర్తలు.. ఇలా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బ్రాండ్ వాల్యూలో అయితే టీమిండియాలో ధోనీ, సచిన్ తర్వాతి స్థానం అతనిదే.
అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమిండియాకు సంచలన విజయాలు అందిస్తున్న విరాట్‌కు అన్నీ కలిసొస్తున్నాయి. 'భవిష్యత్ కెప్టెన్' అని అభివర్ణించి న సెలెక్టర్లు వైస్ కెప్టెన్ పదవిని అప్పగించారు. సీజన్ టాప్‌స్కోరర్‌గా నిలిచిన కోహ్లీకి ఎండార్స్‌మెంట్లు అమాంతం వచ్చిపడుతున్నా యి. కోహ్లీ కో అంటే కోట్లే. పేరుకు పేరు.. డబ్బు=కు డబ్బు! 23 ఏళ్ల ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ కెరీర్‌లో మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నాడు.
ఏడాది క్రితం ఇతర యువ ఆటగాళ్ల మాదిరే కోహ్లీ కూడా ఓ ఎండార్స్‌మెంట్‌కు 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా తీసుకునేవాడు. ఆస్ట్రేలియా పర్యటన త ర్వాత అతని ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సీనియర్లు విఫలమైన చోట విరాట్ రెండు సెంచరీలతో (టెస్టుల్లో ఒ కటి, వన్డేల్లో ఒకటి) విజృంభించాడు. ఇక ఆసియా కప్‌లో అయితే కోహ్లీనే హీరో. పాక్‌పై చేసిన సెంచరీ అతని కెరీర్లోనే అత్యుత్తమం. కోహ్లీ బ్రాండ్ వాల్యూ మూడింతలకుపై గా పెరిగింది. ఓ ఎండార్స్‌మెంట్‌కు మూడు కోట్లు తీసుకుంటున్నట్టు ఓ పత్రిక కథనం. అతనితో ఒప్పందాలు చేసుకునేందుకు కొత్తగా రెండు, మూడు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
'వయసు, ఇమేజ్ దృష్ట్యా యువతను ఆకర్షించడానికి కోహ్లీ అన్ని బ్రాండ్‌లకు కచ్చితంగా సరిపోతాడు' అని కార్నర్‌స్టోన్ స్పోర్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ బంటీ సాజ్దె చెప్పాడు. విరాట్ ఎండార్స్‌మెంట్లను ఈ సంస్థే చూస్తోంది. దీర్ఘకాలిక ఒప్పందాల కంటే పరిమితకాలానికే విరాట్ మొగ్గుచూపుతున్నట్టు తెలిపాడు. వచ్చే వరల్డ్ కప్‌కు ఏడాది ముందే (2014) అతని కాంట్రాక్టులు ముగిసేలా చూస్తున్నామని సాజ్దే చెప్పాడు. వాణిజ్య ప్రకటనల్లో టీమిండియా తరపున తాజాగా కోహ్లీనే స్టార్. కెప్టెన్ ధోనీ, బ్యాటింగ్ మ్యా స్ట్రో సచిన్ ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 8 నుంచి 10 కోట్ల రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. వీరిద్దరి తర్వా త విరాట్ అత్యధిక మొత్తం అందుకునే స్థాయికి చేరుకున్న ట్టు తెలుస్తోంది. తన కంటే సీనియర్లయిన స్టార్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, గంభీర్, సెహ్వాగ్ (ఒక్కొక్కరు 2.5 కోట్లు)లను విరాట్ దాటిపోయినట్టు ఆ పత్రిక వెల్లడించింది.
ధోనీ 20, సచిన్ 17 బ్రాండ్‌లకు అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తుండగా, కోహ్లీ ఖాతాలో ఇప్పటికే 11 ఉన్నాయి. వీటిలో టీవీఎస్, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫ్లయింగ్ మెషిన్, పెప్సీకో, టైటాన్ ఫాస్ట్‌రాక్ తదితర ఉత్పత్తులున్నాయి. క్రికెటర్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినందుకు వచ్చే మొత్తం కంటే ఐపీఎల్, ఎండార్స్‌మెంట్ల ద్వారా ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. రూ. కోట్లలో విజయాలు, ఎండార్స్‌మెంట్ల మత్తులో పడి క్రికెట్‌పై నిర్లక్ష్యంగా చూపరాదంటూ విశ్లేషకులు కోహ్లీని హెచ్చరిస్తున్నారు. ఫామ్‌ను కాపాడుకోవడంతో పాటు సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే ఆటపై ఏకాగ్రత అవసరమని సూచిస్తున్నారు. 'కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. తెలివైన క్రికెటర్. బాగా ఆడుతున్నాడని అతనిపై ఒత్తిడి పెంచకండి. అతని ఆట అతను ఆడుకోనీయండి' అంటూ సచిన్ చేసిన సూచనలను వారు గుర్తు చేస్తున్నారు.
టీమిండియాలో టి-20, వన్డే, టెస్టులు మూడు ఫార్మాట్లలో ఆడుతున్న కొద్దిమంది యువ ఆటగాళ్లలో విరాట్ ఒకడు.
పరిమిత ఓవర్ల జట్టులో సుస్థిర స్థానం సాధించినా టెస్టుల్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లో మ రింత క్రికెట్ ఆడనున్నాడు. దీంతో అతనికి విశ్రాంతి దొరికేది చాలా తక్కువ. ధోనీ అనంతరం భావి కెప్టెన్‌గా అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విరాట్ ఇతర వ్యాపకాలపై ఎక్కువగా దృష్టిసారించకుంటే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెరీర్‌ను తీర్చిదిద్దుకునేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు.
యువ సంచలనం విరాట్ కోహ్లీని తన సహజసిద్ధమైన ఆటను ఆడుకోనివ్వాలని సచిన్ టెండూల్కర్ సలహా ఇచ్చాడు. ఇప్పుడతను అద్భుతంగా ఆడుతున్నాడని, అనవసరంగా ఒత్తిడి పెంచి అతని ఆటను పాడుచేయొద్దని సచిన్ కోరాడు. ఆసియాకప్‌లో పాల్గొని ముంబయి తిరిగొచ్చిన సచిన్ మీడియాతో మాట్లాడాడు. ఎట్టకేలకు దక్కిన తన వందో సెంచరీపై కూడా సచిన్ స్పందించాడు. 'ఒత్తిడి తొలగిపోయింది.
నాతోపాటు ఈ శతకం కోసం ఎంతో మంది ఎంతోకాలం ఎదురుచూశారు. అయితే 99 శతకాల తర్వాత వందో సెంచరీ చేయడం అంత సులువు కాదనే విషయం నాతో సహా అందరికీ తెలిసివచ్చింది. కోహ్లీ ఈ ఆసియా కప్‌లో ఓ భారీ సెంచరీతో పాక్‌పై భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన సంగతి తెలిసిందే. కాగా ఆసియా కప్‌లో భారత పరాజయంపై స్పందిస్తూ..'ప్రతి మ్యాచ్‌నీ గెలవాలనే బరిలోకి దిగుతాం. అయితే అన్నిసార్లూ అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవలేం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more