Bjp an emerging force in fight for telangana

BJP an emerging force in fight for Telangana,Riding on strong the Telangana sentiment, Telangana Rashtra Samithi has swept the Andhra Pradesh by-polls

BJP an emerging force in fight for Telangana

BJP.gif

Posted: 03/22/2012 04:14 PM IST
Bjp an emerging force in fight for telangana

BJP an emerging force in fight for Telangana

ఊహించిన రీతి లోనే పాలమూరు టౌన్‌ స్థానాన్ని కైవసం చేసుకోవటంపై కమలనాథుల శిబిరంలో ఆనందం, ఉత్సా హం వెల్లివిరుస్తున్నాయి. తమ అభ్యర్థనను కాదని టీఆర్‌ఎస్‌ సొంతంగా అభ్యర్థిని నిలిపినప్పటికీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ విస్తృతంగా ప్రచారం చేసినా, సర్వ శక్తులూ ఒడ్డినప్పటికీ ప్రజల సహకారంతో ఆ స్థానాన్ని తాము దక్కించుకోగలిగామన్న ఆనందం బీజేపీలో వ్యక్తమవుతున్నది. ఈ ఆనందం మాట ఎలా ఉన్నా...ఇప్పుడు పార్టీ నాయకత్వంలో మరో అంతర్మథనం ప్రారంభమైనట్టు సమాచారం. ముందు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తెలంగాణలోని ఆరు స్థానాలలో పోటీ చేసి ఉంటే తమ సత్తా ఏమిటో బయట పడేదని, ఆ రకంగా తెలం గాణలో టీఆర్‌ఎస్‌ ఒక్కటే తెలంగాణ కోసం పాటు పడుతున్న పార్టీ కాదని, జాతీయ పార్టీగా తమ బాధ్యత ఎంతో ఉందని చాటుకునే వీలు చిక్కేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవు తున్నది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ లోని స్టేషన్‌ ఘన పూర్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి స్థానాలలో పార్టీకి బలం ఉన్నందున టీఆర్‌ఎస్‌కు తమ సత్తా ఏమిటో తెలిసి వచ్చేదన్న అభిప్రాయం జిల్లా శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నట్టు తెలిసింది.

వాస్తవానికి ఆరు స్థానాలలోనూ పోటీ చేయాలని పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి ఆయా నియోజకవర్గాలలోని స్థానిక నాయకుల నుంచి ఊహించలేని స్పందన లభించింది. ఆ నిర్ణయం విషయం తెలియగానే వారు ప్రచారానికి సన్నా హాలు సైతం ప్రారంభిం చారు.అభ్యర్థులను ప్రకటించిన వెంటనే రంగం లోకి దూకాలని నిర్ణయించుకున్నారు. అన్ని చోట్లా పోటీ ఖాయమని అందరూ నిర్ధారించుకొని సిద్ధ పడిన తర్వాత హఠాత్తుగా నాయకత్వం నిర్ణయంలో మార్పు రావటంతో ఆయా నియోజక వర్గ నేతలకు మింగుడు పడలేదు.
ఆంధ్ర ప్రదేశ్‌ ను రెండుగా విభజిం చాలని ప్రజలు కోరుకుంటున్నారనే అంశంలో ఏమాత్రం సందేహం లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి వుందని, చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి వేగంగా వుంటుందనే సిద్ధాంతా లను విశ్వసించి జాతీయ పార్టీ భాజపా కు మహబూబ్‌నగర్‌లో ప్రజలు పట్టం కట్టారని వెంకయ్య నాయుడు అన్నారు.

ప్రజలు తెలంగాణ వాదానికి ఓటు వేశారని, తెలంగాణ పై కాంగ్రెస్‌ పార్టీ నాన్చుడు ధోరణిని వీడకపోతే పార్టీ మట్టికొట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్‌ నిర్ణక్ష్యం చేస్తే పరిణామాలు ఇదే విధం గా వుంటాయని గ్రహించాలన్నారు.రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గతంలో కంటే ఎంతో బలపడిందని, రాష్ట్ర నాయకుడు కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇలాంటి విజయాలను మరిన్ని భాజపా తమ ఖాతాలో వేసుకుంటుందన్నారు. త్వరలోనే రాష్ట్ర రాజకీయాలలో భారీ మార్పులు సంభవించే అవకాశం వుందని ఆశాభా వం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nupur mehtas revelation that she dated tillakaratne dilshan
Ys jagan challenge to chandrababu naidu at chilakaluripet public meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more