Directot dasari narayana rao

directot dasari narayana rao, Rajyasabha seat, Dasari, congress Party, Mega Star Chiranjeevi, chiru, Thirupathi, MLA, Film Nagar, Dasari comments, chiru family, Delhi, sonia Gandhi, Andhrapradesh,

directot dasari narayana rao

dasari.gif

Posted: 03/21/2012 06:07 PM IST
Directot dasari narayana rao

directot dasari narayana rao

నిన్నటి వరకు అరటి ఆకు వలే ఎగిరెగిరి పడిన దాసరి నారాయణ రావు తనకు మూడొ సారి రాజ్య సభ సీటు రాకపోవటంతో ఎంతో అసహానానికి గురైన విషయం తెలిసిందే. రాజ్య సభ సీటు కోసం సోనియా గాంధీ తో దాసరి మంతనాలు జరిపిన విషయం తెలిసింది. దాసరి ఎన్ని మంతనాలు జరిపిన.. చివరకు కాంగ్రెస్ అధిష్టానం తిరుపతి ఎమ్మెల్యే మెగా స్టార్ చిరంజీవికి ఇవ్వటం జరిగింది. మెగా ఫ్యామిలీకి దర్శకుడు దాసరికి మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. దాసరికి ఎప్పుడు మెలుకువ వచ్చిన .. చిరు పై చిరుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాసరికి ఆ రోజు గొంతు బాగాలేదనుకోండి.. వెంటన తన శిష్యులచేత .. చిరు పై విమర్శలు చేయించిన సంగతి తెలుగు ప్రజలకు తెలిసిందే.

దాసరి వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా లాభం లేదని అదిష్టానం గ్రహించి దాసరిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అధిష్టానం ఇచ్చిన షాక్ నుండి కొలుకున్న దాసరి ..ఇప్పుడు చిరు పై కొత్త ప్లాన్ వేశాడని తెలుస్తుంది. చిరుపై విమర్శలు చేయటం కంటే .. దగ్గరవటమే మంచిదని భావించిన దాసరి అందుకు తగిన ప్రయత్నలు చేస్తునట్లు తెలుస్తుంది. దాసరి వలన ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్రంలో ఉన్న పార్టీల నేతలకు తెలిసిపోయిందని తెలుసుకున్న దాసరి .. చిరు మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రాజ్య సభ సీటు రాకపోతు దాసరి వైఎస్ జగన్ పార్టీలో చేరాలనే సంకేతకాలను .. జగన్ కు పంపినట్లు తెలిసింది. దాసరి పంపిన సంకేతాలకు వైఎస్ జగన్ నుండి ఎలాంటి సమాదానం రాకపోవటంతో ఇక దాసరికి చిరంజీవే పెద్ద దిక్కు. అన్నట్లు దాసరి ఉన్నట్లు తెలిసింది. ( ఎవరు దొరక్కపోతే .. అక్క మొగుడే దిక్కు) అనే సామెత మాదిరిగా దాసరి పరిస్థితి తయరైందని ఫిలిం వర్గాలు అంటున్నాయి.

ప్రముఖ దర్శకుడు డా. దాసరి నారాయణ రావు, చిరంజీవికి కంటే వయస్సులో పెద్దవాడు కాబట్టి, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు, చిరు నన్ను క్షమించు అని అడగలేడు కాబట్టి, అందుకు అనువుగా ఉంటే బాటను దాసరి ఎంచుకున్నట్లు తెలుస్తుంది. చిరు పై విమర్శలు చేసిన నోటితోనే.. చిరు ను పొగడటం, చిరు కాంగ్రెస్ చేసిన పార్టీని ఆపదలో అదుకున్న విషయాన్ని, పార్టీ చేసిన మేలు గురించి దాసరి కథలు కథలుగా ఫిలింనగర్ లో చెబుతున్నాడట. అంతేకాకుండా ..చిరుకు ఉన్న ఇమేజ్ నాకు లేదని, ఆయన చాలా సున్నితమైన మనసు కలవాడని, ఎవరు ఎన్ని విమర్శలు చేసిన ఆయన మౌనంతోనే జయించాడని, ఆయన రాజ్య సభ సీటు రావటం నాకు చాలా ఆనందంగా ఉందని, చిరు కు నా మనస్పూర్తి శుభకాంక్షలు చెప్పాలని ఉంది కానీ, నా పెద్దరికం అడ్డువచ్చి చెప్పలేకపోతున్నాని.. తన సన్నిహితులతో చెప్పినట్లు విశ్వశనీయాల సమాచారం.

చిరు పై ఎన్నో సంవత్సరాల నుండి నేను విమర్శలు చేస్తున్నాను, కానీ చిరంజీవి ఇప్పటి వరకు నా పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. చిరంజీవి చిరునవ్వే ..ఆయనకు శ్రీరామా రక్ష. అని దాసరి .. చిరు పై తియ్యటి పలుకులు పలికినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీని వెనక పెద్ద కారణం ఉందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చిరు కు అధిష్టానం దగ్గర ఉన్న మంచి అభిప్రాయమే దాసరిని ఇలా మార్చిందని అంటున్నారు. చిరు మనస్సు శత్రువుకైన అన్నం పెట్టే మనస్సు అని గ్రహించిన దాసరి ఇలా మాట్లాడుతున్నాడని అంటున్నారు. ఈ విధంగా చిరు మంచి చేసుకొని..రాబోయే రోజుల్లో చిరు ద్వార కాంగ్రెస్ లో మంచి పదవి సంపాదించాలనే ఆశ దాసరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసమే.. ముందుగా చిరు గాలం వేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahabubnagar 2012 bye election
Nupur mehta met cricketers at london casino  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more