రాష్ట్ర ప్రజలందరు మెగాస్టార్ చిరంజీవి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయనకు రాజ్య సభ సీటు రావటం కొంత మందికి ఆనందంగా ఉంది. మరికొంత మందికి.. దీని కోసమా చిరంజీవి ఇంత చేసింది అని తెగ బాధపడుతున్నారు. అస్త్ర విద్యలు తెలిసిన వ్యక్తి ..పద్మవూహ్యంలో ఇరుక్కుపోయినట్టు.. చిరంజీవి ఇంత చేసి.. చివరకు.. రాజ్య సభ సీటు ఇవ్వటం కొంతమంది ప్రజలకు నచ్చలేదని అంటున్నారు.
ఈ రాజ్య సభ సీటు కోసం చిరు ఇంత చేయనవసరంలేదు. ఎందుకంటే.. సామాజిక న్యాయం చేస్తానంటు.. ప్రజల కోసం, అభిమానులకు సేవా చేయాలని .. పార్టీ పెట్టి, తన పార్టీ గెలుపు కోసం ..కష్టపడి రాష్ట్రమంత తిరిగి, ఎండకు, వానకు తడిసి పార్టీ విజయం కోసం .. ఎంతో కష్టపడి ఒక రూపం తీసుకొచ్చి, చివరకు ఇలా చేయటం ప్రజలకు నచ్చలేదని అంటున్నారు.
రాష్ట్ర ప్రజలకు సేవా చేసే పార్టీ వచ్చింది అనే ఆనందాన్ని లేకుండా పోయింది. తన పార్టీ కోసం .చిరు ఎన్నో అవమానాలు , విమర్శలు తిన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. దేనికి ఏ విషయాకి పనికిరాని వ్యక్తులైన జీవిత , రాజశేఖర్ల మురికి నోటితో .. చిరు ఎన్నో విమర్శలు చేయించుకోని, వారిచేత పవిత్రమైన బ్లండ్ బ్యాంకు పైన కూడా బురద చల్లించుకున్న విషయం తెలిసిందే. ఇన్ని అవమానాలు పొంది.. చిరు చివరకు సాదించిందేమిటి? కేవలం రాజ్యసభ సీటు.
రాష్ట్రంలో ఉన్న పార్టీలే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుకుంటేంటే.. అలాంటి సమయంలో చిరంజీవి పార్టీ పెట్టి.. తన పార్టీ కోసం.. ఆర్థికంగా ఎదగటానికి .. తన ఆస్తులైన, స్థలలాను అమ్ముకొని, పార్టీని రాష్ట్రంలో ప్రముఖ పార్టీగా తీర్చిదింది ఎందుకోసం? ఈ రాజ్యసభ పదవి కోసమా?
ప్రజరాజ్యం పార్టీ పెట్టి నాటి నుండి .. తన కుటుంబంపై అనేక విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి విమర్శలకు కాలమే సమాదానం చెబుతుందని చెప్పి.. ఈ రోజు చిరు చేసింది ఏమిటి? కేవలం రాజ్యసభ సీటు కోసం చిరు ఇంత చేయలా? ఈ పదవి కోసం అయితే ఇలా చేయకుండా ఉండి ఉంటే చాలా మంచిదని అంటున్నారు. మొదట్లో చిరంజీవి కాంగ్రెస్ తో కలిసి , తనకు రాజ్యసభ సీటు కావాలని ఉంటే.. గౌరవంగా కాంగ్రెస్ పార్టీ చిరు రాజ్యసభ సీటు ఇచ్చేది.
అప్పడు చిరంజీవికి.. పార్టీ పెట్టి నష్టపోయేవారు కాదు, అభిమానుల్లో , ప్రజల మద్య ఇపరీతమైన గౌరవం ఉండేది. ఆర్థిక దెబ్బతినేవారు కాదు, అప్పుడు కాంగ్రెస్ పెద్ద లీడర్ గానే మంచి గౌరవం లభించేది. ప్రజలకు మేలు జరిగేదని ఆంద్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఇటు ఇమేజ్ దెబ్బతిని, అటు గౌరవమైన పదవి లేకుండా, రాష్ట్ర అభిమానులకు, ప్రజలకు సేవా చేసే భాగ్యం కోల్పోయి.. ఢిల్లీ లో ఏం చేస్తారో చిరు. ఇలాంటి పదవులు దాసరి నారాయణ రావు లాంటి వారికి, ఎవ్వరికి ఉపయోగంలేని వ్యక్తులకు ఉపయోగపడతాయి, కానీ మెగా స్టార్ అంటే రాష్ట్ర ప్రజలకు ఎంతో అభిమానం, ఇమేజ్ ఉన్న మీరు రాజ్యసభకు వెళ్లటం ..తెలుగు ప్రజలకు నచ్చలేదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more