Kcr and ys jagan friends

KCR and ys jagan friends, YS jagan, TRS party, YSR Party, Telangana, Reddy, velama, kapu, kamma, Telangana People, CM, jalagam vengala rao, neelam sanjiva Reddy, Nandamuri Tarakaramarao, YS rajasekara Reddy,

KCR and ys jagan friends

KCR01.gif

Posted: 03/17/2012 10:55 AM IST
Kcr and ys jagan friends

KCR and ys jagan friends

నిన్నటి వరకు ..అతను ఒక తెలంగాణ ప్రాంతానికి బద్ద శత్రువు. అతన ఆంద్ర నాయకుడు అని తెలంగాణ వారు ముద్దుగా పిలుచుకుంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా .. అతని పై భారీ యుద్దం చేశారు. ఒకనొక సందర్భంలో.. అతన్ని తెలంగాణ లో అడుగు పెట్టానియకుండా.. రాళ్ల తో ఘన స్వాగంత పలికారు. తెలంగాణ ప్రజలు రాళ్ల స్వాగతానికి .. బెదిరిపోయిన.. ఆ రోజు పర్యటన రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాలం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడు నాయకుల మనస్సు మారాయి. శత్రువైన వ్యక్తి ..ఇప్పుడు తెలంగాణ ఉప ఎన్నికలకు .. ఆర్థిక మిత్రుడు అయినాడు. ఆంధ్ర నాయకుడు అన్ననోళ్లు .. అతను ఇచ్చే ఆర్థిక సంపదకు.. జై జగన్ .. జై జై జగన్ అంటున్నారు తెలంగాణ ప్రాంతం ముఖ్య పార్టీ నాయకులు. ఇప్పుడు ఈ రెండు జాతులు కలిసి రాష్ట్రంలో.. అధికారం కోసం.. పాకులాడుతున్నాయాని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో వెలమ - కడప రెడ్డి ఈ రెండు కులాలు కలసి రాష్ట్ర రాజకీయాలను మార్చాలని చూస్తున్నాయట.

తెలంగాణలో కుల సమీకరణలు శరవేగంగా మా రుతున్నాయి. చాలాకాలం క్రితం వరకూ ఉప్పు- నిప్పుగా ఉన్న వెలమ - రెడ్డి సామాజిక వర్గాలు ఉప ఎన్నికల సమయంలో ఒక్కతాటిపైకి రావడం ఆసక్తి కలిగిస్తోంది. బడుగు బలహీన వర్గాలపై దశాబ్దాల పాటు దాష్ఠీకం చేసిన ఈ వర్గాలు విడిగానే ఉంటూ బడుగులపై పెత్తనం చెలాయించాయి. కానీ, గత పది, పద కొండేళ్ల నుంచి ఈ కులసమీ కరణాలలో పెను మా ర్పులు చోటు చేసుకున్నాయి. సహజంగా వెలమల నాయకత్వాన్ని వ్యతిరేకించే రెడ్డి సామాజికవర్గం తెలంగాణలో మరొక ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల, వెలమతో ఇష్టం లేకపోయినా కలసి అడుగులు వేస్తు న్నారు.

పార్టీలు వేరయినా అంతా కలసి ఉండాలన్న సిద్ధాంతంతో పనిచేస్తున్నట్లు సామాజికవర్గ నేతలు విశ్లేషిస్తున్నారు. జగన్‌ పార్టీ స్థాపించి ఏడాది అవుతున్నప్పటికీ ఆయన తెలంగాణపై వైఖరి ప్రకటించకపో వడంవల్లే తెలంగాణ రెడ్లు జగన్‌కు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు తప్ప.. వారి అంతరంగంలో జగన్‌ ఉన్నారని వారి మాటలు చెప్పకనే చెబుతున్నాయి. జగన్‌ భవిష్యత్తులో తెలంగాణలో పర్యటించిన తర్వాత రెడ్డి సామాజికవర్గం పూర్తిగా ఆయన వెంటే ఉండవచ్చ అంటున్నారు. ఈ లోగా అవసరార్ధం వెలమలతో కలసే ఉండాలన్నది రెడ్డి వర్గ నేతల వ్యూహమం టున్నారు. అదీగాక.. జగన్‌ కూడా వెలమల సారధ్యం లోని టీఆర్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని, తాజా ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులపై పోటీ పెట్టని వైనాన్ని సామాజిక నేతలు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో కూడా రెడ్డి వర్గానికి చెందిన జగన్‌ సారధ్యంలోని వైకాపా- వెలమ వర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ కలసి ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలను గుర్తు చేస్తున్నారు.

ఇంతవరకూ వైఎస్‌ అవినీతి, జగన్‌ అక్రమ ఆస్తులపై టీఆర్‌ఎస్‌ ఒక్క మాట కూడా అనని విషయాన్ని వారు తమ వాదనకు మద్దతుగా వినిపిస్తున్నారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడం ద్వారా తె లంగాణలో తమ పెత్తనం కొనసాగించాలనే పట్టుదల ఈ రెండు సామాజిక వర్గాల్లో కనిపిస్తోందంటున్నా రు. తాజా ఉప ఎన్నికల్లో సైతం రెడ్డి- వెలమ సామాజికవర్గం కలసిమెలసి పనిచేస్తోందని సామాజిక విశ్లే షకులు చెబుతున్నారు. గతంలో కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాగం జనార్దన్‌ రెడ్డి- కేసీఆర్‌ ఇప్పడు కలసి పనిచేస్తున్నారని, కొల్లాపూర్‌లో వెలమ వర్గానికి చెందిన జూపల్లిని గెలిపించేందుకు అక్కడి వెలమ- రెడ్లు ఏకమయి పని చేస్తున్నారని సామాజిక తెలంగాణ బీసీ జేఏసీ కన్వీనర్‌ కస్తూరి జయప్రసాద్‌ విశ్లేషించారు.

తెలంగాణ వస్తే ప్రత్యర్ధులయిన వెలమ-రెడ్ల మధ్య సయోధ్య కుదిర్చి, వారిద్దరికీ సమాన వాటా పంచేందుకే అగ్రకులానికి చెందిన కోదండరామిరెడ్డిని జాక్‌ చైర్మన్‌గా నియ మించారని . ఇప్పు డు కోదండరామిరెడ్డి ఉప ఎన్నికల్లో అదే పాత్ర పోషిస్తున్నారని, మహబూబ్‌నగర్‌లో బీసీ అభ్యర్ధి రంగం లో ఉన్నప్పటికీ ఆయనకు మద్దతు ప్రకటించలేదన్నారు. దీన్ని బట్టి బీసీలను అణచివేసేందుకు వెలమ - రెడ్లు కలసి పనిచేస్తున్నారన్న వాస్తవం స్పష్టమవు తోందని చెబుతున్నారు.

ఈ రెండు కులాల కలియక పై... రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. అసలు తెలంగాణ లో గొడవలు జరగటానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్, ఈ ఇద్దరి వలనే .. రాష్ట్రం రావణా కాష్టంలా కాలిపోయింది. అక్రమంగా అవినీతి సొమ్ము లక్ష కోట్లు సంపాదించిన జగన్ తో కేసిఆర్ ఎలా కలుస్తున్నాడు? అతని అక్రమాలపై ఇప్పటి వరకు .. ఒక్క విమర్శ కూడ చేయలేదని రాష్ట్ర ప్రజలు అంటున్నారు.

అసలు జగన్, కేసిఆర్ కలిసిపోవటానికి కూడా ఒక కారణం ఉందని చెబుతున్నారు. 1956 లో మాజీ సీఎం నీలం సంజీవ రెడ్డి తో రాష్ట్ర అధికారం ప్రారంభమైంది. 1973లో తెలంగాణ కు సంబందించిన వెలమ వర్గానికి చెందిన మాజీ సీఎం జలగం వెంగలరావుకు రాష్ట్ర అధికారం చేతిలోకి వచ్చింది. ఆ తరువాత 1983 నుండి రాష్ట్ర పగ్గాలు .. కమ్మ వర్గానికి చెందిన మాజీ సీఎం నందమూరి తారక రామరావు వచ్చాయి. అప్పటి నుండి కమ్మ, రెడ్డి వర్గంలో .. రాష్ట్ర పగ్గాలు మారుతున్నాయి.. అయితే ఇప్పుడు కొత్త ..కాంగ్రెస్ పార్టీ కాపుల పార్టీగా మారుతుందని గ్రహించిన ఈ రెండు కులాలు .. అధికారం కోసం ఒకటి అయ్యి, రాష్ట్రంలో.. కాపులకు, బీసీలకు, ఎస్సీలకు, అధికార పగ్గాలు చెందకుండా చేయాలనేది వీరి ఆశయం అని .. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hema malini election campaign for bjp in telangana
Sachin 100th century mahesh babu dialogue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more