ఆధ్యాత్మికవేత్త సాయి కాళేశ్వర్ బాబా ఆశ్రమ ఆస్తులు ఏం కానున్నాయి..? ఆశ్రమ బాధ్యతలు ఎవరు చూసుకోనున్నారు..? బాబా మృతితో ఇప్పుడు భక్తులను తొలుస్తున్న ప్రశ్నలివి..! వేయికోట్ల విలువైన ఆస్తులు అనంతపురం జిల్లా పెనుగొండలోని బాబా ఆశ్రమపరిధిలో ఉన్నాయి. ఈ ఆస్తులపై అనంతపురానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కన్ను పడినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వర్తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన సదరు నేత ఇప్పుడు ఆ ఆస్తులకు వారసుడయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పిన్నవయసులోనే ఆధ్యాత్మికతవైపు మళ్లిన బాబా.. పెనుగొండలోని చిన్న అద్దెగదిలో ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అనతికాలంలోనే అక్కడ అతిపెద్ద ఆశ్రమాన్ని నిర్మించారు.. కోట్లకు పడగెత్తారు. 1995లో పెనుగొండలోని గగన్‌మహల్‌కు సమీపంలో షిర్డీ సాయి గ్లోబల్ ట్రస్ట్ పేరిట ఆశ్రమం నెలకొల్పారు.
బాబాకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదీ ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. అయితే, పెనుగొండ పరిసరాల్లో రాయలవారి సంపద ఉండేదని, అది కాళేశ్వర్‌కు లభించి ఉండవచ్చనే ప్రచారం సాగుతున్నది. గుప్తనిధుల కోసం ఆయన తవ్వకాలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉగండా, ఇథియోపియా, దక్షిణాఫ్రికా వంటి పదిదేశాలకు బాబా వ్యాపారలావాదేవీలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తరించాయి. మనదేశంలోని పలు ప్రధాన నగరాల్లో కాళేశ్వర్‌కు అతిథి గృహాలు ఉన్నాయి. ఇటీవలే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కర్ణాటక మైనింగ్ వ్యాపారంలోనూ ఆయనకు భాగస్వామ్యం ఉన్నట్లు పలువురు చెబుతుంటారు. చిత్తూరులో కోట్ల విలువజేసే రియల్ భూములు, బెంగళూరులోని సహకారనగర్‌లో ఖరీదైన అతిథిగృహం, శ్రీశైలంలో మరో అతిథిగృహం ఉన్నాయి. ఆయన మరణంతో ఇప్పుడు ఈ ఆస్తులు ఏమి కానున్నాయి? ఎవరు చెజిక్కించుకోనున్నారు? భార్యాబిడ్డలే ఆశ్రమ బాధ్యతలు తీసుకుంటారా? లేక వాటిపై కన్నేసిన అనంత నేత వాటిని చేజిక్కించుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది.
కాళేశ్వర్ బాబా పెనుగొండ కేంద్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు కీలక భాగస్వామ్యం వహించారు. వారిలో కడప జిల్లాకు చెందిన న్యాయవాది భాస్కర్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన హౌసింగ్ డీఈ చంద్రమౌళి, సిరికల్చర్ డిపార్ట్మెంట్లో చిరుద్యోగి నాగి రెడ్డి ఉన్నారు. ఆశ్రమ వ్యవహారాలన్నీ వీరే చూసుకునేవారని స్థానికులు చెబుతుంటారు. తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని భాస్కర్ రెడ్డి బంధుత్వంగా మలుచుకున్నారు. తన కూతురు శిల్పను కాళేశ్వర్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. ఇప్పుడు కాళేశ్వర్ మృతితో ట్రస్ట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆయనకు భార్యతో పాటు సన్నిహితులూ దూరమయ్యారని స్థానికులు అంటున్నారు. ట్రస్ట్‌లో కాళేశ్వర్‌కు చేదోడువాదోడుగా మొదటి నుంచీ ఉన్న కొందరు వ్యక్తులు తమ వాటా తీసుకుని కొంతకాలం ఆశ్రమానికి దూరమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. వారందరూ ఇప్పుడు తిరిగి ఆశ్రమ పరిసరాల్లో కనిపించారని, కాళేశ్వర్ చరమదశకు చేరినందుకే వారు వచ్చారని పలువురు అంటున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ప్రభుత్వం తమ చేతిలో ఉన్నప్పుడు ఆయా నేతలు కాళేశ్వర్‌కు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకున్నారు. ఇందుకు ఆయన తగు విధంగా సంతృప్తిపరిచేవాడని, ఓ నేతకు ఇప్పటికీ కాళేశ్వర్ నెలసరి భత్యం చెల్లిస్తుంటారని ప్రచారం. ఈ నేపథ్యంలో కాళేశ్వర్ ఆశ్రమం, వ్యాపారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై పూర్తి సమాచారం, అవగాహన ఉన్న ఓ నేత.. తెర వారసుడిగా మారేందుకు వ్యూహం రచించారని సమాచారం. ఆ నేత సూచనల మేరకే మిగతావరందరూ నడుచుకుంటున్నట్లు తెలిసింది. అందుకే బాబా మృతి చెందినా... ఇంకా కృత్రిమ శ్వాస తీసుకుంటున్నారని ప్రచారం లేవనెత్తినెట్లు సమాచారం. అయితే, ఈ తతంగం మీడియాకు పొక్కడంతో వారు సర్దుబాటు చర్యలకు దిగారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more