ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాడోపేడో తేల్చుకోవాలని ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్ణయించుకున్నారు. మద్యం ముడుపుల ఆరోపణల సుడిలో ఇరుక్కున్న తనకు సీఎం రక్షణగా నిలిస్తే సరి! ఈ ముడుపులతో తనకు సంబంధం లేదని 'సభ సాక్షి'గా క్లీన్ చిట్ ఇస్తే సరేసరి! లేని పక్షంలో పదవికి, పార్టీకి గుడ్‌బై చెప్పాలని మోపిదేవి భావిస్తున్నట్లు తెలిసింది.
మద్యం సిండికేట్ల వ్యవహారం ముదురుతోంది. సిండికేట్ల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కుదిపేస్తున్న ఈ అంశం కొత్త మలుపు తిరిగింది. ఖమ్మం జిల్లాలో మద్యం సిండికేట్ వివాదాన్ని పరిష్కరించినందుకు మోపిదేవికి రూ. 10 లక్షలు లంచంగా ఇచ్చామని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మద్యం సిండికేట్ వ్యాపారం నిర్వహించిన నున్నా రమణ ఏసీబీ కస్టడీలో అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. రమణ వాంగ్మూలాన్ని ఏసీబీ కార్యాలయంలో రికార్డు చేసినట్లు తెలిసింది.
అప్పుడు ఖమ్మం మద్యం సిండికేట్ లీడర్ నున్న వెంకటరమణ రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావించడం... ఇప్పుడు నున్న రమణ కస్టడీ రిపోర్టులో 'సిండికేట్ల మధ్య రాజీ కుదిర్చినందుకు మోపిదేవికి రూ.10 లక్షలు ఇచ్చాం' అని నున్న చెప్పినట్లుగా బయటపడటంపై మంత్రి మోపిదేవి రగిలిపోయారు. హుటాహుటిన సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కిరణ్‌తో మోపిదేవి ముక్కుసూటిగా, కాసింత ఆగ్రహంగానే మాట్లాడారు. పదేపదే తన పేరు మా త్రమే బయటకు రావడానికి కారణమేంటని నిలదీసినంత పని చేశారు. "ఆరోపణలు రావడం సాధారణమే అనుకున్నాను. వీటిపై ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని ఇంతకాలం భావించాను. కానీ... నన్ను ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నట్లు ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది'' అని నిష్కర్షగా చెప్పేశారు.వితాంతం ఈ ముడుపుల ముద్ర భరించాల్సిందేనా అని కూడా ప్రశ్నించారు. "సహచర మంత్రిపై ఆరోపణలు వస్తే సీఎంగా మీరు మౌనంగా ఉంటే ఎలా? ఒకసారి ఆరోపణలు వచ్చినా మీరు ఖండించలేదు. రెండోసారీ ఏసీబీ నా పేరు లీక్ చేసింది. మిమ్మల్ని పది రోజుల కిందటే కలిశాను.
దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరాను. ఆ రోజేమో ఏమీ కాదులే అని సర్ది చెప్పారు. కానీ... వరుసగా జరుగుతున్న పరిణామాలేవీ ఏమంత సజావుగా కనిపించడంలేదు. ఏసీబీ మీ పరిధిలోనే పని చేస్తుంది. అప్పుడే మీరు చర్యలు తీసుకుని ఉంటే ఇక్కడిదాకా వచ్చే దే కాదు. ఈ నెల 13వ తేదీ నుంచి ఇప్పటి దాకా ప్రతి రోజూ అసెంబ్లీలో ఇదే అంశంపై గందరగోళం జరుగుతోం ది'' అని మోపిదేవి సీఎంతో అన్నారు. ఇంత జరుగుతున్నా ఏసీబీ అధికారులకు ఈ విషయంలో ఒక డైరెక్షన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
"బాబ్జీ, రాజాల ద్వారా నాకు ముడుపులు ఇచ్చినట్లు నున్న రమణ పేర్కొన్నట్లు ఏసీబీ చెబుతోంది. బాబ్జీ, రాజాలను ప్రశ్నించి వాస్తవాలను గుర్తించి... కేసు క్లోజ్ చేస్తే సరిపోయేది. కానీ అలా జరగలేదు. ముడుపులు తీసుకున్నానంటూ ప్రతి రోజూ నా పేరు టీవీల్లో మార్మోగుతోంది'' అని ఆక్రోశించారు. మోపిదేవి ఆగ్రహంతో తన వాదన వినిపిస్తుండగా... సీఎం ఆయన భుజం తట్టి అనునయించారు.
'రమణా! నువ్వు ఆవేశంలో ఉన్నావు. కూల్ అవ్వు' అని మళ్లీ సీఎం నవ్వుతూ మోపిదేవిని భుజం తట్టి అనునయించే ప్రయత్నం చేశారు. అప్పటికీ మోపిదేవిలో ఆవేశం చల్లారలేదు. "మీరేమో కూల్ అంటున్నారు. నేను మాత్రం ఏడవలేక నవ్వుతున్నాను. ఇది నా పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశం. ఇంతకుముందు డిమాండ్ చేసినట్లుగా రెండు రోజుల్లో సమగ్ర విచారణ జరిపించండి. ఈ అంశం శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అప్పట్లోగా వాస్తవాలు వెల్లడైతే బాగుంటుంది' అని రమణ చెప్పారు.
'సభలో నీ వాదన వినిపించు. నేనూ మాట్లాడతాను' అని కిరణ్ తనతో అన్నప్పుడు... "ముడుపులతో నాకు ఎలాంటి సంబంధంలేదని సభలో చెప్పాలి. నివేదికలో నా పేరు ప్రస్తావించిన వారిపై చర్యలు తీసుకోవాలి'' అని మోపిదేవి డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఒకవేళ సభలో కిరణ్ తనకు అండగా నిలవకపోతే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి... కిరణ్‌కే లేఖ ఇవ్వాలని, ఆ తర్వాత గాంధీ భవన్‌కు వెళ్లి పార్టీకీ గుడ్‌బై చెప్పాలని మోపిదేవి భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కిరణ్‌తో భేటీ అనంతరం మోపిదేవి పలువురు మంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.
"చాలామంది మంత్రులు, ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నా.... పలుమార్లు ఏసీబీ నా పేరే తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? దీనిపట్ల కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని నివృత్తి చేయాల్సిందే. పదేపదే నాపేరు ఎందుకు బయటకు వస్తోందంటూ ముఖ్యమంత్రిని నిలదీశాను. వాస్తవాలను బయటపెట్టాలని అడిగాను. నున్న వెంకట రమణతో నాకు ఎలాంటి సంబంధంలేదని గతంలోనే చెప్పాను. అయినా మళ్లీమళ్లీ నన్ను బద్నాం చేస్తున్నారు.
దీనివల్ల తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాను. విచారణ త్వరగా జరిపించి దీనికి పుల్‌స్టాఫ్ పెట్టాలని సీఎంను కోరాను. దీనిపై ఏ విచారణకైనా సిద్ధమే. ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తాను. లేఖ నా జేబులోనే ఉంది. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని అయినందునే నా పేరు బయటకు వస్తోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. నాకు సంబంధం లేదని చెప్పినా ఏసీబీ వివరణ కోరడం లేదు. మానసికంగా ఇబ్బంది పెడుతోంది. నాకు డబ్బులిచ్చారన్న ఇద్దరు వ్యక్తులపై విచారణ జరిపిస్తానని సీఎం హామీ ఇచ్చారు''.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more