ఆయన చెప్పారు.. మేం ఇచ్చాం నాటి సీఎం మౌఖికంగా ఆదేశాలిచ్చారు! జగన్ మీడియాకు ఇబ్బడిముబ్బడిగా ప్రభుత్వ ప్రకటనలు పంచిపెట్టిన వైనంపై సీబీఐ అధికారులు సమాచారశాఖ అధికారులను నిశితంగా ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీనియర్ ఐఏఎస్, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ప్రాజెక్టు డైరెక్టర్ పార్థసారథిని సీబీఐ అధికారులు సుమారు మూడు గంటల పాటు విచారించారు. సమాచారశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా చేసి పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావు, ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ రాజబాబును ఒకేచోట కూర్చోపెట్టి సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
"సమాచారశాఖ కమిషనర్, ఇతర అధికారులు ప్రతిరోజూ ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, ప్రత్యేక సందర్భాలు, పండుగలకు సంబంధించిన ప్రకటనలపై సీఎం మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారు'' అని వీరు సీబీఐకి వెల్లడించారని సమాచారం. గతంలో పార్థసారథి సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో జగన్‌కు చెందిన దిన పత్రిక, టెలివిజన్‌కు భారీగా ప్రకటనలు జారీ అయ్యాయి. అప్పుడే ప్రారంభమైన పత్రికకు ఇతర పత్రికల కన్నా భారీ స్థాయిలో ప్రకటనలిచ్చిన అంశంపై సీబీఐ విచారణ జరుపుతోంది.
ప్రభుత్వ ప్రకటనలు పత్రికలకు జారీ చేయడానికి ఏ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? లేదా పెద్దలు ఎవరైనా నేరుగా చెబితే నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు జారీ చేస్తారా? అప్పట్లో జగన్ పత్రిక ప్రకటనల విషయంలో సమాచారశాఖపై వైఎస్ ఏమైనా ఒత్తిడి తెచ్చారా? అన్న విషయాలను సీబీఐ అధికారులు తెలుసుకున్నట్లు సమాచారం. సమాచారశాఖ కమిషనర్, ఇతర అధికారులు ప్రతిరోజు ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని, ఆ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, ప్రత్యేక సందర్భాలు, పండుగలకు సంబంధించిన ప్రకటనలపై ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేస్తారని వీరు వివరించినట్లు తెలిసింది.
ఒకే విధమైన సర్క్యులేషన్ ఉన్న రెండు పత్రికలకు ఒకే విధమైన స్పేస్‌తో ప్రకటన ఎందుకు జారీ చేయలేదు? ఒక పత్రికకు సగం పేజీ ప్రకటన ఇస్తే, జగన్ మీడియా సంస్థకు మాత్రం పూర్తి పేజీ ప్రకటన ఇవ్వడానికి కారణం ఏమిటి? ఈ నిర్ణయం వెనుక పెద్దల ఆదేశాలేమన్నా ఉన్నాయా? అన్న కోణంలో సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకే స్థాయిలో సర్క్యులేషన్ ఉన్న రెండు పత్రికల మధ్య రెండేళ్లలో ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి 30కోట్ల వ్యత్యాసం ఎందుకు వచ్చిందనే విషయాలను తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు ఎక్కువగా ప్రయత్నించినట్లు తెలిసింది.
పార్థసారథిని విచారించడానికి ముందు జగతి పబ్లికేషన్స్‌లో ప్రకటనల విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు బాధ్యులను సీబీఐ అధికారులు పిలిపించి విచారించారు. జగన్ పత్రికకు జారీ చేసిన ప్రకటనలు ఏ ఉద్దేశంతో జారీ అయ్యాయో తెలుసుకునే ప్రయత్నం సీబీఐ చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more