New assembly in hyderabad

new assembly in hyderabad, Assembly of Hyderabad

new assembly in hyderabad

new.gif

Posted: 02/13/2012 07:39 PM IST
New assembly in hyderabad

new assembly in hyderabad

కొత్త సీఎం, కొత్త అసెంబ్లీ, కొత్త కొత్త ఆలోచనలతో అసెంబ్లీ హాల్ రూపురేఖలనే మార్చిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కొత్త ఆఫర్ ఇస్తున్నాడట. ఇక నుంచి వారు అసెంబ్లీలో కాగితాలు చించే పని లేదట. వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నరని తెలిసింది.
పుస్తక రూపంలో బడ్జెట్ ఉంటే.. దానిని ఆసాంతం చదువుతూ.. లోపాలున్న చోట కలంతో అండర్ లైన్ చేయవచ్చు. మేం ప్రస్తావించాలనుకున్న అంశాలున్న చోట పేజీలను మడత పెట్టవచ్చు. అవసరమైతే ఒకేసారి రెండు మూడు పేజీలను కూడా తిరగేసి చూసుకోవచ్చు. కానీ.. సీడీలో ఇవన్నీ ఎలా సాధ్యం?'' -రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కాగితం రహిత (పేపర్ లెస్) బడ్జెట్‌పై విపక్ష ఎమ్మెల్యే ఒకరి ప్రశ్న ఇది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న కాగితం రహిత బడ్జెట్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బడ్జెట్ వంటి అతి కీలకమైన వ్యవహారాన్ని పుస్తకాల రూపంలో కాకుండా సీడీల రూపంలో మాత్రమే ఇవ్వాలనుకోవడం సరికాదేమోనన్న అభిప్రాయం పలువురు ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. "దీని వల్ల బడ్జెట్ పుస్తకాలు మోసే పని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తప్పవచ్చు. కానీ.. ప్రజలకు మాత్రం నష్టం కలుగుతుంది. ఎందుకంటే.. బడ్జెట్‌ను గణాంకాలతో విశ్లేషించాలంటే.. అది పుస్తక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ప్రణాళికా వ్యయంతో ప్రణాళికేతర వ్యయాన్ని పోల్చి చూడాలన్నా.. క్యాపిటల్ వ్యయంతో రెవెన్యూ వ్యయాన్ని కలిపి విశ్లేషించాలన్నా కంప్యూటర్‌పై కుదరదు. పుస్తకం అయితే.. పేజీలను అటూ ఇటూ తిప్పుతూ విశ్లేషణలు రాసుకోవచ్చు'' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు.

వందల పేజీల్లో నిక్షిప్తమైన వివరాలను సభ్యులు కంప్యూటర్‌లో ఎంత వరకు చదవగలరన్నది అనుమానమేనని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. కంప్యూటర్‌పై అన్ని పేజీల సమాచారాన్ని చదువుకోవడం ఎవరికైనా ఇబ్బందేనని చెబుతున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఒక పథకానికి అనుకూలంగా గానీ.. వ్యతిరేకంగా గానీ వాదనలు తయారు చేసుకోవాలన్నా.. ఒక పథకానికి వివిధ సంవత్సరాల్లో కేటాయించిన నిధులను సరి పోల్చాలన్నా కూడా కంప్యూటర్‌పై సాధ్యం కాదని అంటున్నారు.

అలాగే.. శాఖల వారీగా కేటాయింపులను విశ్లేషించడం కంప్యూటర్‌పై సాధ్యం కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 2011-12 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలు.. అంతక ముందు ఆర్థిక సంవత్సరాల విశ్లేషణలు... రుణాలు, తదితరాలను సమగ్రంగా పరిశీలించి.. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలను నోట్ చేసుకోవాలంటే పుస్తక రూపంలో బడ్జెట్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమన్న వాదన కూడా వినిపిస్తోంది. అంతేగాకుండా.. ఎమ్మెల్యేలకు కంప్యూటర్లను సమకూర్చినప్పటికీ.. వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించగలిగే సామర్థ్యం ఎందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉంటుందన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా వయసులో బాగా పెద్ద వారైన సభ్యులకు కంప్యూటర్ల మీద అంత అవగాహన లేని విషయాన్ని గమనించాలని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. బడ్జెట్ కలిగిన సీడీతో పాటు బడ్జెట్‌ను సంక్షిప్తంగా వివరిస్తూ.. 'బడ్జెట్ ఇన్ బ్రీఫ్' అనే పుస్తకాన్ని కూడా తాము ఇస్తామని సర్కారు చెబుతోంది. బడ్జెట్ వివరాలను తెలుసుకోవడం ఈ పుస్తకం ద్వారా సాధ్యమవుతుందని పేర్కొంటోంది. ఇకపోతే.. బడ్జెట్ లీక్ కాకుండా ఉండాలన్న భావనతో.. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేవలం ఒక్కరోజు ముందు మాత్రమే పుస్తకాలను ఎంతో రహస్యంగా, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ముద్రిస్తారు. అయితే.. ఇంతటి కీలకమైన బడ్జెట్‌ను సీడీల రూపంలో ఇస్తున్న నేపథ్యంలో.. బడ్జెట్‌ను లీక్ కాకుండా ఆర్థికశాఖ ఎలా నిరోధించగలుగుతుందన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp wants bill on separate telangana moved in budget session
Kavita threatens of hunger strike over ambedkar statue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more