పచ్చగా ప్రశాంతంగా ఉండే యానాం ఎందుకు రణరంగమైంది? తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు చేరువలో ఉండే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన యానాం పట్టణం శుక్రవారం అట్టుడికిపోయింది. వేతనాలు, ఉద్యోగ భద్రతపై గత కొద్ది రోజులుగా స్థానిక రీజెన్సీ సిరామిక్ ఫ్యాక్టరీ కార్మికులు, యాజమాన్యం మధ్య జరుగుతున్న పోరాటం శుక్రవారం హింసాత్మకంగా మారింది. పోలీసులు జరిపిన లాఠీఛార్జిలో కార్మిక నాయకుడు మృతిచెందగా, ఆగ్రహించిన కార్మికులు జరిపిన మూకుమ్మడి దాడిలో ఫ్యాక్టరీ వైస్ ఛైర్మన్ కన్నుమూశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 12మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లాఠీఛార్జిలో మరో 40మంది గాయపడ్డారు. యాజమాన్య, పోలీస్ చర్యతో రెచ్చిపోయిన కార్మికులు మూకుమ్మడిగా విధ్వంసానికి దిగారు. రీజెన్సీ సంస్థకు చెందిన ఆస్తులు, వాహనాలను తగులబెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధ్వసం యథేచ్ఛగా కొనసాగింది. చివరకు కాకినాడ నుంచి వెళ్లిన ప్రత్యేక బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. కార్మికులు తిరిగి రెచ్చిపోకుండా ఉండేందుకు పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు ప్రకటించారు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
అసలు కారణాలు
యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ లిమిటెడ్ కంపెనీలో సుమారు 1200మంది కార్మికులు పని చేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కార్మిక చట్టాలకు అనుగుణంగా తమకు జీతాలు చెల్లించడం లేదని, యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందంటూ కార్మికులు పోరాటానికి సన్నద్ధమయ్యారు. గత ఏడాది జనవరిలో రీజెన్సీ స్ట్ఫా అండ్ వర్కర్స్ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన యాజమాన్యం ఈ ఏడాది జనవరి 2న సుమారు 800మంది కార్మికులను అర్థంతరంగా విధుల నుంచి తొలగించింది. మిగిలిన దాదాపు 400మంది కార్మికులు మాత్రం విధులకు హాజరవుతున్నారు. దీంతో తొలగింపునకు గురైన కార్మికులు యాజమాన్య వైఖరికి నిరసనగా ఫ్యాక్టరీ సమీపంలో శిబిరం ఏర్పాటు చేసి, రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి మచ్చా మురళీమోహన్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ఉదయం షిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న కార్మికుల వద్దకు మురళీమోహన్ వెళ్ళి సమ్మెకు సహకరించాల్సిందిగా కోరారు. మిగిలిన ఆందోళనకారులు కూడా అక్కడకు చేరుకోవడంతో వారి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. రంగప్రవేశం చేసిన యానాం పోలీసులు యూనియన్ నేత మురళీమోహన్ సహా సుమారు 100మంది కార్మికులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మిగిలిన కార్మికులంతా పోలీసు స్టేషన్‌వద్దకు చేరుకున్నారు. పోలీసులకు, కార్మికులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో లాఠీఛార్జి చేశారు. ఆ ఘటనలో 40మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కార్మిక సంఘ నేత మురళీమోహన్‌ను పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టడంతోపాటు ఛాతీపై పిడిగుద్దులు గుద్దటంతో కుప్పకూలిపోయాడు. సంఘటన స్థలంలోనే కన్నుమూశాడు. దీంతో కార్మికులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కార్మికులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో 12మంది గాయపడ్డారు. సంఘటనలతో ఆగ్రహోదగ్రులైన కార్మికులు మూకుమ్మడిగా విధ్వంసానికి దిగారు. పట్టణంలోవున్న రీజెన్సీ సంస్థ ఉపాధ్యక్షుడు కెసి చంద్రశేఖర్ ఇంటిపై కర్రలతో దాడిచేశారు. చంద్రశేఖర్ తలపై కర్రలతో కొట్టడంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయనను కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
మరోవైపు కార్మిక కుటుంబాలు, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు వేల సంఖ్యలో రీజెన్సీ సంస్థను ముట్టడించారు. కంపెనీలోకి ప్రవేశించి సంస్థ యంత్రాలను, వాహనాలను, డీజిల్ బంక్‌ను, ఫర్నీచర్‌ను తగులబెట్టారు. రీజెన్సీ సిరామిక్స్, రీజెన్సీ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన సుమారు 30 బస్సులు, లారీలు, ట్యాంకర్లకు నిప్పుపెట్టారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న వందలాది ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. రీజెన్సీ సిరామిక్స్ అనుబంధ సంస్థ రిగ్మా ప్రోడక్ట్స్ అట్టల ఫ్యాక్టరీని సైతం ఆందోళనకారులు తగులబెట్టారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో యానాం పోలీసులు ఆంధ్రా పోలీసుల సహాయాన్ని అభ్యర్థించారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి మధ్యాహ్నానికి అదుపులోకి వచ్చింది.
క్షతగాత్రులు కాకినాడ తరలింపు
యానాం పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన 12మందిలో తొమ్మిది మందిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
బలగాలను పంపించాం. యానాం ఘటనపై హోంమంత్రి సబిత.. తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి
బాంబు దాడుల పడగ నీడన అల్లర్లతో అట్టుడుకుతున్న యానాంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక బలగాలను పంపినట్టు రాష్ట్ర హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో భద్రత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాయలసీమ జిల్లాల ఐజిలు, డిఐజిలు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతి భద్రతలను సమీక్షించారు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more