చెన్నయ్ చందమామ ‘జోడి’ తమిళ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా తెరపైకి ప్రవేశం జరిగిందట. అది కూడా ఇప్పటికి 1999లో చెన్నయ్ చందమామ తన ముఖనికి మేకప్ వేసుకుందట. చెన్నయ్ చందమామ వరుసగా 2003 వరకు తమిళ గాలే పీల్చుకుంటు ఉందట. మొదటి సారిగా 2003 తెలుగు వెండి తెరపై ‘నీ మనస్సు నాకు తెలుసు’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు చెన్నయ్ చందమామకు వచ్చిన, పెద్దగా గుర్తింపు పొందలేకపోయిందట.
తరువాత 2004 సంవత్సరంలో త్రిష ‘వర్షం’లో హీరో ప్రభాస్ కలిసి నటించి .. తెలుగు ప్రేక్షకులను ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చొన వాన, ఎన్నాళ్లు దాగుంటావు పైన’ అంటూ తెలుగు కుర్రకారును వర్షంలో తడిపిసేంది త్రిష. ఆ రోజు నుండి ఇప్పడి వరకు తెలుగు యువకులు త్రిష కురిపిస్తున్నవర్షంలో తడుస్తునే ఉన్నారు. ఇటీవల కాలంలో త్రిష ‘త్రీన్ మార్’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించి .. ఇంకా యూత్ కు వేడి పుట్టించింది. త్రిషవి పాత అందలే అయిన చూసే వారికి కొత్తగా ఉన్నాయని.. సినిమా విశ్లేషకులు అంటున్నారు.
ఈ మధ్య కాలంలో త్రిషకు పోటిగా అనేక మంది అందాల భామలు .. తెలుగు వెండి తెరపై స్పెషల్ వర్షం కుర్పింస్తున్నారు. త్రిష కూడా నెంబర్ వన్ హీరోలతోనే సినిమా జీవితం సాగింది. చిరంజీవి, పవన్, మహేస్, వెంకటేష్, ప్రభాస్, లాంటి హీరోల సరసన తన వర్షం కురిపించి..యువకుల గుండెల్లో మెరుపు లాంటి వేడి పుట్టించింది.
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఎన్నో చేసిన త్రిషకు ఈ రోజు వరకు తెలుగు రాదట. ఆమె కంటే వెనక వచ్చిన హీరోయిన్స్ అనుష్క, కాజల్, తమన్నా, తాప్పి లాంటి వారు తెలుగు చక్కగా నేర్చుకొని.. తెలుగు సినిమాలో వారి సొంత వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పుకంటున్నారట. త్రిష కు మాత్రం ఆ ఛాయిస్ లేదని అందుకే ఆమెకు తెలుగులో సినిమాలు తగ్గాయాని, దర్శకులు అంటున్నారు.
త్రిషలో అందం ఉంది, నటన ఉంది, కానీ తెలుగు మాత్రం రాదట. ఆమెకు లైప్ ఇచ్చిన తెలుగు పై చూపుతున్న సులకన భావన.. ఆమెకు నష్టం కలిగిస్తున్నాయట. నటన పరంగా బలంగానే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు త్రిష. అయితే తెలుగుతెరకు పరిచయమై పదేళ్లు అవుతున్నా ఇంకా ఈ చెన్నయ్ చందమామకు తెలుగు భాష రాకపోవడం మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు కొంత మింగుడు పడని విషయమే. త్రిష మాత్రం ఇంకా ‘తెలుగు’లో బలహీనంగానే ఉన్నారట. అందుకే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడాలనుకుంటున్నారామె.
ఇక నుంచి తాను నటించే సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. త్రిష. అందులో భాగంగానే ప్రథమంగా అజిత్ సరసన తమిళంలో నటించిన ‘మంకాత్తా’లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’, తమిళంలో విశాల్ సరసన ‘సమరన్’ చిత్రాల్లో త్రిష నటిస్తున్నారట. ఈ చిత్రాల్లో సాధ్యమైనంతవరకూ తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారట త్రిష. ‘సమరన్’ చిత్రానికి ఇప్పటికే సీరియస్‌గా డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నారు.
కాగా, ఇక మిగిలింది ‘దమ్ము’. ఈ చిత్రంలోని తన పాత్రకు కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి తెలుగు నేర్చుకునే పనిలో పడ్డారట త్రిష. ప్రతి రోజు తెలుగు మాష్టర్ త్రిష ఇంటికి వెళ్లి తెలుగు నేర్పుతున్నాడట. త్రిష ‘‘సాధ్యమైనంత వరకూ ‘దమ్ము’లో నా గొంతును వినిపించడానికి ప్రయత్నిస్తానని అంటుంది. ఒకవేళ కుదరకపోతే... తర్వాత సినిమాకైనా కచ్ఛితంగా డబ్బింగ్ చెబుతానని త్రిష గట్టిగా తెలుగు నేర్చుకుంటుందని ఆ తెలుగు మాష్టర్ .. తన సన్నిహితులు దగ్గర అంటున్నాడట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more