తెలంగాణా లోకి వస్తే ఊరుకోం అంటే, రానివ్వకపోతే ఊరుకోం అంటూ రాజకీయ వర్గాలు వాగ్బాణాలు సంధించుకుంటున్నాయి. తెలంగాణా విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోతే తెలంగాణాలో తిరగనివ్వరని, ప్రజలు తరిమి కొడతారని తెరాస నాయకులు అంటుంటే, చంద్రబాబు రైతు పోరుబాటను అడ్డుకుంటే మంచిది కాదని తెదేపా నేతలు హెచ్చరిస్తున్నారు. అలాగే ఓదార్పులు సామాన్యంగా సంవత్సరం లోపులోనే ఉంటాయి కానీ, కారణాంతరాల వలన ఇప్పటికీ వైయస్ జగన్ చేసే ఓదార్పు యాత్రను అడ్డుకుంటే తెలంగాణా ద్రోహులు అవుతారని కొండా సురేఖ ప్రకటించారు.
రానివ్వకపోవటం మంచిది కాదని, అలా చేస్తే ఊరుకోమని ప్రకటించటంలోనే తెలంగాణా ప్రాంతాల్లో తిరగటానికి నాయకులు ఇంకా భయపడుతూనే ఉన్నరన్న విషయం స్పష్టమౌతోంది. రాజకీయ నాయకుల్లో ఈ విధమైన భయాన్ని సృష్టించిన తెరాస రాజనీతిఙతను ఏ రాజకీయ విశ్లేషకుడూ మెచ్చుకోకుండా ఉండలేడు. ఎన్నికల్లో ఘన విజయం సాధించటానికి పనికి వచ్చిన ఆ రాజకీయ వ్యూహం నెమ్మది నెమ్మదిగా సడలిపోతుండటంతో తెరాస నాయకులు ఆక్షేపణలు చెయ్యటం, దాన్ని కాపాడుకోవటానికి చూడటం కూడా సహజమే.
తెరాస కంచుకోటను ఛేదించటానికి తెదేపా తెలంగాణా ఫోరం నేతలు కూడా పెద్దగా విజయాన్ని సాధించలేకపోయారు. బాన్సువాడ ఉప ఎన్నికల సమయంలో తెదేపా తెలంగాణా ఫోరం సభ్యులు ఆ ప్రాంతంలోకి పోకుండా అల్లర్లు చెలరేగకుండా నివారించటానికి పోలీసులే అడ్డగించారు. కానీ వచ్చే ఎన్నికలకల్లా, ముఖ్యంగా త్వరలో రానున్న ఉప ఎన్నికలకల్లా తెలంగాణా ప్రాంతంలో తిరగలేకపోతే గెలవటం కష్టమని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ, పిల్లి మెడలో గంట కొట్టే పని ఎవరికి అప్పజెప్పాలా అని చూస్తుంటే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు రైతు పోరు బాట కార్యక్రమంలో ముందడుగు వేసారు. తెదేపాకి సాయం చెయ్యటానికి కాదు కానీ తెలంగాణాలోకి దారి అంటూ ఏర్పడాలి, దారి ఏర్పడ్డ తర్వాత ఆ దారిలో ఎవరైనా ప్రయాణం చెయ్యవచ్చు కాబట్టి, అధికార పక్షం పోలీసు బలగాలతో చంద్రబాబు పర్యటనకు పూర్తి మద్దతునిచ్చింది. రాజకీయాల్లో ఎవరి వ్యూహం వారిది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more