వైయస్ జగన్ అక్రమ ఆస్తులను దర్యాప్తు చేస్తున్న సిబిఐ నిన్న విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసింది. వైయస్ ఆర్ కుటుంబంతో 20 సంవత్సరాలుగా సన్నిహిత సంబంధమున్న విజయసాయి రెడ్డి అరెస్ట్ కి అన్నివిధాలా సంసిద్ధులై ఉన్నట్టుగా తెలుస్తోంది. నెల్లూరు వాసియైన విజయసాయి రెడ్డి ఒక సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ గా వైయస్ఆర్ కీ ఆయన కుమారుడు వైయస్ జగన్ కీ అత్యంత సన్నిహితుడిగా సలహాదారుగా వ్యవహరించారు. జగతి పబ్లికేషన్స్ వ్యవహారాలను మొదటి నుంచీ ఆయనే చక్కబెడుతున్నారు. ప్రతివిషయాన్నీ సూక్ష్మంగా తెలుసుకునే అలవాటున్న విజయసాయిరెడ్డి, చంచలగూడ జైలులో ఏ కేటగరీ సెల్ ఎలా ఉంటుంది, ఎందులో ఎలాంటి వసతులుంటాయన్న వివరాలు సహితం సేకరించారట. తనని అరెస్ట్ చేస్తారని తెలిసిన విజయసాయి రెడ్డి చంచల్ గూడా జైల్ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఆ వివరాల్లో ఎ క్లాస్ సెల్ లో టివి ఛానెల్స్ అన్నీ వస్తాయమని కూడా ఉంది. జైలులో ఉండటానికి మానసికంగా సిద్ధపడ్డ ఆయన యోగ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుని మనసుని అదుపులో పెట్టుకుంటూ ప్రశాంతంగా ఉంటుకోవటానికి అవసరమైన విధానాలను తెలుసుకున్నారు. జైలు అధికారులలో వివిధ శ్రేణులలో పని చేసేవారి పేర్లు కూడా ఆయన తెలుసుకుని పెట్టుకున్నారు. లోగడ ఆయన, జగన్ కి కిట్టని వారి వలన తన ప్రాణానికి హాని ఉందని, తనకు రక్షణ కలుగజేయమని ప్రభుత్వాన్ని కోరారు. దానితో ఆయనకు ప్రభుత్వం కేటాయించిన నలుగురు పెర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లను అరెస్ట్ అవటం వలన ఉపసంహరించుకుంది.
విజయసాయి రెడ్డిని సిబిఐ విచారణకు ఎన్నో సార్లు పిలవటం జరిగింది. ఆయన ఎప్పుడూ తను చెప్పదలచుకున్న విషయాలను ప్రశాంతంగానే చెప్పారు. విచారణకు వెళ్ళే ముందు, అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒకేలా కనిపించారు. అది మేకపోతు గాంభీర్యమేమో అని అన్న వాళ్లూ ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more