Actress kareena kapoor crying scene

Bollywood Actress Kareena Kapoor Crying Scene, Kareena Reveals First day of Heroine Shoot,Kareena Kapoor videos and movie clips, biography, Kareena Kapoor pictures gallery and Kareena Kapoor movies

Bollywood Actress Kareena Kapoor Crying Scene.

Kareena Kapoor.GIF

Posted: 12/10/2011 03:06 PM IST
Actress kareena kapoor crying scene

Bollywood Actress Kareena Kapoor Crying Scene.

తనకేంటి... గోల్డెన్ స్పూన్‌తో పుట్టింది. కష్టాలెలా ఉంటాయో అస్సలు తెలియదు. ఇంకా చెప్పాలంటే తను మహారాణిలాంటిది’’ అని కరీనాకపూర్ గురించి బాలీవుడ్‌లో చాలామంది మాట్లాడుకుంటారు. మాటల్లో చాలా నిజముంది. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ కుటుంబాల్లో కరీనా కుటుంబం ఒకటి. బెబోది (కరీనా ముద్దు పేరు) రాణీవైభవం అనమాట. ఆమె కంట తడిపెడితే మొత్తం కుటుంబమంతా కంగారుపడిపోతారు. కరీనా మనసు నొప్పించే విధంగా నడుచుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు ఇష్టపడరు. అంత సుకుమారంగా, గారాబంగా చూసుకుంటారు బెబోని. అంత అందమైన జీవితం గడుపుతున్న బెబో ఇటీవల కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే ఏడుపు బెబో వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు.

ప్రస్తుతం ఆమె ‘హీరోయిన్’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. నటి తన జీవితంలో ఎదుర్కొనే ఎత్తుపల్లాల సమాహారంతో దర్శకుడు మధూర్‌బండార్కర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్రంలో కరీనా పూర్తిగా లీనమై నటిస్తున్నారట. నటి జీవితంలో ఉండే సమస్యలకు సంబంధించి ఇటీవల సన్నివేశం తీస్తున్నప్పుడు ఆమె కదిలిపోయారట. నిజంగానే కథానాయికలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారా? అంటూ బాధ తట్టుకోలేక ఏడ్చారట. 

కరీనాకి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి సినిమా పరిశ్రమలో ఆమెకు తగిన రీతిలో గౌరవ, మర్యాదలు ఇస్తారు. ఆమె అడుగులకు మడుగులొత్తేవాళ్లే ఎక్కువ. అందుకని హీరోయిన్ల విషయంలో జరిగే అవమానాలు, లైంగిక వేధింపులేవీ కరీనాకి తెలియవు. ఇప్పుడిది హీరోయిన్ల జీవితాలను ఆధారం చేసుకుని తీస్తున్న సినిమా కావడంతో.. వారి కష్టాలెలా ఉంటాయో తెలుసుకునే వీలు కరీనాకి కలిగింది. కష్టాలు తెలుసుకునే ఆమె ఏడ్చారట. కరీనా సున్నిత మనస్కురాలడానికి ఇదొక నిదర్శనం. లొకేషన్‌లో చాలాసేపు ఆమె అదే మూడ్‌లో ఉండిపోయారని, కరీనా చిత్రాన్ని చాలా ఓన్ చేసుకుంటున్నారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan excited over dirty picture success
Bjp is ready to state that they dont have foreign bank accounts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more