Vidya balan excited over dirty picture success

Vidya Balan excited over Dirty Picture success, Vidya Balan videos and movie clips, biography, Vidya Balan pictures gallery and Vidya Balan movies filmography

Vidya Balan excited over Dirty Picture success

Vidya Balan.GIF

Posted: 12/10/2011 05:55 PM IST
Vidya balan excited over dirty picture success

Vidya Balan excited over 'Dirty Picture success

రెండు పాత్రలూ ఉత్తర, దక్షిణ ధ్రువాల్లాంటివి. ఒక పాత్రలో సంసారపక్షంగా, మరో పాత్రలో శృంగారభరితంగా నటించాను. ఒకే ఏడాది ఇలా రెండు రకాల పాత్రల్లో నటించి మెప్పించగలిగినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు విద్యాబాలన్. ఏడాది ఆరంభంలో విడుదలైన ‘నో ఒన్ కిల్డ్ జెస్సికా’ చిత్రంలో చేసిన సబ్రినా లాల్, ఇటీవల విడుదలైన ‘ది డర్టీ పిక్చర్’లో చేసిన సిల్క్ పాత్రల గురించే ఆమె పై విధంగా స్పందించారు. బాలీవుడ్‌లో ‘పరిణీత’ చిత్రంతో కెరీర్ ఆరంభించి ‘హోమ్లీ గాళ్’ ఇమేజ్ తెచ్చుకున్న విద్యాబాలన్ ‘ది డర్టీ పిక్చర్’లో హద్దులు దాటి శృంగార ప్రదర్శన చేశారు. 

చిత్రం విడుదల కాకముందు పోస్టర్స్‌లో విద్యా తెగువ చూసి చాలామంది ఖంగు తిన్నారు. సినిమా విడుదలైన తర్వాత విమర్శనాస్త్రాలు సంధించాలని కూడా చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ అలాంటివారు సైతం ‘‘విద్యాబాలన్ నటన సుపర్బ్. పాత్రనైనా చెయ్యగలవాళ్లే మంచి ఆర్టిస్టులు కింద లెక్క. హోమ్లీ పాత్రల్లో నిరూపించుకున్న విద్యా ఇప్పుడు గ్లామరస్ గాళ్‌గా కూడా చెయ్యగలనని నిరూపించుకుంది. ‘ది డర్టీ పిక్చర్’ ఒప్పుకోవడం తప్పేం కాదు. ఇందులో పాత్రకు తగ్గట్టుగానే ఆమె నటించింది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ప్రశంసలకు విద్యా ఆనందం వ్యక్తపరుస్తూ -‘‘నేను పాత్ర అయినా సరే ఒక కమిట్‌మెంట్‌తో చేస్తా. అందుకే సక్సెస్ అవుతా. నిజానికి ఈత కొలనులో జలకాలాట సాగిస్తానని, హీరో నా చీర విప్పడానికి ప్రయత్నం చేసే సన్నివేశాల్లో నటిస్తానని, హీరోని రెచ్చగొట్టేట్లు నటిస్తానని నేనూహించలేదు. ఇవన్నీ డర్టీ పిక్చర్‌లో చేశాను. కానీ ప్రేక్షకులకు అసహ్యం కలిగించే విధంగా చేయకపోవడంవల్ల సక్సెస్ అవ్వగలిగాను’’ అన్నారు. చిత్రం తర్వాత విద్యాబాలన్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఫలితంగా ఆమె పారితోషికం పెంచేశారట. ఆమె ఎంత కోరితే అంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధపడుతున్నారని సమాచారం. 

మొత్తం మీద 2011 ఆరభంలో ‘నో ఒన్ కిల్డ్ జెస్సికా’లాంటి హిట్ అందుకున్న విద్యా.. ఏడాది చివర్లో ‘ది డర్టీ పిక్చర్’తో విజయానందాన్ని చవిచూస్తున్నారు. కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వానం పలకడానికి రెడీ అవుతున్నారామె. ఇదిలా ఉంటే... ‘డర్టీ పిక్చర్’ ఇన్‌స్పిరేషన్‌తో ఇప్పుడు కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు డర్టీ పిక్చర్లు తీయడానికి సిద్ధపడుతున్నారట. వీటిలో విద్యాబాలన్‌ని నటించమని కోరుతున్నారని వినికిడి. అయితే.. డర్టీ అవకాశాలను బ్యూటీ తిరస్కరిస్తున్నారని సమాచారం. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అన్నట్లు.. డర్టీ కేరక్టర్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అని విద్యా భావిస్తున్నారేమో...!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan marrage place
Actress kareena kapoor crying scene  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more