murali mohan decisions made jayasudha pannel defeat

Naga babu background work made rajendra prasad victory

MAA Elections 2015 Results, Rajendra prasas womn maa elections, MAA Elections Live Updates, Inexplores: maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema

mega brother nagababu hard work beyond the screen made easy rajendra prasad pannel victory

‘మా’ రాజు ను గద్దె ఎలా వరించింది..? నాగస్త్రమే కారణమా..?

Posted: 04/17/2015 04:38 PM IST
Naga babu background work made rajendra prasad victory

తెలుగు సినీ కళామా తల్లి కుటుంబంలో మునుప్పెన్నడూ లేనంతం ఉత్కంఠభరితంగా సాగి.. సాదారణ సార్వత్రిక ఎన్నికలను తలపించిన మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో నటకిరీటీ రాజేంద్రుడు కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. ముందునుంచి సాగుతున్న భారీ అంచనాలకు భిన్నంగా మా రాజు గద్దె నెక్కాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా సాధరణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికలలో రెండు ప్యానెల్స్ మద్య పోటీ నెలకోంది. అంతేకాదు, ముపుపెన్నడే లేని విధంగా కళామ తల్లి బిడ్డల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. అరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ప్రశ్నలపై అవలీలగా సమాధానాలు వినబడ్డాయి.

ప్రస్తుతం సిట్టింగ్ అధ్యక్షుడు మురళీ మోహన్ పదవీ కాలం ముగిసిందని తెలియగానే ఆ పదవికి పోటీ చేస్తానని రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ ఆ పదవికి తగిన వాడు కాదని, మోగా బ్రదర్ ప్రతిపాదనను మార్చుకోవాలని మురళీ మోహన్ సూచించినా.. వెనక్కు తగ్గని నాగబాబు.. రాజేంద్రుడికి అండగా నిలిచారు. దీంతో ఆఘమేఘాల మీద జయసుథను తెరపైకి తీసుకువచ్చిన మురళీ మోహన్ కోఠారీ.. అమెను అధ్యక్ష బరిలోకి దింపింది. ఎలాగైనా జయసుధను గెలిపించి అధిపత్యం చెలాయించాలని భావించింది. అక్కడి నుంచే మా ఎన్నికలలో అసలైన రసవత్తర పరిణామం తెరమీదకు వచ్చింది.

'మా' అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ వర్గం గెలవడం కష్టమేనన్న మాట ముందు నుంచి వినిపించింది. నటకిరీటితో పాటుగా కేవలం నలుగురు మాత్రమే రాజేంద్రప్రసాద్ ప్యానెల్ నుంచి పోటీ చేయడం.. మరోవైపు జయసుధ ప్యానెల్ నుంచి 12 మంది ప్యానెల్ మెంబర్లు పోటీ చేయడం కూడా రాజేంద్రుడుపై అంచనాలను తగ్గించింది. ప్రతీ ప్యానెల్ మెంబర్.. వారికి పరిచయస్థులను తీసుకుని ఓటింగ్ వస్తే.. జయసుథ ప్యానెల్ కు గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని కూడా అంచనాలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ తలకిందులు చేస్తూ.. రాజేంద్రప్రసాద్ సహా నలుగురు ప్యానెల్ సభ్యులు విజయం సాధించారు. పోలైన మొత్తం 394 ఓట్లలోనే రాజేంద్రప్రసాద్ 87 ఓట్ల మెజారిటీతో మా పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

జయసుధ ఓటమి మురళీమోహన్ స్వయంకృపారాదమా..?

సహజనటి జయసుధ ఓటమికి మురళీమోహన్ వర్గం చేసుకున్న సొంత తప్పిదాలు కారణమా..? అంటే అవుననే సమాధానాలే అధికంగా వినబడుతున్నాయి. మా అధ్యక్షుడి హోదాలో ఆరు పర్యాయాలు విజయం సాధించిన మురళీమోహన్.. రాజేంద్ర ప్రసాద్ ను గతంలో ఒక పర్యాయం ఓడించిన విషయం మా కళాకారులకు విధితమే. అయితే రాజేంద్రప్రసాద్ లాంటా నటకిరీటిని మా అధ్యక్ష పదవికి అడ్డుకోవడంతో.. మురళీమోహన్ లోని మరో కోణాన్ని కళాకారులకు పరిచయం అయ్యింది,  ప్రముఖ నటుడికే మా అండగా నిలవని పక్షంలో తమకెలా నిలుస్తుందన్న ఆలోచన కూడా కళాకారులలో ఉదయించింది. అదే జయసుధ ప్యానెల్ ఓటమికి కారణమైంది. కాగా, గతంలో మురళీమోహన్ మీద పోటీ చేసినప్పుడు కేవలం 7 ఓట్ల తేడాతోనే ఓడిపోయిన రాజేంద్ర ప్రసాద్ రికార్డు స్థాయి మోజారిటీతో గెలుపోందారు. జయసుధ మీద ఆయన 87 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాజేంద్రుడికి పీఠాన్ని దూరం చేయాలనుకున్న వారికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు కళామతల్లి ముద్దుబిడ్డలు.

రాజేంద్రుడి విజయానికి బాటలు

* మోగా బ్రదర్ నాగబాబు బహిరంగంగా ముందునుంచి రాజేంద్రప్రసాద్కు అండగా నిలబడటం
* రాజేంద్రప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ముందునుంచి ప్రయత్నాలు చేయడం
* చివరి నిమిషంలో అనూహ్యంగా మురళీమోహన్ జయసుధను రంగంలోకి దించడం
* ఆరుసార్లు మా అధ్యక్ష పదవిని చేపట్టిన మురళీమోహన్ సామాన్య నటులకు దూరం అయ్యారనే విమర్శ
* క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులను మురళీమోహన్ దూరం పెట్టారన్న విమర్శలు
* దీంతో ఆ వర్గాలన్ని ముందునుంచి రాజేంద్రప్రసాద్ దగ్గరకు చేరుకున్నాయి
* 'మా' ఎన్నికలు ప్రాదాన్యత సంచరించుకున్నంత స్థాయిలో పోలింగ్ జరగకపోవడం. 702 ఓట్లలో కేవలం 394 మాత్రమే పోలవ్వడం.
* జయసుధకు అగ్రనటులు మద్దతనిచ్చినా వారు ఎన్నికలకు దూరంగా వుండటం.
* నాగబాబు పిలుపు మేరకు ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో అధికం సానుకూలంగా స్పందించడం
* 'మా' కార్యాలయాన్ని మురళీమోహన్ రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చేశారన్న విమర్శలు
* నటీనటులందరూ కళామతల్లి బిడ్డలన్న భావనకు దూరంగా మా కార్యాలయాన్ని మర్చడం
* తమ పార్టీకి చెందిన కళాకారులకే ఎంట్రీ లభించేట్లుగా కార్యాలయాన్ని మార్చారన్న విమర్శలు రావడం.
* తెలంగాణకు చెందిన కళాకారులు సమిష్టిగా రాజేంద్రప్రసాద్కు మద్దతునివ్వడం

 జి. మనోహర్

Related News and Gallerys:

మా ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ఘన విజయం

'మా' రాజకీయ సినిమా సిత్రం.. టైటిల్ దగ్గరి నుండి ఎండ్ కార్డ్ వరకు

ఏకగ్రీవంగా ‘మా’ రాజు ఎన్నిక.. ప్రతిష్ట మరింత పెరిగేది నాగబాబు

హామీలన్నీ నెరవేరుస్తాం.. నాగబాబు గారికి ధన్యవాదాలు: రాజేంద్రప్రసాద్

కమెడియన్ ఆలీపై ఘనవిజయం సాధించిన శివాజీరాజా

మా ఎన్నికల విజేతలు వీరే

మురళీమోహన్ వల్లే ‘మా’ ఎన్నికల్లో జయసుధ ఓడిందా?

జయసుధ అక్కడికి రాలేదు.. ఎందుకంటే!

మురళీ మోహన్ పై నిప్పులు చెరిగిన విజయ్ చందర్

 

Gallerys:

Maa Election Counting Results Photos

Rajendra Prasad MAA Victory Celebrations Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  movie arts association elections  naga babu  

Other Articles