jayasudha news | maa elections controversy | rajendra prasad gossips

Jayasudha not visits telugu film chambers maa elections results time

jayasudha news, jayasudha controversy, maa elections news, maa controversy, rajendra prasad maa elections, shivaji raja news, shivaji raja updates, rajendra prasad gossips, jayasudha gossips, comedian ali news

jayasudha not visits telugu film chambers maa elections results time : There are lots of doubts coming out for jayasudha not visits to film chamber at the time of maa elections counting.

జయసుధ అక్కడికి రాలేదు.. ఎందుకంటే!

Posted: 04/17/2015 01:11 PM IST
Jayasudha not visits telugu film chambers maa elections results time

గతకొన్నాళ్ల నుంచి ఉవ్విళ్ళూరిస్తూ వచ్చిన ‘మా’ అధ్యక్ష ఎన్నికల పోటీల్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే! అయితే రిజల్ట్ వెలువడక ముందు ఎవరు గెలుపొందుతారోనన్న టెన్షన్ తో రాజేంద్రప్రసాద్ ప్యానెల్, జయసుధ ప్యానెల్ కు సంబంధించిన అభ్యర్థులు అందరూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి చేరుకున్నారు. ఈ రెండు ప్యానెల్స్ లో రాజేంద్రప్రసాద్ తోపాటు ఆయన సభ్యులు సైతం హాజరయ్యారు గానీ.. జయసుధ ప్యానెల్ నుంచి తక్కువమంది హాజరవడంతోపాటు ముఖ్యంగా ఈ అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థి జయసుధ రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనన్న విషయం జయసుధకు ముందే తెలసి వుంటుందని.. అందుకే ఆమె ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి రాలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా.. ఈ ఎన్నికల ముందు జయసుధపై, ఆమె ప్యానెల్ పై తీవ్ర ఆరోపణలు రావడంతోపాటు కాస్త బ్యాడ్ ఇమేజ్ వచ్చిందన్న విషయాన్ని జయసుధ గ్రహించి వుంటారని అంతా అనుకుంటున్నారు. అందరూ ముందుగా ఊహించినట్లుగానే ఈ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ గెలుస్తారన్న సంగతి జయసుధ కూడా పసిగట్టి రాలేదని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ విషయం తెలిసి కూడా ఆమె ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయిందని విశ్లేషకులు ఆందోళనల్లో మునిగిపోయారు.

మరోవైపు.. సాధారణ ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. అందులో ఎవరు గెలుపొందారోనన్న విషయం దాదాపు 90 శాతం వరకు తెలిసే అవకాశం వుంది. ఇలాగే ‘మా’ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారా..? ఆ వివరాలు జయసుధకు తెలిశాయా..?  అలా వివరాలు తెలిసిన నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ గెలుస్తారనే నమ్మకంతో ఆమె ఫిల్మ్ ఛాంబర్ కి హాజరు కాలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఆరోగ్య కారణాల రీత్యా ఆమెకు కాస్త రెస్ట్ అవసరం వుంది కాబట్టి.. ఛాంబర్ కి రాలేదని ఆమె సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఏదైతేనేం.. అత్యంత కీలకమైన ఎన్నికల రిజల్ట్ సమయంలో జయసుధ రాకపోవడం పెద్ద సంచలనంగానే మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayasudha news  maa elections controversy  rajendra prasad gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more