MAA Elections 2015 | Live Updates | Rajendra Prasad Jaya Sudha | Tollywood

Rajendra prasad won in maa elections results

MAA Elections 2015, MAA, Rajendra Prasad, Jayasudha, Tollywood Elections, MAA President

MAA Elections 2015, Rajendra prasad won in maa elections results: Movie Artistes' Association (MAA) election results will be release on 17 april. line clearance from high court.

మా ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ఘన విజయం

Posted: 04/17/2015 11:34 AM IST
Rajendra prasad won in maa elections results

మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గెలిపొందారు. ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.  ఫిలింఛాంబర్ లో ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 702 ఓట్లు వుండగా అందులో కేవలం 394 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి.  మా అధ్యక్షుడిగా జయసుధపై రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో గెలిచిన  నటులు రాజేంద్ర ప్రసాద్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి నటి జయసుధ వర్గం వారు చెప్పినట్లుగా ఎలాంటి మంచి పనులు చేయనున్నారో త్వరలోనే తెలియనుంది. మార్చి 29న ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవికోసం నటులు రాజేంద్రప్రసాద్, జయసుధలు పోటీ పడ్డారు. అయితే ఆ తర్వాత రెండు రోజులకే విడుదల కావాలసిన ఫలితాలు ఒ.కళ్యాణ్ కోర్టులో వేసిన పిటీషన్ వలన ఇన్ని రోజులు ఫలితాల విడుదల వాయిదాలు పడుతూ వచ్చాయి.  ఈ ఎన్నికల ఫలితాలకు రిటర్నింగ్ అధికారిగా కృష్ణమోహన్ వ్యవహరించారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన క్షణం నుంచి సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలపై మొత్తం ఏడు రౌండ్లకు గాను అన్ని రౌండ్లలోనూ రాజేంద్ర ప్రసాద్ లీడ్  లో  సాగారు.

Untitled-3

*రాజేంద్ర ప్రసాద్ గెలుపు
* ముందు నుండి లీడ్ లో సాగిన రాజేంద్ర ప్రసాద్
*మరి కొద్ది సేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం
*మా లో ముగిసిన ఆధిపత్యం
* మా ఫలితాల వెల్లడికి ఏడు రౌండ్లలో కౌంటింగ్.
*అన్ని రౌండ్లలో ఆధిక్యం లో రాజేంద్ర ప్రసాద్ ముందుకు దూసుకెళ్ళారు
* మొత్తం  702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి.

*87 ఓట్లతో గెలుపును సొంతంచేసుకున్న రాజేంద్రప్రసాద్
* ఫిలిం ఛాంబర్ లో రాజేంద్ర ప్రసాద్ వర్గం వారు సంబరాలు చేసుకుంటున్నారు.
* జయసుధ వర్గం వారు కొంత నిరాశతో  ఉన్నారు.
*ఈ ఓటమికి మురళీ మోహన్ దే బాధ్యత- బాలచందర్
*రాజేంద్ర ప్రసాద్ ను బలపరిచిన నాగేంద్ర బాబు
* మా లో అవినీతిని ముందు నుండి వ్యతిరేకించిన రాజేంద్ర ప్రసాద్ ప్యానల్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : maa president  maa elections  Rajendra Prasad  Jayasudha  

Other Articles