Ram Charan My Name is Raju Movie story line is inspired by chiru vijetha film

Ram charan srinu vaitla my name is raju movie megastar chiranjeevi vijetha

ram charan news, my name is raju movie, srinu vaitla news, kriti karbanda, rakul preet singh, prakash raj, chiranjeevi, telugu movies, telugu movie news updates, vijetha movie updates, telugu stunt masters

ram charan srinu vaitla my name is raju movie megastar chiranjeevi vijetha : Ram Charan's latest flick my name is raju movie story line is inspired by megastar chiranjeevi's film vijetha which is block buster hit.

తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకోవాలని..

Posted: 04/17/2015 06:21 PM IST
Ram charan srinu vaitla my name is raju movie megastar chiranjeevi vijetha

ఇటీవలే ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంతో ఎదురైన పరాభావాన్ని పూడ్చుకునేందుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఓ సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. అలాగే.. వరుసబెట్టి మాస్ సినిమాలు చేయడంతో ఆ ఇమేజ్ నుంచి తప్పుకుని కాస్త డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు చెర్రీ ప్రయత్నాలు చేస్తున్నాడు. తనలోనూ డిఫరెంట్ యాంగిల్స్ వున్నాయని, ప్రేక్షకులను మరింతగా మెప్పించే పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి.. మరోసారి తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకోవాలని చెర్రీ తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం చరణ్ తన తదుపరి సినిమా శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీ కోసం స్టంట్స్ నేర్చుకునే పనిలో ఇప్పటికే చెర్రీ బ్యాంకాక్ పయనమయ్యాడు. ఈ మూవీలో చెర్రీ స్టంట్ మాస్టర్ గా నటిస్తున్నాడు కాబట్టి.. ఆ పాత్రలో పూర్తిగా లీనమయ్యేందుకు అందులో అక్కడ ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఇక ఇలా స్టంట్ మాస్టర్ గా నటిస్తూనే ఒక చెల్లికి అన్నయ్యగా ప్రేక్షకులను మెప్పించే పాత్రలోనూ చెర్రీ నటిస్తున్నాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సినిమాలో చెర్రీ తన చెల్లిలి కోసం చాలా కష్టపడతాడని, తన సంతోషం కోసం ఇతను కష్టాలు అనుభవిస్తాడని తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.

ఈ స్టోరీ చూస్తుంటే ఇదివరకే వచ్చినట్లు అనిపిస్తోంది కదూ! అవును.. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి ‘విజేత’ సినిమాలో ఫుట్ బాల్ క్రీడాకారుడిగా నటించి.. తన కెరీర్ ని కుటుంబం కోసం త్యాగం చేస్తాడు. ఆ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు చెర్రీ కూడా అదే స్టోరీ లైన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి.. సక్సెస్ సాధించాలని అనుకుంటున్నాడు. అంటే.. చెర్రీ నటిస్తున్న ఈ తాజా సినిమా స్టోరీ చిరు నటించిన ‘విజేత’ నుండి స్పూర్తి పొందారని ఇండస్ట్రీ వర్గాలు చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో చరణ్ తన చెల్లెలి సంతోషంగా వుండాలని కోరుతూ ఎంతో కష్టపడతాడని.. తన జీవితాన్ని త్యాగం చేస్తాడని ఆ మూవీ యూనిట్ పేర్కొంటోంది.

ఇక ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఇందులో చెర్రీకి చెల్లెలుగా కన్నడ బ్యూటీ కృతి కర్బంద నటిస్తోంది. ఇక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నట్లు సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan tej  my name is raju movie  rakul preet singh  

Other Articles