Rajendraprasad | Maa | Elections | Nagababu

Rajendraprasad meet the press after won in maa elections

Rajendraoprasad, jayasudha, maa, elections, filmchamber,

rajendraprasad meet the press After won in maa elections. Rajendraprasad said that nagababu suppoted him alot. In the elections. He assure for implement all his promises to the artists.

హామీలన్నీ నెరవేరుస్తాం.. నాగబాబు గారికి ధన్యవాదాలు: రాజేంద్రప్రసాద్

Posted: 04/17/2015 01:39 PM IST
Rajendraprasad meet the press after won in maa elections

మా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రాజేంద్ర ప్రసాద్ తన ప్యానెల్ సభ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మా ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై రాజేంద్ర ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. పదవికి పోటీపడిన తనను భయపెట్టారని, కుళ్లు రాజకీయాలు, కుట్రలు చేశారని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేంద్రప్రసాద్ అన్నారు. మా ఎన్నికలు ఏ తీరులో జరిగాయో గత 15-20 రోజుల నుంచి ఏం జరిగిందో అంతా మీడియాలో వస్తూనే ఉందని వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్ మాటల్లో హైలెట్స్..

*రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగువారంతా ఈ ఎన్నికల గురించి ఏమైందోనని ఆసక్తిగా ఎదురుచూశారు.
*ఇది కేవలం సేవా కార్యక్రమం. కళాకారులకు సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లడానికి రాలేదు.
*మమ్మల్ని భయపెట్టారు, ప్రలోభపెట్టారు, కుళ్లు, కుత్సిత రాజకీయాలు చేశారు. నేను వాటికి పనికిరాను, అవేంటో నాకు తెలీదు.
*ఎన్ని పరీక్షలు దాటుకుని ఇక్కడకు వచ్చామో మీకే తెలుసు. మేం ఒంటరిగా పోరాటం చేశాం..
*ఇది ధర్మయుద్ధం. పిరికివాడుంటే రాజు ముందుకు వెళ్లలేడంటూ నా వెనకున్న ఏకైక వ్యక్తి.. నాగబాబు.
*రాజా.. ముందుకెళ్లు అన్నారు. నామీద మీకున్న ప్రేమ
*నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేనన్న ప్రతి మాటను నెరవేరుస్తా. ఏమాటా మర్చిపోయే అవకాశమే లేదు.
*విజయచందర్ లాంటి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నాకు అండదండగా ఉన్నారు. మీరు గెలిచి తీరాలని ఆశించారు.
*ఈ విజయం నాది కాదు.. ఓట్లేసిన వాళ్లదే. అందరికీ సాష్టాంగ నమస్కారం.
*నాకు నాయకత్వం ఆపాదించొద్దు. ఆ మత్తు తలకెక్కితే కష్టం.
*నిమ్మకూరులో నందమూరి తారకరామారావు ఇంట్లో పుట్టిన నేను.. ఆయన స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను.
*ఇంత మెజారిటీతో గెలవడం మా చరిత్రలో ఎప్పుడూ లేదు. అంటే ఎక్కువ మంది నన్ను పనిచేయమని కోరుకుంటున్నారు.

** అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajendraoprasad  jayasudha  maa  elections  filmchamber  

Other Articles