menstrual cycle problems escape tips women

Menstrual cycle problems

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips, romantic timings

menstrual cycle problems escape tips women : healthy tips for women to escape from menstrual cycle problems

గర్భాశయంలోపల ఉండే పొర

Posted: 02/01/2012 08:11 PM IST
Menstrual cycle problems

Menstrual_Cycle_Problems2
ఎండోమెట్రియాసిస్
గర్భాశయంలోపల ఉండే పొర ఎండోమెట్రియమ్. ఇది గర్భాశయంలోపలే పెరగాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అది ట్యూబ్స్‌పై, గర్భాశయం మీద, పొత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై పెరిగితే..? చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులో ఏర్పడితే...? గర్భం ధరించకపోతే గర్భాశయంలోని ఆ పొర మందం కావడం ఆగిపోయి... రక్తస్రావం ద్వారా వెళ్లిపోవాలి. ఒకవేళ అలాంటి రక్తస్రావమే పై కీలక భాగాలలో అయితే...? అదే ఎండోమెట్రియాసిస్. కొందరు మహిళల్లో కనిపించే ఈ కండిషన్‌పై అవగాహన కోసం ఈ కథనం.

గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రుతుక్రమంలో ఈ ఎండోమెట్రియం పొర అనేక మార్పులకు లోనవుతుంది. ఒకసారి రుతుస్రావం అయిన తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడం వల్ల అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులు వృద్ధి చెందుతుంది. అది 7 నుంచి పది మిల్లీమీటర్ల మందం ఉంటుంది. 15వ రోజు నుంచి విడుదల అయ్యే ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల పొర మరింత వృద్ధి చెందుతుంది. దానికి సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

రుతుస్రావం ఎందుకు కనిపిస్తుందంటే...

ఎండోమెట్రియమ్‌లో రక్తనాళాలు అభివృద్ధి చెందాక... అండం శుక్రకణంతో కలవడం జరగకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం.

కొంతమందిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయం లోపల కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపై, ట్యూబ్స్‌పై, గర్భాశయం పై పొరపై, పొత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులో ఏర్పడుతుంది. హార్మోన్ల ప్రభావం వల్ల అది రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతుందో... అలాంటి మార్పులే అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతాయి. మెన్సెస్ సమయంలో ఆ అవయవాల్లో కూడా అలాగే కొద్దిపాటి బ్లీడింగ్ అవుతుంది. వీటిని ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. ఈ కండిషన్‌ను ఎండోమెట్రియాసిస్ అంటారు. ఇది 5-10 శాతం మహిళల్లో ఉంటుంది.

వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్‌లో రక్తస్రావం జరిగి అది బయటకు వెళ్లడానికి మార్గం లేక కొందరిలో రక్తం అక్కడ కరిగిపోతుంది. అయితే కొందరిలో రక్తం గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య కండ వంటిది పెరగడం జరగవచ్చు. వాటిని అడ్‌హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్‌తో పాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అంటే... అండాశయాల పైన ఎండోమెట్రియాసిస్ ఏర్పడటం వల్ల అక్కడ నెలనెలా రక్తం గూడు కట్టి అది మెల్లగా చాకొలెట్ సిస్ట్‌గా రూపాంతరం చెందుతుంది. వ్యాధి విస్తరించిన తీరును బట్టి ఎండోమెట్రియాసిస్‌ను ఒకటి నుంచి నాలుగు దశలుగా చెప్పవచ్చు.

లక్షణాలు... కొందరిలో వ్యాధి తీవ్రంగా ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు.
ఎండోమెట్రియాసిస్‌లో కనిపించే సాధారణ లక్షణం పొత్తికడుపులో నొప్పి లేదా ఎండోమెట్రియాసిస్ అభివృద్ధి చెందే ప్రదేశాన్ని బట్టి కూడా వ్యాధి లక్షణాలు ఉంటాయి.

నొప్పి : కొందరిలో మొదటి దశలో ఉన్నా తీవ్రంగా నొప్పి రావచ్చు. మరికొందరిలో అది నాలుగో దశలో ఉన్నా నొప్పి లేకపోవచ్చు. కొందరిలో పొత్తికడుపులో నొప్పి లేకుండా వేరే భాగాల్లో అంటే... నడుములో, తొడలో కూడా రావచ్చు.
- డిస్‌మెనోరియా: మెన్సెస్ సమయంలో పొత్తికడుపులో నొప్పి తీవ్రంగా ఉంటూ నెలనెలా నొప్పి తీవ్రత పెరుగుతూ ఉండవచ్చు. కొందరిలో మెన్సెస్ అయ్యే వారం ముందునుంచీ నొప్పి ఉండవచ్చు.
- క్రానిక్ పెల్విక్ పెయిన్: మెన్సెస్‌తో సంబంధం లేకుండా పొత్తికడుపులో నొప్పితో పాటు, అప్పుడప్పుడు నడుము నొప్పి రావచ్చు.
- డిస్‌పెరూనియా: కలయిక సమయంలో పొత్తికడుపులో, నడుములో నొప్పి రావచ్చు.
- కొందరిలో మూత్ర విసర్జన, మల విసర్జన సమయంలో నొప్పి వచ్చి మెన్సెస్ సమయంలో అది పెరగవచ్చు.
- చాలా అరుదుగా కొందరిలో సిజేరియన్ సమయంలో ఎండోమెట్రియల్ టిష్యూ... పొట్ట మీద కుట్ల దగ్గర ఉండిపోయి... మెన్సెస్ సమయంలో కుట్ల వద్ద రక్తస్రావమై పైన వాపు, నొప్పి వచ్చి, తగ్గుతుండవచ్చు.

ఎండోమెట్రియాసిస్‌తో సమస్యలు...
- సంతానలేమి: ఎండోమెట్రియాసిస్ ఉన్నవారిలో పొత్తికడుపులో అవయవాల మధ్య అతుకులు ఏర్పడటం వల్ల అండాశయం నుంచి అండం - ట్యూబ్స్‌లోకి వెళ్లదు. దాంతో కొందరిలో గర్భం రాకపోవచ్చు.
- కొంతమందిలో ఈ కణజాలం నుంచి విడుదల అయ్యే రసాయనాల ప్రభావం వల్ల అండం నాణ్యత తగ్గుతుంది. దాని వల్ల కూడా గర్భధారణ జరగకపోవచ్చు.
- అండాశయంలో వచ్చే చాక్లెట్ సిస్ట్ నెలనెలా పెరగడం వల్ల కొందరిలో అండాశయం మీద ఒత్తిడి ఏర్పడుతుంది. అది అండాశయాన్ని నొక్కివేయడం వల్ల అండం విడుదల కాకపోవచ్చు.

గడ్డలు: చాక్లెట్ సిస్ట్స్ కొందరిలో మెలికపడటమో లేదా పగిలిపోవడమో జరగవచ్చు. అవి పెరిగే కొద్దీ మిగతా అవయవాలపై ఒత్తిడితో నొప్పి రావచ్చు. అవి పగలడం వల్ల గూడు కట్టిన రక్తం పొత్తికడుపులోకి చేరి అవయవాల మధ్యన అతుకులు ఇంకా పెరగవచ్చు. పేగులు అతుక్కుపోవచ్చు. మూత్రం పైపులు, పేగుల్లో అడ్డంకులు రావచ్చు.

నిర్ధారణ... చాలా మందిలో లక్షణాలను బట్టి ఎండోమెట్రియాసిస్ ఉండవచ్చునని డాక్టర్లు అనుమానిస్తారు.
- కొందరిలో స్పెకులమ్ అనే పరీక్ష చేసినప్పుడు యోనిలోపల ఎండోమెట్రిక్ ఇంప్లాంట్స్ కనిపించవచ్చు. పరీక్ష చేసే సమయంలో నొప్పి ఉండవచ్చు. చేతికి గట్టిగా చిన్న గడ్డలు తగలవచ్చు. కొంతమందిలో ఏమీ తగలకపోవచ్చు. కొందరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నా పరీక్షలో కనిపించకపోవచ్చు.
- అల్ట్రాసౌండ్ స్కానింగ్ : కొందరిలో వ్యాధి ఒకటి, రెండు దశలలో ఉన్నప్పుడు స్కానింగ్‌లో ఏమీ తెలియకపోవచ్చు. అండాశయంలో చాక్లెట్ సిస్ట్ ఉంటే స్కానింగ్‌లో గడ్డల్లా కనిపిస్తాయి. అయితే స్కానింగ్‌తో ఖచ్చితంగా వాటి నిర్ధారణ జరగదు.
- ఎమ్మారై : ఇందులో కూడా ఖచ్చితంగా ఎండోమెట్రియాసిస్ నిర్ధారణ జరగకపోవచ్చు. అయితే ఎండోమెట్రియాసిస్ ఆస్కారాన్ని పసిగట్టవచ్చు.
- రక్తపరీక్షలు : ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు సీఏ 125 అనే రసాయనం రక్తంలో పెరుగుతుంది. అయితే మరికొన్ని వ్యాధుల్లోనూ ఇది జరుగుతుంది.
- కొందరిలో ఆపరేషన్ సమయంలో నేరుగా చూసినప్పుడు ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్, అడ్‌హెషన్స్, చాక్లెట్ సిస్ట్స్ కనిపిస్తాయి. దీన్ని బట్టి అది ఏ దశలో ఉందో తెలుస్తుంది. తర్వాత ఆ ముక్కను సేకరించి, దాన్ని బయాప్సీకి పంపినప్పుడూ నిర్ధారణ అవుతుంది. దీన్ని ల్యాపరోస్కోపీ ద్వారా లేదా గాటు పెట్టడం ద్వారా చేయవచ్చు.

చికిత్స... లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. కొంతమందిలో నొప్పి నివారణ మందులతో చికిత్స చేస్తారు కొంతమందికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ పిల్స్ కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఇవ్వడం కొంతమందిలో కేవలం ప్రొజెస్టరాన్ పిల్స్ లేదా ఇంజెక్షన్స్ లేదా వేరే హార్మోన్స్ ద్వారా చికిత్స చేయవచ్చు మందులు ఇచ్చినా కొందరిలో ఎండోమెట్రియాసిస్ తిరగబెట్టవచ్చు. చాక్లెట్ సిస్ట్స్ పెద్దగా ఉన్నప్పుడు ఆపరేషన్ తప్పనిసరి.

ఆపరేషన్: ఇందులో ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్‌ను కాల్చేయడం లేదా మరీ పెద్దగా ఉంటే తొలగించడం జరుగుతుంది. చిన్న గాటు (ల్యాపరోస్కోపీ) ద్వారా లేదా సంప్రదాయ శస్త్రచికిత్స రూపంలో పొట్టకు గాటు వేసి దీన్ని చేస్తారు. ఆపరేషన్ తర్వాత కూడా మళ్లీ గర్భధారణకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాక్లెట్ సిస్ట్స్ తర్వాత మళ్లీ అవి పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారిలో అవసరాన్ని బట్టి గర్భాశయాన్ని, అండాశయాలను తొలగించాల్సి రావచ్చు. తిరగబెట్టినప్పుడు రెండు మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి రావచ్చు.

కారణాలు
ఎండోమెట్రియాసిస్‌కు కారణాలు నిర్దిష్టంగా ఇంకా వెల్లడి కాలేదు. అయితే దీనికి కారణాలను తెలిపేందుకు చాలా సిద్ధాంతాలు (థియరీస్) ఉన్నాయి.

జన్యుపరమైన కారణాలు, పర్యావరణంలో మార్పులు, హార్మోన్ల మార్పుల వంటి ఎన్నో కారణాల వల్ల ఇది రావచ్చునని ఈ సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఆ సిద్ధాంతాల వివరాలివి...

సాధారణంగా మెన్సెస్ సమయంలో ఎండో మెట్రియమ్ అన్న పొర సర్విక్స్ నుంచి యోని బయటకు వచ్చేస్తుంది. అయితే కొందరిలో అది గర్భాశయం నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా పొత్తికడుపులోకి చేరుతుంది. రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉన్నవారిలో అది అక్కడ కరిగిపోతుంది. అయితే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న కొందరిలో అది కడుపులోని వివిధ అవయవాలపై అంటుకుని ప్రతి నెలా వృద్ధి చెందుతుంది. ఇది శ్యామ్ప్‌సన్ సిద్ధాంతం

కొంతమందిలో పొత్తికడుపులోని పెరిటోనియమ్ పొరలోని కణాలు ఎండోమెట్రియ్ కణాలుగా మార్పు చెంది ఎండోమెట్రియమ్ వ్యాధికి దారితీస్తాయి. కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు రక్తం లేదా లింఫాటిక్ వ్యవస్థ వల్ల అరుదుగా ఊపిరితిత్తుల్లోకి, మెదడులోకి చేరవచ్చు.

ఎవరిలో ఎక్కువ... గర్భాశయంలో బ్లీడింగ్ బయటకు రావడానికి అడ్డుపడే తరహా లోపాలు (యుటిరైన్ సెప్టమ్స్) ఉన్నవారిలో పిల్లలు లేనివారిలో పీరియడ్స్ తొందరగా... అంటే 20 రోజులకే వచ్చే వారిలో.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more