Tokyo Olympics: Boxer Lovlina Borgohain wins bronze medal టోక్యో ఒలంపిక్స్: కాంస్యపతకం సాధించిన లవ్లీనా

Tokyo olympics lovlina borgohain settles for bronzeafter losing semi final

Lovlina Borgohain, Lovlina Borgohain tokyo olympics, Lovlina Borgohain boxing, Lovlina Borgohain boxing semifinals, Lovlina Borgohain sumo, tokyo olympics news, sports news

Indian boxer Lovlina Borgohain (69kg) signed off with a bronze medal in the Olympic Games after a comprehensive 0-5 loss to reigning world champion Busenaz Surmeneli here on Wednesday, bringing an end to the country's campaign in the sport here.

భారత్ ఖాతాలో మరో కాంస్యం.. బాక్సింగ్ లో లవ్లీనాకు పతకం..

Posted: 08/04/2021 02:11 PM IST
Tokyo olympics lovlina borgohain settles for bronzeafter losing semi final

టక్యో ఒలింపిక్స్‌లో భారత క్రిడాకారులు ఉత్తమ ప్రదర్శనలు కనబరుస్తున్నారు. అయితే తమ క్రీడలో ఆది నుంచి వచ్చిన ఉత్సాహం, నేర్పు, సెమీస్ వరకు వెళ్లిన తరువాత కొరవడుతోంది. ఎందుకనో భారత క్రీడాకారులు సెమీ ఫైనల్స్ ను ధీటుగా ఎదుర్కోనలేకపోతున్నారు. మెరుగైన ప్రదర్శనను కనబర్చ లేకపోతున్నారు. గత రియో ఒలంపిక్స్ లో  రజతం సాధించిన స్టార్ షెట్లర్ పివీ సింధు ఈ సారి స్వర్ణం పై గురి పెట్టినా.. కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా ఇండియ‌న్ బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్ కూడా అదే కాంస్యానికి పరిమితం అయ్యింది.

బుధ‌వారం 64-69 కేజీల విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ట‌ర్కీ బాక్స‌ర్ బుసెనాజ్ సూర్మ‌నెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్ల‌లోనూ ట‌ర్కీ బాక్స‌ర్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఐదుగురు జ‌డ్జీలు ఏక‌గ్రీవంగా ఆమెనే విజేత‌గా తేల్చారు. ఈ ఓట‌మితో ల‌వ్లీనా బ్రాంజ్ మెడ‌ల్‌తో స‌రిపెట్టుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్లో ఇండియాకు వ‌చ్చిన మూడో మెడ‌ల్ ఇది. గ‌తంలో విజేంద‌ర్‌, మేరీకోమ్ కూడా బ్రాంజ్ మెడ‌ల్స్ గెలిచారు. ఈ టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా గెలిచిన మూడో మెడ‌ల్ ఇది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సిల్వ‌ర్‌, బ్యాడ్మింట‌న్‌లో సింధు బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇప్పుడు బాక్సింగ్‌లో ల‌వ్లీనా బోర్గోహైన్ మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ తీసుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lovlina Borgohain  boxing  bronze medal  Indian boxer  Assam  sports  Tokyo Olympics  

Other Articles