Neeraj Chopra tops qualifiers with 86.65m throw జావెలిన్ త్రో ఫైనల్ కు అర్హత సాధించిన నీరిజ్ చోఫ్రా

Olympics neeraj chopra qualifies for javelin throw final with first attempt of 86 65m

neeraj chopra, tokyo 2020 neeraj chopra, mens javelin tokyo 2020, Neeraj Chopra in tokyo 2020, Javelin Thrower Neeraj Chopra, Neeraj Chopra medal, olympic games update, latest olympic news, olympic sports, olympic games olympic games 2020, olympic updates, olympics 2020

Touted as one of India's strongest bets for an Olympic medal, star javelin thrower Neeraj Chopra started his campaign with some style. The Indian qualified for the final of the men's javelin final with the best throw of 86.65m in the men’s javelin throw qualification in group A.

జావెలిన్ త్రో ఫైనల్ కు అర్హత సాధించిన నీరిజ్ చోఫ్రా

Posted: 08/04/2021 01:10 PM IST
Olympics neeraj chopra qualifies for javelin throw final with first attempt of 86 65m

పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్​-ఏలో నీరజ్‌ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు. గ్రూప్-ఏ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి.. నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసరాల్సి ఉంటుంది.. లేదంటే తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది. నీరజ్ చోప్రా ఏకంగా 86 మీటర్లకు జావెలిన్‌ను సంధించడంతో ఆటోమేటిక్‌గా ఫైనల్స్‌కు అర్హత సాధించినట్లయింది.

అలాగే ఈ సీజన్‌లో అతనికి అత్యుత్తమ త్రో కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఇదే గ్రూప్‌లో ఫిన్లాండ్‌కు చెందిన లస్సీ ఎటలాట 84.50 మీటర్ల త్రోతో నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఆ తర్వాత రొమేనియాకు చెందిన అలెగ్రాండ్రూ మిహైతో నోవాక్‌ 83.27 మీటర్లు విరిసి మూడుస్థానంలో నిలిచాడు. స్వీడన్‌కు చెందిన కిమ్‌ అంబ్‌ 82.40 మీటర్లతో నాలుగో స్థానంలో, జర్మన్‌ లెజెండ్‌ జోహన్నెస్‌ వెట్టర్‌ 82.04తో ఐదో స్థానాన్ని నిలుపుకున్నాడు. కాగా, జావెలిన్‌ త్రో ఫైనల్‌ మ్యాచ్‌ ఈ నెల 7న జరుగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neeraj Chopra  Tokyo Olympics 2020  Javelin Thrower  Indian Arthlete  sports  

Other Articles