CWG 2022: Relatively easy opening draws for India's boxers CWG బాక్సింగ్‌: తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ శుభారంభం…

Cwg 2022 india boxing shiva thapa defeats suleman baloch

Commonwealth Games, India defeats pakistan, Indian boxer defeats Pakistan boxer, Indian boxer Shiva Thapa defeats Pakistan’s Suleman Baloch, CWG 2022 campaign, Boxing, Shiva Thapa, Indian boxer, victory, Suleman Baloch, Pakistan, Boxing news, sports

Shiva Thapa vs Suleman Baloch LIVE: India’s big mdal hope in boxing, began his Commonwealth Games campaign on a rousing note by defeating Pakistan’s Suleman Baloch in the first round of the 63.5kg category on Friday. The 28-year-old Thapa hardly broke a sweat as he registered a comprehensive 5-0 win over Baloch to move to the pre-quarterfinals of the light welterweight.

CWG: బాక్సింగ్‌లో భారత్ శుభారంభం… తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం

Posted: 07/29/2022 09:58 PM IST
Cwg 2022 india boxing shiva thapa defeats suleman baloch

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్‌లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్‌లో భారత బాక్సర్ శివ థాప అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐదు పర్యాయాలు అసియా ఛాంపియన్ షిప్ పోటీలలో పతకాన్ని సాధించిన 28 ఏళ్ల శివ.. పాకిస్తాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌ను సునాయాసంగా మట్టికరిపించాడు. పాకిస్థాన్ బాక్సర్ పై పంచులతో విరుచుకుపడటంతో పాటు రింగ్ చుట్టూర తిరుగుతూ చక్కగా ఢిపెండింగ్ కూడా చేసుకున్నాడు.

ప్రపంచ ఛాంఫియన్ షిప్ రజత పతక మాజీ విజేతగా నిలిచిన శివ అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడం కారణంగా అతనిపై పంచ్ విసిరే క్రమంలో పాకిస్థాన్ బాక్సర్ కాన్వస్ పై  పడిపోయాడు. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో 5-0 పాయింట్ల తేడాతో శివ విజయం సాధించాడు. ఈ ఏడాది జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో ఇదే భారత్ ఆడిన తొలి బాక్సింగ్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన శివ.. ఆదివారం నాడు స్కాట్లాండ్‌కు చెందిన రీస్ లించ్‌ను రౌండ్ ఆఫ్ 16లో భాగంగా ఎదుర్కొంటాడు. శివ విజయంతో బాక్సింగ్ క్రీడలో పోటీపడుతున్న మరికొందరు ఆశావహ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CWG 2022 campaign  Boxing  Shiva Thapa  Indian boxer  victory  Suleman Baloch  Pakistan  Boxing news  sports  

Other Articles