ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో క్రీడా శాఖ ఏర్పాట్లు చేసింది. నిఖత్‌తో పాటు జర్మనీలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన సికింద్రాబాద్‌కు చెందిన ఇషా సింగ్, ఫుట్‌బాల్ ప్లేయర్ సౌమ్య కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ముగ్గురికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితో పాటు శాప్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు.
మరోవైపు డప్పులు, ఒగ్గుడోలు, గిరిజన కళాకారులు తమ నృత్యాలతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో యువతతో పాటు క్రీడా అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిఖత్ జరీన్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తనకు ఎంతో సహకరించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నీలలో గెలిచి తెలంగాణే కాదు దేశానికే పేరు తీసుకువస్తానని తెలిపింది. తెలంగాణకు నిఖత్ జరీన్ ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా మంత్రులు కొనియాడారు.
ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం మాములు విషయం కాదని.. ఎంతో కఠోర శ్రమ చేసిందని ప్రశంసించారు. ఇషా సింగ్, సౌమ్యలకు అభినందలు తెలిపారు. క్రీడాకారులకు తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు. టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిలిచింది నిఖత్.
(And get your daily news straight to your inbox)
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more
Dec 16 | భారత స్టార్ షట్లర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో... Read more
Nov 30 | ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. టోర్ని నిర్వహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంత హాకీ మన జాతీయ క్రీడ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఆటలో... Read more
Nov 26 | జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో భారత హాకీ జూనియర్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్ లో ఫ్రాన్స్ చేతిలో పరాభవం ఎదురుకావడాన్ని జీర్ణంచుకోలేని జట్టు.. తన రెండో మ్యాచ్ లో... Read more