Tokyo Olympics: Ravi Kumar bitten by Kazakh wrestler రెజ్లింగ్ సెమీస్ లో రవి చేతిని కొరికేసీన కజక్ ఆటగాడు

Tokyo olympics ravi kumar bitten by kazakh wrestler in semi final bout

Ravi Kumar Dahiya, Sanayev Nurislam (Kazakhstan), Semi-Finals, Finals, Zavur uguev, Russia, World Wrestling Champion, Tokyo Olympics 2020, Wrestling, freestyle wrestling, Wrestling, Indian Wrestlers, wrestling news, india wrestling, Sports, Olympics updates, Semi Finals, Sports, Tokyo Olympics

India's Ravi Kumar Dahiya defeated Kazakhistan's Nurislam Sanayev in 57kg semifinal at the Tokyo Olympics match in a thrilling fashion. It was a big comeback win for the Indian wrestler, who was trailing 2-9 at one point, but then went on to win five points on the trot to close the gap.

రెజ్లింగ్ సెమీస్ లో రవి చేతిని కొరికేసీన కజక్ ఆటగాడు

Posted: 08/05/2021 01:37 PM IST
Tokyo olympics ravi kumar bitten by kazakh wrestler in semi final bout

టోక్యో ఒలింపిక్స్ లో భార‌త రెజ్ల‌ర్ ర‌వి కుమార్ ద‌హియాలు సెమీఫైనల్స్ లో విజయం సాధించారు. 57 కేజీల మెన్స్ ఫ్రీస్ట‌యిల్‌ సెమీస్ లో దహియా పోరాటం భారతీయులు గర్వపడేలా చేసింది. సెమీ ఫైనల్ లో ఓడిపోతాడు అనుకున్న దశలో అద్భుత పోరాటంతో విజయం సాధించాడు. ఒకానొక దశలో ప్రత్యర్థి సనయేవ్ నురిస్లామ్.. రవి కుమార్ భుజాన్ని దారుణంగా కొరికేశాడు. అయినా మన కుస్తీ వీరుడు వెనక్కి తగ్గలేదు. అదే సమయానికి నురిస్లామ్ గాయపడ్డాడు. ఇదే అదనుగా అతడిని 30 సెకన్ల పాటు లేవకుండా చేశాడు దహియా. దీంతో ఆయనను విజయం వరించింది. భారత్ తరఫున రెజ్లింగ్ ఫైనల్ చేరిన రెండో ఆటగాడు దహియానే.

సెమీ ఫైనల్లో కజకిస్తాన్ రెజ్లర్ నూరిస్లామ్ ను ఓడించిన రవికుమార్ భారత్ కు పతకం ఖాయం చేశాడు. ఇక ఫైనల్లో గెలిస్తే స్వర్ణం లేదంటే రజతం మెడల్ ఖాయంగా వస్తుంది. ‘బై ఫాల్‌’ కాకుండా ఉండేందుకు కజకిస్తాన్‌ రెజ్లర్‌ సనయేవ్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. తన మెడను రవి గట్టిగా పట్టుకోవడంతో ఆ పట్టు నుంచి వదిలించుకునేందుకు సనయేవ్‌ రవి చేతిని దారుణంగా కొరికాడు. అయినప్పటికీ రవి నొప్పిని భరిస్తూనే సనయేవ్ కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. అర నిమిషం పాటు ప్రత్యర్థిని కదలనీయకుండా చేసి విజయాన్ని అందుకున్నాడు.

2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌ 66 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరుకుని రజతం సాధించగా.. ఇప్పుడు ఒలంపిక్స్ లో పాల్గోన్న తొలిసారే ఆ స్థాయికి చేరుకున్నాడు రవి దహియా. ఒలింపిక్స్‌ లాంటి అత్యున్నత వేదికపై తొలిసారి బరిలోకి దిగినా ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ప్రత్యర్థుల పట్టు పట్టి.. మూడు వరుస విజయాలతో ‘పసిడి’ పతక పోరుకు సగర్వంగా చేరుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ చరిత్రలో స్వర్ణ-రజత ఫైనల్‌ బౌట్‌కు అర్హత పొందిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి దహియా ఘనత వహించాడు. రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) రెజ్లర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జవూర్‌ ఉగుయెవ్ తో ఫైనల్లో రవి దహియా తలపడనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles