ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ లో వ్యక్తిగత విభాగంలో మెడల్ సంపాదించిన తొలి జిమ్నాస్ట్ గా గుర్తింపు పోందిన ఆమెను టార్గెట్ గా చేసుకుని.. అమె మెడికల్ ఫిట్ నెస్ పరీక్షలకు హాజరుకాగా, అమె అనుమతి లేకుండా వీడియో తీయడం దుమారం రేపింది. కాగా ఆయనపై తాను న్యాయపోరాటం చేస్తానని అరుణారెడ్డి చెప్పడంతో రంగంలోకి దిగిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్.. ముగ్గురు సభ్యులు గల ఓ నిజనిర్థారణ కమిటీని వేసింది.
2018లో మెల్ బోర్న్ లో జరిగిన పోటీల్లో దేశానికి కాంస్య పతకాన్ని సాధించడంతో పాటు తొలిసారిగా జిమ్నాస్టిక్స్ విభాగంలో పతకాన్ని గెలుచుకుని క్రీడాకారిణికగా నిలిచింది. దీంతో శాయ్ టీమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాధికా శ్రీమాన్ నేతృత్వంలో కోచ్ కమలేష్ తివారీ, డిఫ్యూటీ డైరెక్టర్ అపరేషన్స్ కైలాష్ మీనాలతో కూడిన కమిటీని శాయ్ ఏర్పాటు చేసి నిజనిర్థారణ చేసి నివేదిక అందించాలని కోరింది. ఢిల్లీలోని ఐజీఐ స్టేడియంలో ఈ ఏడాది మార్చిలో ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) కోచ్ ఒకరు వీడియో తీసినట్టు అరుణ ఆరోపించారు.
ఫిజికెల్ ఫిట్ నెస్ నిర్ధారణ సమయంలో వీడియో తీయాలంటూ తాము ఆదేశించలేదని జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ తనకు తెలిపినట్టు అరుణ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సదరు కోచ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. బకు వరల్డ్ కప్ కు ముందు కోచ్ మనోజ్ రాణాతో కలసి అరుణ బుద్ధారెడ్డి ఢిల్లీలోని ఐజీఐ స్టేడియంకు 2022 మార్చి 24న వెళ్లడం జరిగింది. ఆ సమయంలో.. తన క్లినికల్, మాన్యువల్ అసెస్ మెంట్ టెస్ట్ సందర్భంగా జైశ్వాల్ అనే ట్రైనీ.. కోచ్ మొబైల్ ఫోన్ నుంచి చిత్రీకరించినట్టు అరుణ వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more
Dec 16 | భారత స్టార్ షట్లర్, ఒలంపిక్స్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరోమారు తన సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో... Read more
Nov 30 | ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో షాకింగ్ ఘటన జరిగింది. టోర్ని నిర్వహకులు ఏకంగా మ్యాచ్ నే రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంత హాకీ మన జాతీయ క్రీడ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఆటలో... Read more
Nov 26 | జూనియర్ హాకీ ప్రపంచ కప్లో భారత హాకీ జూనియర్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్ లో ఫ్రాన్స్ చేతిలో పరాభవం ఎదురుకావడాన్ని జీర్ణంచుకోలేని జట్టు.. తన రెండో మ్యాచ్ లో... Read more