ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్‌కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ క్రీడా సంబరం జరుగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో ఒలింపిక్స్‌ను వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు జపాన్ ప్రధాని షింజో అబె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ 2020ను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతే వాయిదా వేయక తప్పదేమోనని జపాన్ ప్రధాని షింజో అబె అన్నారు. అయితే ఒలింపిక్స్‌ను రద్దు చేసే అవకాశం మాత్రం అసలు లేదని స్పష్టంచేశారు. కాగా, ఒలింపిక్స్ నిర్వహణకు ఉన్న వివిధ మార్గాలపై చర్చిస్తున్నామని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. అవసరమైతే ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తామని ప్రకటించింది. కాగా, ఇటీవలే టోక్యోలో ఒలింపిక్ జ్యోతిని ఆవిష్కరించారు.
కరోనా కట్టడి అమల్లో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి దాదాపు 50వేలమంది క్రీడాభిమానులు హాజరవడం విశేషం. నడియన్ ఒలింపిక్ కమిటీ (సిఓసి) మరియు కెనడియన్ పారాలింపిక్ కమిటీ (సిపిసి) ఈ ఏడాది ఒలింపిక్ మరియు పారాలింపిక్ క్రీడలకు తమ జట్లను పంపబోవని ఆదివారం ప్రకటించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఆ ప్రకటనలో రెండు కమిటీలు.... తమకు అథ్లెట్స్ కమిషన్లు, జాతీయ క్రీడా సంస్థలు మరియు కెనడా ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Sep 13 | ఇరాన్ ఛాంపియన్ రెజ్లర్ నవీద్ అఫ్కారీని ఈ ఉదయం ఉరితీశారు. 2018లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన సమయంలో ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి చంపాడన్న ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు... Read more
Apr 23 | ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి.సింధుకు మరో గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) రాయబారుల బృందంలో సింధుకు చోటు లభించింది. సింధుతో పాటు మిషెల్... Read more
Mar 06 | భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు ఖాతాలో మరో పురస్కారం వచ్చి చేరింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ విజేత తాజాగా మరో 2019 సంవత్సరానికి గాను అత్యుత్తమ క్రీడాకారిణి... Read more
Feb 01 | చిన్ననాటి నుంచి తనకు ఆట మీద మక్కువతో చిచ్చరపిడుగులా చెలరేగిపోయిన తెలుగుతేజం బొడ్డా ప్రత్యూష తాజాగా తన ఖాతాలో మరో టైటిల్ ను దక్కించుకుంది. తాజాగా జరుగుతున్న అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్ లో ఆమె... Read more
Jan 22 | థాయ్‌లాండ్ మాస్టర్స్‌లో మంచి ప్రదర్శన చేసి ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవాలనుకున్న భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే మిగిలింది. ఇండోనేషియా క్రీడాకారుడు షెసర్ హిరెన్ చేతిలో ఓడి తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టాడు. 48... Read more