PV Sindhu is Sportsperson of the Year at TOISA బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఖాతాలో మరో అవార్డు..

Pv sindhu wins top honour at toisa declared sportsperson of the year

P V sindhu, TOISA, Sportsperson Of The Year, Pullela Gopichand, Rohit Sharma, Zafar Iqbal, Yogeshwar Dutt, Vinesh Phogat, Vijender Singh, Pullela Gopichand, MC Mary Kom, Gautam Gambhir, Bhaichung Bhutia, Balbir Singh Sr, sports, cricket, badminton

World champion shuttler PV Sindhu was named Sportsperson of the Year at the fourth Times of India Sports Awards (TOISA) 2019. Rio Olympic silver medallist Sindhu, who won the world championship gold at Basel, Switzerland, last year also bagged the Unbreakable Spirit of Sports award.

పీవీ సింధు ఖాతాలో టైమ్స్ ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు..

Posted: 03/06/2020 05:18 PM IST
Pv sindhu wins top honour at toisa declared sportsperson of the year

భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు ఖాతాలో మరో పురస్కారం వచ్చి చేరింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ విజేత తాజాగా మరో 2019 సంవత్సరానికి గాను అత్యుత్తమ క్రీడాకారిణి పురస్కారం సొంతం చేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల్లో భాగంగా సింధును ఈ ఏటి మేటి క్రీడాకారిణిగా ఎంపిక చేశారు. గత రాత్రి ఢిల్లీలో వేడుకగా జరిగిన ఓ కార్యక్రమంలో సింధుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. గత ఏడాది సింధు కెరీర్లోనే అత్యుత్తమం అని చెప్పాలి.

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచి ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచి ఆ ఘతన సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. కాగా, సింధుకు టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకునే క్రమంలో సింధుకు రోహిత్ శర్మ (క్రికెట్), భజ్ రంగ్ పునియా (రెజ్లర్), వినేశ్ ఫోగాట్ (రెజ్లర్), అమిత్ పంఘాల్ (బాక్సర్), సౌరభ్ చౌదరి (షూటర్), మను భాకర్ (షూటర్) నుంచి గట్టిపోటీ ఎదురైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles