Boxing India stands suspended, says AIBA after national body sets AGM date

Boxing india suspended by international federation

boxing india, india boxing, indian boxing, aiba, international boxing, amateur boxing, rio olympics, rio 2016, 2016 rio olympics, boxing championships, boxing world, boxing world championships, boxing news, boxing, Kishan Narsi, Boxing India, boxing, AIBA AdHoc Committee, AIBA

Indian boxer Gaurav Solanki (52kg) lost to Australian Jack Bowen in the summit clash to settle for a silver medal in the Commonwealth Youth Games today

భరత భాక్సింగ్ నిర్ణయాలు చెల్లవు.. ఎఐబిఎ

Posted: 09/15/2015 06:47 PM IST
Boxing india suspended by international federation

భారత బాక్సింగ్ సంఘంపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం వేటు వేసింది. భారత బాక్సింగ్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయబాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ-అమేచర్) మరోసారి స్పష్టం చేసింది. అక్టోబర్ 3l గౌహతిలో జరిగే వార్షిక సమావేశానికి ఇప్పటికే సస్పెండయిన బాక్సింగ్ ఇండియా షెడ్యూల్‌ను ఖరారు చేయడం చెల్లుబాటు కాదని, ఆ సమావేశానికి విలువ ఉండబోదని తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం భారత బాక్సింగ్ సంఘానికి ఏఐబీఏ చైర్మన్ కిషన్ నార్సీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు.

రెండు వారాల పాటు జాతీయ స్థాయిలో జరిగే వార్షిక సమావేశాల షెడ్యూల్‌ను ఏఐబీఏ పరిధిలో పనిచేసే అడ్‌హక్ కమిటీ మాత్రమే ఖరారు చేస్తుందని నార్సీ పేర్కొన్నారు. భారత బాక్సింగ్ అసోసియేషన్‌కు సంబంధించి సలహాలు, సూచనలకు ఏఐబీఏ ఆమోదం తప్పనిసరిగా పొందాలని నార్సీ తెలిపారు. దీన్ని ఉల్లంఘించినందున భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ బాక్సింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు నూతనంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. కాగా, ఈ తాజా సస్పెన్షన్ వేటు త్వరలో దోహాలో జరిగే వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలపై ప్రభావం చూపనుందని క్రీడా విశ్లేషకులు అభప్రాయపడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kishan Narsi  Boxing India  boxing  AIBA AdHoc Committee  AIBA  

Other Articles