Jwala Gutta and Ashwini Ponnappa included in TOPS, finally

Finally top scheme for jwala gutta ashwini ponnappa

Jwala Gutta, Ashwini Ponnappa, Target Olympic Podium Scheme (TOPS), B Sumeeth Reddy, Manu Atri, National Sports Development Fund (NSDF), 2016 Rio Olympics, Anurag Thakur, Pullela Gopichand

Finally, top Indian women's doubles shuttlers Jwala Gutta and Ashwini Ponnappa have been included in the Target Olympic Podium Scheme (TOPS) by the sports ministry

ఎట్టకేలకు టాప్ లోకి జ్వాలా, అశ్విని జోడి

Posted: 09/16/2015 11:03 PM IST
Finally top scheme for jwala gutta ashwini ponnappa

బ్యాడ్మింటన్ డబుల్స్ జంట జ్వాలా గుప్తా, అశ్వినీ పొన్నప్పలను కేంద్ర క్రీడల మంత్రిత్వ శఖ ఎట్టకేలకు టాప్ పథకంలో స్థానం కల్పించింది. తమ పట్ల కేంద్రంతో పాటు జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ వివక్ష చూపిస్తున్నారంటూ గతంలో జ్వాలాగుత్తా ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం ఈ ఇద్దరినీ టాప్ పథకంలో చేర్చడంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. వీరే కాకుండా ప్రపంచ పురుషుల డబుల్స్‌లో 21వ స్థానంలో ఉన్న డబుల్స్ జోడీ సుమీత్ రెడ్డి, మనూ అత్రిలను కూడా ఈ పథకంలోకి చేర్చారు.

బ్యాడ్మింటన్ క్రీడాకారులు జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప, సుమీత్ రెడ్డి, మను అత్రిలను టాప్ పథకం కింద ఎంపిక చేసినట్లు క్రీడల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2016లో జరగనున్న రియో ఒలింపిక్స్‌కోసం సన్నాహాల్లో భాగంగా శిక్షణ పొందడం కోసం ఈ క్రీడాకారులకు జాతీయ క్రీడల అభివృద్ధి నిధి (ఎన్‌ఎస్‌డిఎఫ్)నుంచి నిధులు లభిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు. రియో డి జనిరోలో వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌కోసం తమ ప్రణాళికలను రూపొందించుకోవాలని కూడా మంత్రిత్వ శాఖ ఈ క్రీడాకారులను కోరింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gutta jwala  ashwini ponnapa  top  Rio lympics training  sports ministry  

Other Articles