Sydney boxer Davey Browne Jr dies in hospital after title fight

Injured sydney boxer taken off life support dies

David Brown, Braydon Smith, Stephen Parnis, Braydon Smith, law student, Toowoomba, Queensland, March, Filipino, John Moralde,Stuart Ayres,Davey Browne Jr,Carlo Magali,Braydon Smith,boxing,Australian Medical Association, Australian Medical Association (AMA) called for a ban on boxing,

The Australian Medical Association (AMA) called for a ban on boxing on Tuesday following the death of a 28-year-old fighter after he was knocked unconscious in the ring.

రింగ్ లో గాయపడిన బాక్సర్.. ఆసుపత్రిలో మృతి

Posted: 09/15/2015 05:56 PM IST
Injured sydney boxer taken off life support dies

బాక్సింగ్ రింగ్ లో తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయిన సిడ్నీ బాక్సర్ డేవిడ్ బ్రౌన్ జూనియర్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. న్యూసౌత్ వేల్స్ లో జరిగిన బాక్సింగ్ పోరులో ప్రత్యర్థి దాటికి బ్రౌన్ కుప్పుకూలిపోయాడు. ఆ తరువాత కాసేపటికి స్పృహలోకి వచ్చిన బ్రౌన్ ను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పోంతున్న బ్రౌన్.. కోమాలోకి జారుకున్నాడు. దీంతో ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందించిన వైద్యలు ఇవాళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు దానిని తొలగించడంతో ఆయన కన్నుమూశారు.

బ్రౌన్ ను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇటీవల రీజనల్ పోరులో భాగంగా న్యూసౌత్ వేల్స్ బాక్సింగ్ ఫైట్ జరిగింది.  కాగా, 12 రౌండ్ల పోరు మరో 30 నిమిషాల్లో ముగుస్తుందనగా ప్రత్యర్థి ఇచ్చిన ముష్టి ఘాతంతో ఒక్కసారిగా కిందిపడిపోయిన బ్రౌన్ కోమాలోకి జారుకున్నాడు. ఆపై ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న అతని బాధ చూడలేని కుటుంబ సభ్యులు చికిత్స ఆపేయాల్సిందిగా డాక్టర్లను కోరారు. బాక్సర్ మృతిపట్ల న్యూసౌత్ వేల్స్ మంత్రి స్టువర్ట్ ఎయిర్స్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

బ్రౌన్ మరణంతో అస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్ బ్యాకింగ్ క్రీడను తమ దేశంలో నిషేధించాలని పిలుపునిచ్చింది. ఇది అత్యంత ప్రమాదమైన క్రీడగా పేర్కోన్న మెడికల్ అసోసియేషన్ దీనిని అడేందుకు యువతను ప్రోత్సహించరాదని సూచించింది. గత ఆరు మాసాల్లో అస్ట్రేలియాకు చెందిన ఇద్దరు యువకులు ఈ క్రీడలో ప్రాణాలను పొగొట్టుకున్నారని తెలిపింది. గతంలో బ్రేడన్ స్మిత్ అనే అస్ట్రేలియా న్యాయశాస్త్ర విద్యార్ధి కూడా బాక్సింగ్ వల్ల ప్రాణాలను కోల్పయాడని అస్ట్రేలియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : David Brown  Braydon Smith  Stephen Parnis  

Other Articles