Sourav Ganguly lauds super performance from Indian team టీమిండియా కుర్రాళ్లకు దాదా ప్రత్యేక అభినందనలు

Not easy in their country bcci president lauds super performance from indian team

Sourav Ganguly, Team India, ENG Vs IND, Manchester, final ODI, Rishabh pant, Hardhik Pandya, England, jos butler, Rahul Dravid, Rohit Sharma, Virat Kohli, Ravi Shastri, england vs india, hardik pandya, pandu, Cricket news, Sports news, Cricket, Sports

BCCI president Sourav Ganguly congratulated the Indian team for coming out victorious from the England series. In a tweet, Ganguly hailed the main figures of the Indian team and gave special attention to two of the best Indian players from the tour - Rishabh Pant and Hardik Pandya.

టీమిండియా కుర్రాళ్లకు బిసిసిఐ అధ్యక్షుడి అభినందనలు

Posted: 07/18/2022 09:13 PM IST
Not easy in their country bcci president lauds super performance from indian team

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా హస్తగతం చేసుకుని మీసాన్ని మెలేసింది టీమిండియా. ఇంగ్లాండ్ పై వారి స్వదేశంలో అతిధిగా వెళ్లిన టీమిండియా.. ఎక్కడా వెనక్కు తగ్గకుండా ఈ రెండు సీరీస్ లను 2-1తో గెలుచుకుని విజేతగా నిలించింది. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ క్రికెటర్లు, ప్రముఖులతో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కితాబులు అందుకుంటోంది టీమిండియా.

తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా జట్టు అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిందని కితాబిచ్చాడు. ట్విటర్ వేదికగా గంగూలీ స్పందిస్తూ… ‘ఇంగ్లండ్ లో అద్భుత ప్రదర్శన. వాళ్ల దేశంలో ఇంగ్లండ్ ను ఓడించడం అంత ఈజీ కాదు. టెస్టులలో 2-2 తో సిరీస్ సమం చేసి టీ20, వన్డేలలో సిరీస్ నెగ్గడం గొప్ప విషయం. వెల్ డన్ ద్రావిడ్, రోహిత్ శర్మ, రవిశాస్త్రి (గతేడాది నాలుగు టెస్టులకు శాస్త్రినే హెడ్ కోచ్), విరాట్ కోహ్లీ. పంత్ చాలా స్పెషల్..’అని ట్వీట్ చేశాడు.

ఇంగ్లండ్ తో మాంచెస్టర్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగినా.. దానిని భారత బౌలర్లు వరుస వికెట్లతో నియంత్రించారు. దీంతో 45.5 ఓవర్లలో 259 పరుగులుకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. జోస్ బట్లర్ (60) టాప్ స్కోరర్. అనంతరం భారత జట్టు 42.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (125 నాటౌట్) వన్డేలలో తొలి సెంచరీ చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్ ను 2-1 తో గెలిచింది. అంతకుముందు టీ20లలో కూడా 2-1తో సిరీస్ ను నెగ్గిన విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sourav Ganguly  Team India  ENG Vs IND  Manchester  final ODI  Rishabh pant  Hardhik Pandya  Cricket  Sports  

Other Articles