All squads for Women's T20 Asia Cup 2022 మహిళల టీ20 ఆసియా కప్ బరిలో తెలుగమ్మాయి మేఘన

Who is s meghana indian cricketer to watch out for

meghana Indian woman cricketer, Asia Cup, Women's World Cup, Indian female cricketer, Andhra pradesh female cricketer, woman cricketer krishna district, meghana career, s meghana cricketer, s meghana matches, meghana awards, Cricket news, sports news, Cricket, sports

Sabbhineni Meghana is an Indian cricketer who played for Andhra, South Zone and Railways. The right-handed batter also played International games for the national team in 2016. She was part of the Indian Cricket team in six T20 International tournaments. The 25-year-old cricketer has played exceptionally well for the domestic circuit and is looking forward to a big opportunity in the coming Women’s Asia Cup. Meghana was born on June 7, 1996 in Krishna, Andhra Pradesh. Her father was a divisional engineer in NTPC thermal power station and her mother was a homemaker.

మహిళల టీ20 ఆసియా కప్ బరిలో తెలుగమ్మాయి మేఘన

Posted: 09/22/2022 01:13 PM IST
Who is s meghana indian cricketer to watch out for

తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ ప్రతిభను చాటుతున్నారు. ఇక తాజాగా క్రీడారంగంలోనూ తెలుగు అమ్మాయి సత్తా చాటునుంది.అందులోనూ అభిమానులు అధికంగా ఉండే క్రికెట్ లో తన అద్భుత ప్రతిభతో రాణించి.. ఏకంగా జాతీయ జట్టులో స్థానం పోందింది. అమె మరెవరో కాదు సబ్బినేని మేఘన. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన మేఘన ఆసియా కప్ జట్టుకు భారత్ అడే జట్టు ప్రాపబుల్స్ లో స్థానం దక్కించుకుంది.

బంగ్లాదేశ్ లోని సైలెట్ వేదికగా అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును ఆలిండియా మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. హర్మన్ ప్రీత్  కౌర్ కెప్టెన్సీలో మొత్తం 15 మందితో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. ఇక ఆ జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ సబ్బినేని మేఘనకు చోటు దక్కింది. ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, పాకిస్థాన్, ఆతిథ్య బంగ్లాదేశ్‌, శ్రీలంక, యూఏఈ, థాయ్‌లాండ్‌, మలేసియా బరిలో నిలిచాయి.

తాలిబన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ లో అమ్మాయిల ఆటపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆఫ్ఘన్ క్రికెట్‌ టీమ్‌ ఈ టోర్నీకి దూరంగా ఉంది. తొలి రోజు, అక్టోబర్1న భారత్–శ్రీలంక మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 3, 4 వ తేదీల్లో భారత్.. వరుసగా మలేసియా, యూఏఈతో తలపడుతుంది. ఏడో తేదీన చిరకాల ప్రత్యర్థి పాక్‌ ను ఢీకొట్టనుంది. 8న బంగ్లాతో, 10న థాయ్‌లాండ్‌తో పోటీ పడుతుంది. 11, 13వ తేదీల్లో సెమీఫైనల్స్‌, 15న ఫైనల్‌ షెడ్యూల్‌ చేశారు.
 
భారత జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోశ్(కీపర్), స్నేహ్ రాణా, దయలన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవ్గిరే.
స్టాండ్ బై ప్లేయర్లు: తానియా సప్నా భాటియా, సిమ్రన్ దిల్ బహదూర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meghana Indian woman cricketer  Asia Cup  Women's World Cup  female cricketer  Cricket  sports  

Other Articles