ENG Vs IND: India Thrash England By Five Wickets, Seal Series 2-1 వన్డే సిరీస్ టీమిండియా వశం.. పంత్, హార్థిక్ విజయవిహారం..!

Ind vs eng 3rd odi manchester pant s century hardik s all round show power india to series win

ind vs eng,ind vs eng odi,odi,ind vs eng 2022,ind vs eng odi 2022,ind vs eng 3rd odi,3rd odi,ind vs eng live,ind vs eng 3rd odi 2022,ind vs eng match,ind vs eng score,india vs england odi,india england odi,india vs england 2022,india vs england live,india vs england match,india england match,india vs england 3rd odi, rishab pant, hardhik pandya, rohit sharma, rahul dravid, manchester, Teamindia, ODI series, Cricket, sports

Hardik Pandya and Rishabh Pant produced career-best performances to help India beat England in the third and final ODI match at Old Trafford, Manchester. Pant not only showed that he has grown as a cricketer, but also send a warning to other teams to beware of him. It has also been a series to remember for Hardik. His cricketing graph has only gone one way since the IPL triumph – that is up.

వన్డే సిరీస్ టీమిండియా వశం.. పంత్, హార్థిక్ విజయవిహారం..!

Posted: 07/18/2022 08:21 PM IST
Ind vs eng 3rd odi manchester pant s century hardik s all round show power india to series win

ఇంగ్లండ్ తో చివరి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. మాన్ చెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అతిధ్యజట్టుపై టీమిండియా స్పష్టమైన అధిపత్యాన్ని కనబర్చింది. ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియా జట్టను రిషబ్ పంత్, హర్ధిక్ పాండ్యాలు విజయతీరాలకు చేర్చారు. ఆది నుంచి ఆచితూచి ఆడుతున్న రిషబ్ పంత్.. అజేయ సెంచరీతో చెలరేగిపోగా, టీమిండియా మరో 47 బంతులు మిగిలుండగానే జయభేరి మోగించింది. పంత్ కు వన్డేల్లో ఇదే తొలి సెంచరీ. పంత్ 113 బంతుల్లో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 16 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

పంత్ సెంచరీ సాయంతో టీమిండియా 42.1 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసి మ్యాచ్ లో విజయాన్ని, తద్వారా 2-1తో వన్డే సిరీస్ ను చేజిక్కించుకుంది. 260 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసినా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోయినా, ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా పని ముగించాడు. చివర్లో డేవిడ్ విల్లీ విసిరిన ఓవర్లో పంత్ వరుసగా 5 ఫోర్లు కొట్టడం హైలైట్ గా నిలిచింది.

పంత్ ను కేవలం డిఫెండింగ్ చేస్తూనే మ్యాచ్ ను ముందుకు తీసుకువెళ్తామని మరో ఎండ్ లో వున్న హార్థిక్ పాండ్యా ఆయన భారీ షాట్లకు యత్నించిన ప్రతీసారి నియంత్రిస్తూనే వచ్చాడు. దీంతో ఆచితూచి ఆడుతూ వచ్చిన పంత్.. సెంచరీని కూడా తనదైన విజృంభనతోనే సాధించి.. ఆ తరువాత విల్లీ ఓవర్లో చెలరేగిపోయాడు. అటు హార్థిక్ పాండ్యా కూడా 55 బంతుల్లో 10 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. పాండ్యా అవుటైన తర్వాత రవీంద్ర జడేజా బరిలో దిగాడు. అతడు కూడా పరిస్థితికి తగ్గట్టుగా ఆడగా, మరో ఎండ్ లో పంత్ విజృంభించాడు. దాంతో టీమిండియా సునాయాసంగా గెలుపు తీరాలకు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles